Political News

పవన్ క్లారిటీతో వివాదం సద్దుమణిగినట్టేనా?

త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన ఆవిర్భావ వేడుకల సందర్భంగా శుక్రవారం రాత్రి పిఠాపురంలో మాట్లాడిన సందర్భంగా పవన్ పలు అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగా త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు వైఖరి సరికాదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. త్రిభాషా సిద్ధాంతం కంటే కూడా బహుభాషా విధానం మరింత ప్రభావవంతమైనదని.. దేశ సమగ్రతకు ఇదో మంచి …

Read More »

చీరల వ్యాపారంలోకి దువ్వాడ… రిబ్బన్ కట్ చేసిన నిధి అగర్వాల్

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. తన తొలి భార్యతో వేరు పడి దివ్వెల మాధురితో కలిసి తిరుగుతున్న దువ్వాడ ఏం చేసినా.. ఇట్టే వైరల్ అయిపోతోంది. కుటుంబ తగాదాలను పరిష్కరించుకునే పని ఎంత వరకు వచ్చిందో తెలియదు గానీ.. మాధురితో కలిసి ఆయన చెట్టాపట్టాలేసుకుని తిరుతున్న వైనం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. మాధురితో కలిసి దువ్వాడ శనివారం హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. మాధురితో కలిసి …

Read More »

రేవంత్ రెడ్డి సిసలైన స్టేట్స్ మన్!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో చేసిన సుదీర్ఘ ప్రసంగం సింగిల్ సెకండ్ కూడా బోర్ కొట్టలేదంటే అతిశయోక్తి కాదేమో. ఓ వైపు ప్రతిపక్షంపై పదునైన విమర్శలు గుప్పిస్తూనే… కేంద్రంలో అధికారంలో ఉన్న మరో విపక్షానికి చెందిన నేతలను కలిస్తే తప్పేమిటని కూడా ఆయన చెప్పిన తీరు నిజంగానే అబ్బురపరచిందని చెప్పక తప్పదు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందంగా… తాను వ్యవహరిస్తున్న …

Read More »

జనసేనకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే!

నిజమే… ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన అవడానికి కొత్త పార్టీనే అయినా… దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది. జనసేన 12వ ఆవిర్భావ వేడుకల కోసం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం శివారులోని చిత్రాడలో జయకేతనం పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ కారణంగా ఆ ప్రాంతంలో భారీగా పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని …

Read More »

డీ లిమిటేష‌న్ మీరు తెచ్చిందే: రేవంత్‌కు కిష‌న్ రెడ్డి చుర‌క‌

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం.. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌గా మారిన విష‌యం తెలిసిందే. దీనిపై త‌మిళ నాడు, క‌ర్ణాట‌క, తెలంగాణ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని మోడీ స‌ర్కారు ద‌క్షిణాది రాష్ట్రాల‌ను మ‌రింత వెన‌క్కి నెట్టే ఉద్దేశంతోనే డీ లిమిటేష‌న్‌ను తీసుకువ‌స్తోంద‌ని.. ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సార‌థి.. కిష‌న్ రెడ్డి స్పందించారు. డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ కొత్త‌ది కాద‌న్నారు. ఇది కాంగ్రెస్ …

Read More »

మళ్లీ పాత చంద్రబాబు ఎంట్రీ ఇచ్చేసినట్టేనా..?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అప్పుడెప్పుడో తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తొలి సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు సాగించిన పాలనను మళ్లీ మనం చూడబోతున్నాం. అందుకోసం మనం కేవలం ఈ ఏడాది అక్టోబర్ దాకా ఆగితే చాలు. పాత చంద్రబాబు మన కళ్ల ముందు కదలాడతారు. నాటి మాదిరే అధికారులు ఉరుకులు పరుగులు పెడతారు. ఎక్కడి సమస్యలు అక్కడే… అక్కడికక్కడే పరిష్కారం …

Read More »

