జ‌పాన్‌ లో రేవంత్ చేస్తున్న పనేంటి!

“రండి పెట్టుబ‌డులు పెట్టండి. మీకు అవ‌స‌ర‌మైన స‌కల సౌక‌ర్యాలుక‌ల్పించేందుకు మా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది“ అని రేవంత్ రెడ్డి జ‌పాన్ పారిశ్రామిక వేత్త‌ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం జపాన్‌ పర్యటనలో ఉన్నఆయ‌న టోక్యోలో నిర్వహించిన ఇండియా-జపాన్‌ భాగస్వామ్య కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి జ‌పాన్‌కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైద‌రాబాద్ పెట్టుబ‌డులకు గ‌మ్య స్థానంగా మారిద‌న్నారు. అనేక ఎక‌రాల భూమి అందుబాటులో ఉంద‌ని.. కేవ‌లం కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే అనుమ‌తులు ఇస్తామ‌ని చెప్పారు.

మౌలిక స‌దుపాయాల‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు కూడా చేస్తామ‌ని సీఎం చెప్పారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అనుకూల ప‌రిస్థితులను వివ‌రించారు. ముఖ్యంగా విద్యావంతులైన యువ‌త అందుబాటులో ఉంద‌న్నారు. మెరుగైన శ్రామిక శ‌క్తి కూడా అందుబాటులో ఉంద‌న్నారు. అలాగే, లైఫ్‌ సైన్సెస్‌, జీసీసీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయ‌ని చెప్పారు. అదేవిధ‌దంగా హైద‌రాబాద్‌లో ఫ్యూచర్‌ సిటీ ని నిర్మిస్తున్న‌ట్టు తెలిపారు. మూసీ న‌దిని తిరిగి ప్ర‌క్షాళ‌న చేస్తున్న‌ట్టు వివ‌రించారు. భారత్‌, జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్ నిర్మించే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

ప‌లు ఒప్పందాలు.

+సీఎం రేవంత్ రెడ్డి ప‌లు పెట్టుబ‌డుల‌కు సంబంధించి  ఒప్పందాలు చేసుకుంది. వీటిలో ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీలు కూడా ఉన్నాయి.
+ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన డేటా సెంట‌ర్‌ను ఏర్పాటు చేసుకునేందుకు 10 వేల కోట్ల రూపాయ‌ల పైచిలుకు మొత్తంతో క్ల‌స్టర్ సెంట‌ర్ ఏర్పాటు ఒప్పందం కుదిరింది.
+ ఎన్‌టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నాయి.
+ రుద్రారంలో రూ.562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది.
+ ఈ ఒప్పందం ద్వారా విద్యుత్‌ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలురానున్నాయి.