గుడివాడ వైసీపీ కొలాప్స్ ?

ఉమ్మ‌డి కృష్నా జిల్లాలోని గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అంటే.. కొడాలి నానితోపాటు.. వైసీపీ పేరు కూడా వినిపిస్తుంది. నానితో పాటు.. పార్టీ కోసం అనేక మంది నాయ‌కుల ప‌ని చేశారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌రాజ‌యం త‌ర్వాత‌.. ఇక‌, ఆపార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఈ నేప‌థ్యంలో తాజాగా కీల‌క నాటీట‌త‌య‌కులు.. ఒక‌ప్పుడు వైసీపీ జెండా క‌ట్టిన వారు.. వైసీపీ రాజీనామా చేశారు. వీరంతా త్వ‌ర‌లోనే టీడీపీ బాట ప‌ట్ట‌నున్నారు.

గుడివాడ‌లో కొడాలి నాని వైసీపీలోకి రాక‌ముందు నుంచి మండ‌లి హ‌నుమంత‌రావు.. ఆయ‌న ప‌రివారం.. స‌హా.. ప‌లు మండ‌లాల నాయ‌కులు ఆ పార్టీకి అండ‌గా ఉన్నాయి. త‌ర్వాత‌.. నానీ విజ‌యంలోనూ వీరు కీల‌క పాత్ర పోషించారు. గ‌తంలో మండ‌లి హ‌నుమంత‌రావు.. కాంగ్రెస్‌లో ఉండ‌గా.. వైసీపీ ఆవిర్భావం త‌ర్వాత‌.. ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి వైసీపీ బాట ప‌ట్టారు. ఇక‌, కొడాలి నాని అనుచ‌రుడిగా.. జ‌గ‌న్‌కు వీరాభిమాని కూడా పేరు తెచ్చుకున్నారు.

నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయాల‌ని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకుని ప‌రిష్క‌రించాల‌ని.. మండ‌లి భావించేవారు. దీంతో కొడాలి నాని వ‌ర్గంలో ఉన్న‌ప్ప‌టికీ.. విభీష‌ణుడి పాత్ర‌ను పోషించారు. ఇది.. ఆయనకు.. వ్య‌క్తిగ‌తంగా ఇబ్బంది క‌లిగించినా.. ప్ర‌జ‌ల‌కు మాత్రం స‌రైన నాయ‌కుడిగా ఆయ‌న‌ను చేరువ చేసిం ది. ప్ర‌స్తుతం నాని యాక్టివ్‌గా లేక‌పోవ‌డంతోపాటు.. వైసీపీ ప‌రిస్థితి కూడా దారుణంగా త‌యారైంది. ఈ నేప‌థ్యంలో మండ‌లి హ‌నుమంత‌రావు స‌హా సుమారు 500 మంది కార్య‌క‌ర్త‌లు.. వైసీపీని వీడారు.

ప్ర‌స్తుత ఎమ్మెల్యే టీడీపీ నాయ‌కుడు వెనిగండ్ల రాము సార‌థ్యంలో వారు సైకిల్ ఎక్క‌నున్న‌ట్టు తెలుస్తోంది. త‌ర‌చుగా రాము చేస్తున్న ప‌నుల‌ను మెచ్చుకోవ‌డం.. ఎమ్మెల్యేగా రాము స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం వంటివి హ‌నుమంత‌రావును టీడీపీకి చేరువ చేశాయి. ఈ నేప‌థ్యంలో గుడివాడ వైసీపీ కొలాప్సేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.