Political News

విశాఖ న‌గ‌రంపై జ‌న‌సేన తొలి విజ‌యం!

గ్రేట‌ర్ విశాఖ ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లో జ‌న‌సేన తొలిసారి విజ‌యం ద‌క్కించుకుంది. ఇటీవ‌ల వైసీపీ మేయ‌ర్‌ను గ‌ద్దెదించిన కూట‌మి నాయకులు.. ఈ కార్పొరేష‌న్‌లో జెండా ఎగురేశారు. ఈ నేప‌థ్యంలో కార్పొరేష‌న్ మేయ‌ర్‌ ప‌ద‌విని టీడీపీ ద‌క్కించుకోగా.. డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని జ‌న‌సేన కైవ‌సం చేసుకుంది. వాస్త‌వానికి సోమ‌వార‌మే దీనిని పూర్తి చేయాల్సి ఉన్నా.. సొంత పార్టీ నాయ‌కుల్లోనే విభేదాలు త‌లెత్తాయి. దీంతో కొంద‌రు కార్పొరేట‌ర్లు .. డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌కు …

Read More »

కిలోల కొద్దీ బంగారం ఎందుక్కొన్నారు రెడ్డిగారు

ఏపీలో ఇప్పుడు మద్యం కుంభకోణంపై పెద్ద చర్చే నడుస్తోంది. అన్ని కేసుల కంటే కూడా ఈ కేసే ఇప్పుడు ప్రదాన కేసుగా మారిపోయింది. రాజకీయ నేతల అరెస్టులు తప్పించి… దాదాపుగా అన్ని రకాలుగా ఈ కేసు సంచలనాలకే కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఇలాంటి ఈ కేసు ఓ కీలక అదికారి అత్యుత్సాహం, హైరానా, ఆదుర్దా కారణంగా బయటపడిపోయిందన్న విషయం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీబీసీఎల్) …

Read More »

ప‌వ‌న్ ఎలా ఉన్నా.. బాబుపై మాత్రం మామూలుగా లేదుగా…!

ప్ర‌భుత్వంలో ఉన్న నాయ‌కుల‌పై ఒత్తిడి స‌హ‌జం. త‌మ‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని ప్ర‌జ‌లు .. త‌మ కోరిక‌లు తీర్చాల‌ని నాయ‌కులు.. కోరుకోవ‌డం కామ‌న్ అయిపోయింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఎప్పుడు అమ‌లు చేస్తారా? అని ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. ఇదేస‌మ‌యంలో త‌మకు ఎప్పుడు న్యాయం చేస్తారా? అని నాయ‌కులు ఎదురు చూస్తున్నారు. ఈ రెండు అంశాలు ఏ ప్ర‌భుత్వం ఉన్నా.. కామ‌నే. అయితే.. సాధ్య‌మైనంత వ‌రకు ఈ …

Read More »

పార్టీ గీత దాటితే లోకేశ్ ఊరుకోరుగా!

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అంటేనే… ఓ క్రమశిక్షణ కలిగిన పార్టీ. పార్టీ అదినాయకత్వం మాటే ఆ పార్టీ శ్రేణులకు శిరోధార్యం. పార్టీ లైన్ దాటి ప్రవర్తించే నేతల సంఖ్య టీడీపీలో చాలా తక్కువేనని చెప్పాలి. అసలు అలాంటి వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చని, వారిపైనా పార్టీ అధినాయకత్వం తీసుకునే చర్యలను చూసి… ఇతర నేతలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. మొత్తంగా ఇతర …

Read More »

మా దేశం ధ‌ర్మ‌స‌త్రం కాదు: సుప్రీంకోర్టు

“నేను శ్రీలంకకు చెందిన వ్య‌క్తినే. కానీ, అక్క‌డ నాప్రాణాల‌కు ముప్పుంది. కాబ‌ట్టి.. ఇక్క‌డే త‌ల‌దాచుకుంటాను. ఇక్క‌డే ఉండిపో తాను. దేశాన్ని గౌర‌విస్తాను. నాకు ఇక్క‌డ శాశ్వ‌త ఆశ్ర‌యం క‌ల్పించండి” అని కోరిన వ్య‌క్తిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. “మా దేశం ఎవ‌రికి ప‌డితే వారికి ఆశ్ర‌యం క‌ల్పించేందుకు.. ధ‌ర్మ‌స‌త్రం కాదు. ఎక్క‌డెక్క‌డ నుంచో వ‌చ్చి.. ఇక్క‌డ త‌ల దాల్చుకోవ‌డానికి శ‌ర‌ణార్థి శిబిరం కూడా కాదు. కాబ‌ట్టి.. ద‌య‌చేయండి” …

Read More »

జైల్లో ఉండ‌లేను.. బెయిలివ్వండి: గాలి

క‌ర్ణాట‌క‌కు చెందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ప్రస్తుతం చంచ‌ల్ గూడ జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. 2009 – 10 మ‌ధ్య క‌ర్ణాట‌క‌-అనంత‌పురం మ‌ధ్య ఉన్న ఓబులాపురం గ‌నుల ను అనుమ‌తికి మించి దోచుకున్నార‌న్న కేసులో ఇటీవ‌ల సీబీఐ కోర్టు గాలి జ‌నార్ద‌న్ రెడ్డి స‌హా.. ఆయ‌న బావ‌.. ఐఆర్ ఎస్ అధికారి బీవీ శ్రీనివాస‌రెడ్డి, అదేవిధంగా రాజ‌గోపాల్ రెడ్డి, అలీఖాన్‌ల‌కు ఏడేళ్ల‌పాటు …

