గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి అడుగు పెడతారని తరచూ వార్తలు వచ్చేవి. ఆయన బెంగాల్‌లో ఏదో ఒక పార్టీలో చేరతారని, ముఖ్యమైన హోదా తీసుకుంటారని రకరకాల ఊహాగానాలు వినిపించేవి. కానీ, అలాంటి వార్తల నుంచి గంగూలీ ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. రాజకీయాలపై తన వైఖరిని క్లియర్‌గా చెప్పలేదు కానీ, ఆయన మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
తాజాగా పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామకాల సమస్యపై కొందరు ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు తమ నిరసనకు మద్దతు ఇవ్వాలని సౌరవ్‌ను కలిసి కోరారు. అయితే ఈసారి గంగూలీ మరింత స్పష్టతతో స్పందించారు. “దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగకండి. ఈ వివాదంతో నాకు సంబంధం లేదు, ఈ గోడవలు నాకు సంబంధం లేనివి” అని పరోక్షంగా చెప్పేశారు. ఈ సంఘటనతో రాజకీయాలకు ఆయన పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
పాలిటిక్స్ లోకి రావాలి అనుకుంటే ఎవరైనా సరే ముందుగా ఇలాంటి అంశాల విషయంలో ఏదో ఒక విధంగా స్పందించే ప్రయత్నం చేస్తారు. కానీ గంగూలీ ఇలాంటి వివాదాలకు దూరంగానే ఉండాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గంగూలీ స్పష్టమైన మాటలతో, పాలిటిక్స్‌పై తన వైఖరిని చాలా క్లియర్‌గా చెప్పినట్లయింది. గతంలో వచ్చిన వార్తలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడైతే రాజకీయ అంశాలకు తనను దూరంగా ఉంచాలని బహిరంగంగానే కోరారు. దాదా ప్రస్తుతం క్రికెట్ పరిపాలన, ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. రాజకీయాల జోలికి వెళ్లే ఆలోచన తనకు లేదని ఈ సారి బలంగా సూచించారు. అందువల్ల, ఇకపై కూడా గంగూలీపై వచ్చే రాజకీయ వార్తలకు ఎలాంటి ప్రాధాన్యం లేదని ఆయన తాజా స్టేట్‌మెంట్ స్పష్టం చేస్తోంది. ఈ వ్యాఖ్యలతో దాదా అభిమానులు, ఆయన భవిష్యత్ రాజకీయాలపై వచ్చే ఊహాగానాలకు ఇక బ్రేక్ పడినట్లే అని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates