Political News

ప‌వ‌న్ పెళ్లిళ్ల‌పై 5 నిమిషాల పాటు సీఎం జ‌గ‌న్ పంచ్‌లు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జ‌గ‌న్ తీవ్ర‌స్తాయిలో ధ్వ‌జమెత్తారు. వారాహి యాత్ర స‌హా, ప‌వ‌న్ వివాహాల‌పై ఆయ‌న నిశిత విమ‌ర్శ‌లు చేశారు. తాజాగా పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలో నిర్వ‌హించిన జ‌గ‌న‌న్న అమ్మ ఒడి నాలుగో విడ‌త నిధుల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ప‌వ‌న్‌పై 5 నిమిషాల పాటు పంచ్‌లు విసిరారు. “వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేం. దత్తపుత్రుడిలా …

Read More »

రాష్ట్రంలో నాలుగు కోతులు.. మంచి విన‌రు-క‌న‌రు:  సీఎం జ‌గ‌న్ ఫైర్‌

Jagan Mohan Reddy Serious On His MLAs

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు జీర్ణించుకోలేక పోతున్నారని, అబద్ధాలు.. మోసాలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నార‌ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమ‌ర్శించారు.  జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా.. పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా  కురుపాం  నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన‌ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబుతో పాటు జనసేన పార్టీ అధ్య‌క్షులు …

Read More »

పవన్ ఎఫెక్ట్ – కాపులకు జగన్ చిరు కానుక

ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డికి కాపు భవన్లు నిర్మించాలన్న విషయం ఇపుడు గుర్తుకొచ్చినట్లుంది. అదికూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్ర నేపధ్యంలో కాపులపై రచ్చ జరిగిన తర్వాత. ఇంతకీ విషయం ఏమిటంటే కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మాట్లాడుతు ముడు ప్రాంతాల్లో కాపు భవన్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదలచేసినట్లు చెప్పారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో కాపు భవన్ల నిర్మాణానికి నిధులు మంజూరుచేసిన …

Read More »

రాహుల్ సీరియస్..ఆ ఇద్దరు ఎవరు ?

ఢిల్లీలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణా కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం తర్వాత నేతల్లో టెన్షన్ మొదలైంది. రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించాలనే విషయమై సీనియర్ల నుండి సలహాలు, సూచనలు తీసుకునేందుకే ఈ స్ట్రాటజీ సమావేశం జరిగింది. అయితే సమావేశం మొదలవ్వగానే కొందరు నేతలు ఫిర్యాదులు చేయటానికి రెడీ అయ్యారు. దాంతో రాహుల్ సీరియస్ అయ్యారు. స్ట్రాటజీ సమావేశం నిర్వహించింది ఫిర్యాదులు చేసుకోవటానికి కాదని గెలుపుకు అవసరమైన సలహాలు, …

Read More »

అక్టోబర్లోనే ఎన్నికల నోటిపికేషన్?

అక్టోబర్లోనే తెలంగాణా రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వబోతోందా ? అవుననే ప్రభుత్వవర్గాలు అనుమానిస్తున్నాయి. మామూలుగా అయితే షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ఎన్నికలు జరగాలి. కానీ ఎన్నికల కమీషన్ ఉన్నతాధికారులు ఈమధ్యనే తెలంగాణాలో పర్యటించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీతో పాటు జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు జరిపారు. కొన్ని జిల్లాల్లో క్షేత్రస్ధాయి పర్యటనలు కూడా జరిపారు. తమకు కావాల్సిన సమాచారం మొత్తాన్ని తీసుకున్నారు. దాని తర్వాత చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు ఎర్లీ పోల్స్ …

Read More »

గులాబీలో గుబులు మొదలైందా?

కాంగ్రెస్ పార్టీ జోరు చూసిన తర్వాత గులాబీపార్టీ నేతల్లో గుబులు మొదలైనట్లుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఇద్దరూ గట్టినేతలే. ఈ నేతలను కేసీయార్ పార్టీనుండి బహిష్కరించిన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని ఇద్దరు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఖమ్మం, మహబూబ్ నగర్లో బహిరంగసభలు నిర్వహించి కాంగ్రెస్ కండువాలను కప్పుకోబోతున్నారు. ఇక్కడే కారుపార్టీ నేతల్లో భయం పెరిగిపోతోందట. పొంగులేటి ఖమ్మంకు ఎంపీగా చేశారు. అలాగే జూపల్లి …

Read More »

గాంధీభవన్లో జీవకళ కనబడుతోందా ?

వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలాగుంటాయో తెలీదు కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేరికలతో కళకళలాడుతోంది. చాలాకాలం తర్వాత గాంధీభవన్ లో జీవకళ ఉట్టిపడుతోంది. రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీకి ఇపుడు జవసత్వాలు సమకూరటం అంటే చిన్న విషయం కాదు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే కర్ణాటకలో పార్టీ గెలుపుతోనే. ఎప్పుడైతే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందో అప్పటినుండి తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిపోయింది. కర్ణాటక ఘన …

Read More »

త్రిమూర్తులతో బీజేపీ భారీ సభ ?

వచ్చేనెలలలో బీజేపీ భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తోంది. జూలై 8వ తేదీన హైదరాబాద్ లో జరగబోయే బహిరంగసభలో త్రిమూర్తులు పాల్గొనబోతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. త్రిమూర్తులంటే నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలే. ఇప్పటికే మోడీతో జరగాల్సిన  బహిరంగసభ వాయిదాపడింది. అలాగే మొన్నటి 15వ తేదీన ఖమ్మంలో అమిత్ షా ముఖ్యతిధిగా నిర్వహించాల్సిన బహిరంగసభ కూడా వాయిదాపడింది. అందుకనే వచ్చేనెల 8వ తేదీన హైదరాబాద్ లో పార్టీకి సంబంధించిన కీలకమైన సమావేశం …

Read More »

మ్యాట‌ర్ వీక్.. ప‌బ్లిసిటీ పీక్‌: నారా లోకేష్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ స‌టైర్లు వేశారు. “జగన్ పాలనలో మ్యాటర్ వీక్… పబ్లిసిటీ పీక్” అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. “తాడేప‌ల్లి ప్యాలెస్‌కు అతుక్కుపోయే బ‌ల్లి” అని వ్యాఖ్యానించారు. చేసేది త‌క్కువ.. ప్ర‌చారం చేసుకునేది ఎక్కువ అంటూ.. త‌న‌దైన శైలిలో నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా గూడురు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న మ‌త్స్య‌కారుల‌తో మాట్లాడారు. “ఫిష్ ఆంధ్రా అని …

Read More »

నేను ముఖ్య‌మంత్రి కావ‌డం ప‌రిష్కారం కాదు.. : ప‌వ‌న్

“నేను ముఖ్య‌మంత్రి కావాల‌ని మీకే కాదు..నాకు కూడా ఉంది. కానీ, నేను ముఖ్య‌మంత్రి అయినంత మాత్రాన స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు” అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమవరంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తాను సీఎం అయితే.. ఏదో ఒరిగిపోతుంద‌ని అనుకోవ‌డం స‌రికాద‌న్నారు. అయితే.. తాము అధికారంలోకి వ‌స్తే.. కొంత మేలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. కాపుల్లో తూర్పుకాపులు చాలా వెనుక …

Read More »

ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ గ్రాఫ్ ఢ‌మాల్‌…!

ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాలు అంటే.. ప్ర‌స్తుత అధికార పార్టీ వైసీపీకి కంచుకోటలు. 2014, 2019 ఎన్నిక‌ల్లో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ భారీ ఎత్తున మెజారిటీ ద‌క్కించుకుంది. 2014లో క‌న్నా.. 2019లో ఒక్క కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం, రాజోలు(జ‌న‌సేన‌) మిన‌హా.. అన్ని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ విజ‌యం సాధించింది. ఇది ఒక‌ర‌కంగా వైసీపీ సాధించిన రికార్డ‌నే చెప్పాలి. అయితే.. అనూహ్యంగా.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు గ్రాఫ్ త‌గ్గుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

వైసీపీలో డేంజ‌ర్ జోన్లో ఉన్న లీడ‌ర్లు వీళ్లే…

ఇటీవ‌ల ఏపీ సీఎం జ‌గ‌న్‌.. వైసీపీలో ప్ర‌జ‌ల‌కు చేరువ కాని నేత‌లు అంటూ.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో వైసీపీ చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం ద్వారా నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌నేది వైసీపీ ల‌క్ష్యం. దీంతో ప్ర‌జ‌ల‌కు, నేత‌ల‌కు మ‌ధ్య ఉన్నగ్యాప్ త‌గ్గుతుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు, ఈ క్ర‌మంలో నే గ‌డ‌ప‌గ‌డ‌ప కు కార్య‌క్ర‌మాన్ని సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఈ ఏడాది ఆగ‌స్టు 31 …

Read More »