Read More »

ఏపీలో ఉగ్ర‌క‌ద‌లిక‌లా..! : డీజీపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ‌

ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన సిరాజ్ – ఉర్ – రెహ్మాన్ అనే వ్య‌క్తిని ఉగ్ర‌వాద సానుభూతిప‌రుడిగా గుర్తించిన రెండు తెలుగు రాష్ట్రాల నిఘా వ‌ర్గాలు.. తాజాగా అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఉగ్ర క‌ద‌లిక‌లు, ఉగ్ర‌వాద సానుభూతి ప‌రుల వ్య‌వ‌హారంపై కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం ఆరా తీసింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని అడిగి వివ‌రాలు తెలుసుకున్న కేంద్ర హోం శాఖ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. …

Read More »

మీ చొర‌వ అద్భుతం: చంద్ర‌బాబుకు గేట్స్ ప్ర‌శంస‌

“మీ చొర‌వ అద్భుతం. మీలాంటి నాయ‌కుడిని నేను మునుపెన్న‌డూ చూడ‌లేదు. వ‌య‌సుతో సంబంధం లేకుండా.. నిత్య కృషీవ‌లునిగా మీరు చేస్తున్న అలుపెరుగ‌ని కృషి నేటి యువ‌తరానికి ఎంతో ఆద‌ర్శం. మీతో క‌లిసే అవ‌కాశం నాకు రావ‌డం చాలా సంతోషం. ఆ మ‌ధుర స్మృతులు న‌న్ను ఇప్ప‌టికీ సంతోషానికి గురి చేస్తున్నాయి. మీరు చేస్తున్న కృషికి.. నేను త‌ప్ప‌కుండా ఇతోధికంగా దోహ‌ద ప‌డ‌గ‌ల‌నని హామీ ఇస్తున్నా”- అని ఏపీ సీఎం చంద్ర‌బాబును …

Read More »

వైసీపీకి ‘గూడెం’ దెబ్బ గట్టిగానే తగలనుందా?

ఏపీలోని కూటమి సర్కారు సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ అదికారంలో ఉండగా… 2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో అనుమాస్పద స్థితిలో 22 మంది దాకా చనిపోయారు. ఈ మరణాలకు కల్తీ కల్లే కారణమని నాడు ఆరోపణలు వినిపించినా… ఆ దిశగా నాడు దర్యాప్తు జరిగిన దాఖలా లేదు  అయితే బాధితుల కుటుంబాలు ఈ మరణాలపై తమకు అనుమానాలున్నాయని, దర్యాప్తు చేయాలని పోలీసులను ఆశ్రయించాయి. ఇలా జంగారెడ్డిగూడెం పీఎస్ లో …

Read More »

కూట‌మి పాల‌నకు ఎన్ని మార్కులు వచ్చాయంటే

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ఓట్లు.. 60.02 శాతం. ఈ లెక్క కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే చెప్పింది. ఇటీవ‌ల త‌ర‌చుగా సీఎం చంద్ర‌బాబు కూడా చెబుతున్నారు. అయితే.. 11 మాసాల త‌ర్వాత కూడా.. ఇది అలానే ఉందా? ఏమైనా మార్పు క‌నిపించిందా? అంటే.. మార్పులేద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు వివిధ వ‌ర్గాల నుంచి రాబ‌ట్టిన స‌మాచారం బ‌ట్టి.. కూట‌మికి ప్ర‌జ‌లు వేసిన మార్కులు …

Read More »

24 గంట‌ల్లో ఆమ‌ర‌ణ దీక్ష చేస్తా: ష‌ర్మిల స్టేట్‌మెంట్‌

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 24 గంట‌ల్లో విశాఖ ప‌ట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి.. ఇప్ప‌టికే తొల‌గించిన ఉద్యోగుల‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని ఆమె అల్టిమేటం జారీ చేశారు. ఈ క్ర‌మంలో 24 గంట‌ల త‌ర్వాత కూడా.. ఈ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోతే.. తానే ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగుతాన‌ని ఆమె హెచ్చ‌రించారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ అల్టిమేటం …

Read More »

‘నీళ్లు లేని ఫైరింజ‌న్లు.. ఆక్సిజ‌న్‌లేని అంబులెన్సులు’

హైద‌రాబాద్‌లోని చార్మినార్ స‌మీపంలో ఉన్న‌ గుల్జార్ హౌస్‌లో ఆదివారం జ‌రిగిన ఘోర అగ్ని ప్ర‌మాదం లో ఒకే కుటుంబంలోని 17 మంది మృతి చెంద‌గా.. మ‌రింత మంది గాయ‌ప‌డ్డారు. అదేవిధంగా ప‌లువ‌రు మృతి చెందారు. ఈ ఘ‌ట‌నా ప్రాంతాన్ని తాజాగా తెలంగాణ మాజీ మంత్ర కేటీఆర్ ప‌రిశీలించారు. రాష్ట్రం లో గ‌త ప‌దేళ్ల‌లో జ‌రిగిన అతి పెద్ద అగ్ని ప్ర‌మాదం ఇదేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌తో అయినా.. ప్ర‌భుత్వం …

Read More »