వైరల్ హోర్డింగ్.. కాంగ్రెస్ మార్క్ ప్రచారం

సోషల్ మీడియాలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఓ అడ్వర్టైజ్ మెంట్ హోర్డింగ్ జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచుకునేందుకు వినూత్న రీతిలో వ్యాపార ప్రకటనలను జారీ చేయడంతో పాటుగా వాటిని జనాల్లోకి పంపేందుకు విభిన్న మార్గాలను ఎంచుకుంటూ ఉంటాయి. వీటిలో విభిన్నంగా ఉండే వ్యాపార ప్రకటనల పట్ల జనం ఇట్టే ఆకర్షితులు అవుతారు. అయితే శనివారం నాటి సోషల్ …

Read More »

కుదిరితే క‌లిసిరా.. లేక‌పోతే బీజేపీ భ‌జ‌న చేసుకో: ప‌వ‌న్‌కు డీఎంకే వార్నింగ్

జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌మిళ‌నాడుకు చెందిన అధికార పార్టీ డీఎంకే నాయకులు వ‌రుస పెట్టి విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌మిళ‌నాడు సంప్ర‌దాయాలు, సంస్కృతి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఏం తెలుసున‌ని వారు ప్ర‌శ్నించారు. డీఎంకే సీనియ‌ర్ నాయ‌కులు హ‌ఫీజుల్లా, ఎళ‌న్‌గోవ‌న్‌లు తాజాగా చెన్నైలో మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను వారు త‌ప్పుబ‌ట్టారు. “ప‌వ‌న్‌కు ఏం తెలుసు? ఆయ‌న మోడీ …

Read More »

ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలకు ‘కూటమి’ అవార్డులు

ఏపీలోని కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకునే ఈ నిర్ణయం ద్వారా ఉత్తమ పనితీరు కనబరచిన ప్రజా ప్రతినిధులకు అవార్డులు ఇవ్వనుంది. తద్వారా మరింత మంది ప్రజా ప్రతినిధుల పనితీరును మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు శనివారం ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం ద్వారా ఆయా ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలకు …

Read More »

నాగబాబు తేనెతుట్టెను కదిపారే..

నిన్నటి జనసేన జయకేతనం మీటింగ్ సోషల్ మీడియాలో పెద్ద స్థాయి చర్చకే దారి తీసింది. ఇందులో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో భాగంగా అనేక అంశాల మీద మాట్లాడాడు. ఆయన చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా హిందీకి వ్యతిరేకంగా తమిళనాడులో జరుగుతున్న పోరాటం మీద పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో పాటు మరి కొన్ని కామెంట్ల మీద విస్తృత చర్చ జరుగుతోంది. ఇవన్నీ …

Read More »

కేసీఆర్, బీఆర్ఎస్ లపై రేవంత్ స్వైర విహారం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సమావేశాల్లో మూడో రోజైన శనివారం సభ ప్రారంభం కాగానే… గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇటీవలే కేసీఆర్ గురించి ప్రసంగిస్తూ స్టేచర్, స్ట్రెచర్, మార్చురీ అంటూ తాను చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థించుకున్నారు. గతంలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు అధికార పార్టీగా స్టేచర్ ఉండేదని, అయితే 2023 ఎన్నికల్లో ఆ …

Read More »

బైరెడ్డి ఇంట అక్కాతమ్ముళ్ల సవాల్

రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు జడలు విప్పుతున్నాయి. మొన్నటికి మొన్న నంద్యాల జిల్లాలో వైసీపీ కార్యకర్తపై హత్యాయత్నం జరగగా.. తాజాగా శనివారం కర్నూలు నడిబొడ్డున టీడీపీ కార్యకర్త సంజన్న దారుణ హత్యకు గురయ్యారు. ఈ వరుస ఘటనలు సీమలో కలకలం రేపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో ఫ్యాక్షన్ ఫ్యామిలీగా ముద్ర పడిన బైరెడ్డి కుటుంబంలో అక్కాతమ్ముళ్ల సవాల్ అన్నట్లుగా కొత్త పోరు మొదలైంది. నంద్యాల …

Read More »