Political News

విగ్రహాల జోలికొస్తే తాట తీస్తా: చంద్రబాబు

రాష్ట్రంలో రాజకీయ నేతల విగ్రహాలను కూలదోయడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించారు. పార్టీల పరంగా విమర్శలు చేయాలి కానీ దివంగత నేతల విగ్రహాల విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? అని విపక్ష పార్టీల నాయకులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా శనివారం ఉదయం కృష్ణాజిల్లాలోని కైకలూరులో ఇటీవలి ఏర్పాటు చేసిన కాపు నాయకుడు వంగవీటి రంగా విగ్రహాన్ని కొందరు …

Read More »

బాబు రెండు వ్యూహాలు… మ‌రో 20 ఏళ్లు..!

రాష్ట్రంలో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వాన్ని మ‌రో 20 ఏళ్ల‌పాటు కొన‌సాగించాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు వ్యూహం. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పాల‌న కాకుండా మ‌రో 20 ఏళ్ల‌పాటు ఇలానే ఒకే ప్ర‌భుత్వం ఏర్ప‌డేలా, ప్ర‌జ‌లు కూడా ఒకే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునేలా ఉండాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారు. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట కూడా ఇదే. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో 15 ఏళ్లు అంటున్నారు. సో ఎలా చూసుకున్నా ఇద్ద‌రు నాయ‌కులు …

Read More »

ఏంటా బిల్లు.. ఏమా కథ.. బీజేపీ నిజాయితీ ఎంత?

కేంద్ర ప్రభుత్వం ఉరుములు లేని పిడుగు మాదిరిగా తీసువచ్చిన మూడు రాజ్యాంగ సవరణల బిల్లు ఇప్పుడు దేశం యావత్తును కుదిపేస్తోంది. ఏ ఇద్దరు నేతలు కలిసినా ఈ బిల్లుపైనే చర్చించుకుంటున్నారు. ఇక మేధావులు తమ తమ శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రుల నుంచి కేంద్ర, రాష్ట్ర స్థాయి మంత్రుల వరకు కూడా తీవ్ర నేరాల్లో చిక్కుకుని జైలు పాలైతే.. 30 రోజులకు కూడా వారికి బెయిల్ దక్కకపోతే.. …

Read More »

సభా సమరం ముగిసింది.. గెలుపెవరిది?

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. గత నెల జూలై 21న ప్రారంభమైన సమావేశాలు గురువారం (ఆగస్టు 21)తో నిరవధికంగా వాయిదా పడ్డాయి. సాధారణంగా.. సమావేశాలు అనే మాట ఎప్పుడో తెరమరుగైంది. సమరమే తప్ప.. సమావేశాలు, సుహృద్భావ చర్చలకు దేశంలో అసెంబ్లీలే కాదు.. దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన పార్లమెంటు కూడా ఎప్పుడో తెరదించేశాయి. ఇప్పుడు ఏ సమావేశం అయినా.. సమరాన్నే తలపిస్తున్నాయి. అధికార పక్షంపై ప్రతిపక్షం, ప్రత్యర్థి పక్షంపై అధికార పక్షం …

Read More »

‘అయ్యా.. అక్షరం ముక్కరాదు.. అక్రమం చేస్తానా?’

ఇదేదో సినిమా డైలాగు కాదు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, ఎస్సీ నాయకుడు, సీనియర్ నేత కిళత్తూరు నారాయణ స్వామి చెప్పిన మాట. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు 48 మందిపై కేసు నమోదు చేశారు. 13 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ పరంపరలో అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించిన నారాయణ స్వామి …

Read More »

జగన్ మోడీ ఫేవరెట్.. షర్మిల కామెంట్స్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్‌పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మోడీ ఫేవరెట్ అని వ్యాఖ్యానించారు. ముసుగు తీసేశారని, ఆయన వైఖరి తెలుగు జాతికి ద్రోహం చేసేలా ఉందని తీవ్రంగా స్పందించారు. ఇప్పటి వరకు ముసుగు వేసుకుని యుద్ధం చేస్తున్నట్టు నటించారని, ఇప్పుడు ఆ ముసుగు తొలగించారని అన్నారు. తెలుగు వారు జగన్‌ను ఎలా నమ్మాల‌ని …

Read More »

