Political News

బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉంది: చంద్రబాబు

బీసీలకు రాజ్యాధికారం రావాలని కలలుగన్న విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారకరామారావును స్మరించుకుంటూ జయహో బీసీ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తెలుగుజాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు ఇది అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం, జనసేన బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటాయని సమిష్టిగా ఈరోజు ఒక డిక్లరేషన్ చేస్తున్నామని చెప్పారు. బీసీల బాగు కోసం తాను, పవన్ ఇద్దరం కలిసి …

Read More »

బీసీలు శాసించే స్థాయికి రావాలి: పవన్

జయహో బీసీ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని పవన్ అన్నారు. 2019లో వైసీపీ వెన్నంటి ఉన్న బీసీలను జగన్ దెబ్బ కొట్టాడని ఆరోపించారు. బీసీల గర్జన పేరుతో ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారని, బీసీలకు 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని …

Read More »

మంగ‌ళ‌గిరికి నారా లోకేష్‌.. నాలుగు వాగ్దానాలు ఇవే!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌నున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి నాలుగు వాగ్దానాలు చేశారు. తాజాగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నాగార్జున విశ్వ‌విద్యాల‌యం స‌మీపంలో టీడీపీ-జ‌న‌సేన పార్టీలు నిర్వ‌హించిన బీసీ డిక్ల‌రేష‌న్ స‌భ‌లో్ ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా త‌నను గెలిపిస్తే.. మంగ‌ళ‌గిరికి ఏం చేయాల‌ని అనుకుంటున్న‌దీ నారా లోకేష్ వెల్ల‌డించారు. 1) కొండ పోరంబోకు, ఫారెస్ట్, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే …

Read More »

బీసీలు తొక్కిపట్టి నార తీస్తారు: ఎంపీ రామ్మోహన్

మంగళగిరి సమీపంలో నాగార్జున వర్సిటీ వద్ద టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, పలువురు టీడీపీ నేతలు, జనసేన నేతలు హాజరయ్యారు. ఈ సభకు లక్షలాది మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు, బీసీ సోదరులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ సభా వేదికపై వైసీపీ మాజీ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. జయరాంకు …

Read More »

అక్కడ వైసీపీలో వర్గపోరు పెరిగిపోతోందా ?

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు పెరిగిపోతున్నట్లుంది. ఎంఎల్ఏ తిప్పేస్వామిని కాదని జగన్మోహన్ రెడ్డి కొత్త నేతను సమన్వయకర్తగా నియమించారు. సమన్వయకర్త, ఇన్చార్జి పేరేదైనా చివరకు అభ్యర్ధనే అర్ధమొస్తుంది. అందుకనే జగన్ ప్రకటించిన ఈరల కృష్ణనే అందరు అభ్యర్థిగా అనుకుంటున్నారు. అయితే సమస్యంతా ఇక్కడే వస్తోంది. ఎలాగంటే ఈరల కృష్ణ అభ్యర్ధిత్వాన్ని ఎంఎల్ఏతో పాటు ఆయన మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో ఎక్కువభాగం ఎంఎల్ఏకి బదులు …

Read More »

రేవంత్ హవా.. కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు: స‌ర్వ‌ే

రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ మ‌రోసారి విజ‌య దుందుభి మోగిస్తుంద‌ని తాజాగా ఓ స‌ర్వే చాటి చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమ‌లు చేస్తున్న ప‌లు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపిస్తున్నాయ‌ని స‌ర్వే తెలిపింది. అదేవిధంగా ప్ర‌జాపాల‌న దిశ‌గా సీఎం రేవంత్ వేస్తున్న అడుగులు గ్రామీణ స్థాయి నుంచి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు ప్ర‌జ‌ల‌ను మెరిపిస్తున్నాయ‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో 17 …

Read More »

కాంగ్రెస్ లో కొత్త పంచాయితి

తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పంచాయితీ మొదలైంది. ఈ పంచాయితీకి అడ్వర్టైజ్మెంట్లు ప్రధాన కారణం కావటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణా ప్రభుత్వం జారిచేసిన కొన్ని అడ్వర్టైజ్మెంట్లలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోలు మిస్సయ్యాయి. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతో పాటు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫొటో కూడా తప్పనిసరిగా కనబడుతోంది. సీఎంతో పాటు డిప్యుటి సీఎం ఫొటోను …

Read More »

వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయం: చంద్ర‌బాబు

తాము అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చినా.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌బోమ‌ని చెప్పారు. అనంత‌పురం జిల్లా పెనుకొండలో నిర్వ‌హించిన‌ ‘రా కదలిరా’ సభలో ఆయ‌న మాట్లాడుతూ.. వ‌లంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చినా వ‌లంటీరు వ్యవస్థ ఉంటుందని, ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించబోమని స్పష్టం చేశారు. అయితే, వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరుతున్నాన‌న్నారు. వ‌లంటీర్లకు మంచి భవిష్యత్ …

Read More »

బీఆర్ఎస్ కు ఎంఎల్ఏ షాకిచ్చినట్లేనా ?

బీఆర్ఎస్ కు ఒక ఎంఎల్ఏ షాకిచ్చినట్లేనా ? ఇపుడిదే అంశంపై పార్టీలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కేసీయార్, కేటీయార్ ఆధ్వర్యంలో జరిగిన రెండు సమావేశాలకు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు హాజరుకాలేదు. బీఆర్ఎస్ మీటింగులకు తెల్లం హాజరుకాకపోగా మధ్యలో రేవంత్ రెడ్డిని కలిశారు. దాంతో తెల్లం తొందరలోనే కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. తెల్లం మాత్రం తాను నియోజకవర్గం …

Read More »

కాళేశ్వరం నాలుగు నెలలు షట్ డౌన్

అనుకున్నంతా అయ్యింది. తెలంగాణాలోని కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టులను నాలుగు నెలల పాటు షట్ డౌన్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల్లో రిపేర్లు చేయాల్సి రావటమే. ఈ మూడు ప్రాజెక్టులు ఉపయోగంలో లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదనే చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు నింపాలంటే ముందు పై మూడు ప్రాజెక్టుల్లో నీటి నిల్వ చేయాలి. ఇపుడు …

Read More »

పవన్ భారీ ట్విస్ట్ – ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ !

జనసేనాని పవన్ కల్యాణ్ వ్యూహం మార్చుకున్నారా ? అవుననే సమాధానం వినిపిస్తోంది విశ్వసనీయవర్గాల నుండి. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో పవన్ రెండు స్ధానాల్లో మళ్ళీ పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే జరుగుతున్న ప్రచారం నిజమేనట. కాకపోతే రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రం కావట. తాజా వ్యూహం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు లోక్ సభ నియోజకవర్గంలో కూడా పోటీచేయాలని పవన్ ఆలోచిస్తున్నారని …

Read More »

రేపు ప్ర‌జ‌ల‌ను కూడా తాక‌ట్టు పెట్టేస్తారా !

ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను మాజీ మంత్రి కొడాలి నాని తిప్పికొట్టారు. ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నారని.. నేడు రాష్ట్ర అప్పులు 4లక్షల కోట్లు ఉంటే అందులో 2.50లక్షల కోట్లు చంద్రబాబు చేసినవేనన్నారు. ఏ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే…. చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు …

Read More »