ఆగిన ఉద్య‌మ గ‌ళం: క‌మ్యూనిస్టు యోధుడు సుర‌వ‌రం క‌న్నుమూత‌

క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) అగ్ర‌నేత‌, ప్ర‌జా ఉద్య‌మాల‌కు అలుపెరుగ‌ని గ‌ళం వినిపించిన నాయ‌కుడు సుర‌వరం సుధాక‌ర్‌రెడ్డి ఇక లేరు. 83 ఏళ్ల సుర‌వరం గ‌త కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌పడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రాత్రి 11.40 నిమిషాల స‌మ‌యంలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. 1942, మార్చి 25వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి …

Read More »

లోకేష్ మాటతో నిరుద్యోగులకు ఏటా పండుగే!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి (విద్య) శాఖ మంత్రి అటు రాజకీయాలతో పాటు ఇటు పాలనలోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తనదైన శైలి ప్రతిభతో కేంద్రం నుంచి ఏపీకి లెక్కలేనన్ని నిధులు విడుదలయ్యేలా చేయడంతో పాటుగా తన పరిధిలోని శాఖలకు అదనపు నిధులు కూడా రాబట్టారు. ఏపీ విద్యా శాఖను దేశానికి రోల్ మోడల్ చేసే దిశగా సాగుతున్న లోకేష్… శుక్రవారం ఓ కీలక …

Read More »

జనసేన నేతపై కేసు: ప‌వ‌న్ అనుమతి

సొంత పార్టీ నేతలే తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చెబుతున్నట్టుగానే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జనసేన నాయకుడిపై కేసు పెడతామంటూ ఆయన అనుమతి కోరుతూ వచ్చిన పోలీసులకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో జనసేన కీలక నాయకుడిపై శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో …

Read More »

అలా జరిగి ఉంటే సుదర్శన్ రెడ్డికి మద్దతిచ్చేవాళ్లం: చంద్రబాబు

ఎన్డీయే మిత్రపక్షాలుగా ఉన్నాం. మా దంతా ఒకే మాట. ఈ విషయంలో రెండో ఆలోచన మాకు లేదు అని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీయే మిత్రపక్షాలు ఏకగ్రీవంగా ఎంపిక చేసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు తెలిపారు. టీడీపీ ఎంపీలు, మంత్రులతో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు రాధాకృష్ణన్‌ను సత్కరించారు. …

Read More »

కుక్క‌ల‌పై తీర్పు రివైజ్.. సుప్రీంకోర్టు ఏమందంటే!

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వీధి కుక్క‌లు పెరిగిపోయాయ‌ని.. వీటిని 8 వారాల్లో ఖాళీ చేయించి.. న‌గ‌రానికి దూరంగా ఎక్క‌డైనా వ‌దిలేయాల‌ని పేర్కొంటూ.. ఈ నెల 11న ఇచ్చిన సుప్రీంకోర్టు సంచ‌ల‌నం రేపింది. అంతే కాదు.. ఒక్క కుక్క క‌నిపించినా.. అధికారుల‌పై భారీ జ‌రిమానాలు విధిస్తామ‌ని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక అక్క‌డితోనూ అప్ప‌ట్లో శాంతించ‌లేదు. తాము ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేయ‌డానికి వీల్లేద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. అలా ఎవ‌రైనా …

Read More »

రాజ‌కీయం నేర్చుకోవాలి జ‌గ‌న్‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాను చేస్తున్న రాజ‌కీయం మ‌రెవ‌రూ చేయ‌రు అని అనుకుంటే అంత‌క‌న్నా పొర‌పాటు లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్ర‌జ‌లు కూడా మారుతున్నారు. పాలను పాల‌లా, నీళ్లను నీళ్ల‌లానే చూస్తున్నారు. దీనిని అవ‌గ‌తం చేసుకుంటేనే రాజ‌కీయాల్లో కొన్నాళ్లు మ‌న‌గ‌లుగుతారు. లేక‌పోతే స‌ర్దేసుకునే ప‌రిస్థితి ఖాయం. ఇప్పుడు ఇదే ఏపీలోనూ జ‌రుగుతోంది. “ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నా రు” అని రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు త‌ర‌చుగా చెబుతుంటారు. ఇది నిజం …

Read More »