Political News

టీడీపీ మేనిఫెస్టో జ‌న‌సేన‌కు ఇష్ట‌మేనా?

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని చెబుతున్నటువంటి జనసేన పరిస్థితి ఏంటి? అసలు జనసేన వ్యూహం ఏంటి? ఇప్పుడు ఆసక్తిగా మారిన అత్యంత కీలకమైన విషయం ఇదే. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వస్తావని జనసేన చెబుతూ వచ్చింది. అయితే గత కొన్నాళ్లుగా పొత్తులు పెట్టుకుంటామని పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వస్తామ‌ని,  వైసిపి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూస్తామని కూడా జనసేన అధినేత పవన్ …

Read More »

ముంద‌స్తుపై వైసీపీ నేత‌ల టాక్ ఇదే!

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే చ‌ర్చ మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్ అనూహ్యంగా కేబినెట్ స‌మావేశం ఏర్పాటు చేయ‌డం.. దీనిలో ఒక తీర్మానం చేసి.. గ‌వ‌ర్న‌ర్‌కు పంపి.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌డం.. ఆ వెంట‌నే తెలంగాణ‌తో స‌మానంగా ఎన్నిక‌లకు వెళ్ల‌డం చేస్తార‌ని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం ఈ విష‌యం హాట్‌గా మారింది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు …

Read More »

అవినాష్‌రెడ్డి విష‌యంలో భారీ ట్విస్ట్

రాజ‌కీయాల్లో జ‌రిగే కొన్ని కొన్ని ఘ‌ట‌న‌లు చాలా చిత్రంగా ఉంటాయి. ఇవి న‌మ్మేందుకు కూడా అతిశ‌యంగానే అనిపిస్తాయి. కానీ, ఏం చేస్తాం.. న‌మ్మితీరాలి.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హత్య వ్య‌వ‌హారంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి వ్య‌వ‌హారంలో తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ అయితే.. ఇచ్చింది. కొన్ని ష‌ర‌తులు విధించింది. ప్ర‌తి శ‌నివారం.. సీబీఐ …

Read More »

ఈటల చుట్టూ మంటలు

మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మంటలు మండటం ఖాయం. ఇప్పుడు బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యవహారం అలాగే తయారైంది. ఓ మాదిరి నేలతంతా ఇపుడు ఈటల వ్యవహారశైలిపై మండిపోతున్నారు.  మీడియాతో మాట్లాడుతు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరకపోవచ్చని చెప్పారు. కారణం ఏమిటంటే వాళ్ళిద్దరికీ బీజేపీలో చేరటానికి ఏవో ఇబ్బందులు ఉన్నట్లుగా ఈటల అనుమానం వ్యక్తంచేశారు. ఇంతటితో ఊరుకోకుండా వీళ్ళిద్దరు కాంగ్రెస్ లో చేరవచ్చని కూడా చెప్పారు. ఇక్కడే …

Read More »

కవితతో ఈడీ ఆడుకుంటోందా?

kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో  పాత్రపై  కల్వకుంట్ల కవితను ఈడీ ఆడుకుంటున్నట్లే ఉంది. ఒకసారి కోర్టులో దాఖలుచేసిన చార్జిషీట్లో కవిత పేరు మాయమైపోతుంది. మొత్తం చార్జిషీట్లో కవిత పేరు ఎక్కడా కనబడదు. దాంతో చార్జిషీట్లో నుండి పేరును ఈడీ తీసేసింది కాబట్టి కవితకు పెద్ద రిలీఫ్ దొరికినట్లే అని బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటారు. అంతకుముందు వరుసగా మూడురోజులు విచారణకు రమ్మని కవితపై ఈడీ బాగా ఒత్తిడితెచ్చింది. విచారణలో ముప్పుతిప్పులు పెట్టింది. …

Read More »

ఎవ‌రు పేద‌..? చంద్ర‌బాబు అదిరిపోయే ప్లాన్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఇటీవ‌ల కాలంలో పేద‌ల‌కు – పెత్తందార్ల‌కు మ‌ధ్య యుద్ధంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను అభివ‌ర్ణి స్తున్న విష‌యం తెలిసిందే. అంటే.. 2024లో జ‌రిగే ఎన్నిక‌ల‌ను ఆయన తాను పేద‌వాడిన‌ని.. చంద్ర‌బాబు- జ‌న‌సేన‌లు ఆర్థికంగా బ‌లం ఉన్న పార్టీల‌నీ చెబుతున్నారు. ఈ రెండు పార్టీల‌కు మ‌ధ్య ప్ర‌జ‌లు ఎటువైపు నిల‌బ‌డాలో కూడా .. ఆయ‌న చెబుతున్నార‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. పేద‌ల‌కు తాను సంక్షేమాన్ని అందిస్తున్నాను కాబ‌ట్టి.. త‌న‌వెంటే …

Read More »

శివకుమార్ రూట్లో షర్మిల పొత్తులు ?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల పార్టీ పెట్టి రెండు సంవత్సరాలు కావొస్తోంది. ఆమె నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా పూర్తి చేసుకున్నారు. ఐనా పార్టీకి జోష్ వచ్చినట్లు కనిపించడం లేదు. ఒక ఉప ఎన్నికలో కూడా పోటీ చేసే ధైర్యం ఆ పార్టీకి లేదనే చెప్పాలి. సీఎం కేసీఆర్ మీద, వేరే పార్టీల మీద దుమ్మెత్తిపోయడం తప్ప ఇంతకాలం షర్మిల చేసిందేమీ లేదు. ధర్నాలు, …

Read More »

మోడీజీ.. ప‌త‌కాలు.. గంగ‌లో క‌లిపేస్తా: రెజ్ల‌ర్ల హెచ్చ‌రిక

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సెంట్రిక్‌గా రెజ‌ర్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “మోడీ జీ.. మా బాధ‌లు మీకు ప‌ట్ట‌డం లేదు. ఈ దేశం కోసం అహ‌ర్నిశ‌లూ శ్ర‌మించి అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌త‌కాలు సంపాయించాం. మీరు మాపై చూపిస్తున్న `అవ్యాజ‌మైన ప్రేమ‌`కు నిద‌ర్శ‌నంగా వాటిని మీ నియోజ‌క‌వ‌ర్గంలోని గంగా న‌దిలోనే క‌లిపేస్తాం” అని వారు హెచ్చ‌రించారు. అయితే.. ఈ ప్ర‌క‌ట‌న‌ను యూపీలోని బీజేపీ ప్ర‌భుత్వం స్వాగ‌తించడం మ‌రింత వివాదంగా మారింది.  వీరిని …

Read More »

పొత్తులు ఉన్నా.. లేకున్నా.. పర్లేదనుకుంటున్న చంద్ర‌బాబు 

తాజాగా ముగిసిన టిడిపి మహానాడు వేదికగా చంద్రబాబునాయుడు ప్రస్తావించ‌ని కీలకమైన అంశం పొత్తులు. వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలా వద్దా అనేటటువంటిది ఆయన మీమాంసలో ఉన్నారనేది స్పష్టమైంది. నిజానికి నిన్న మొన్నటి వరకు కూడా జన‌సేన‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు నాయుడు అంత‌ర్గతంగా పార్టీ నేత‌ల‌తో ప్రకటించారు. ఇదే పార్టీ వర్గాల్లో ప్రచారంలో వచ్చింది. జనంలోనూ దీనిని ముందుకు తీసుకువెళ్లాలి అనేటటువంటిది ప్రచారం జరిగింది. …

Read More »

పార్టీలోకి రమ్మని అడిగితే.. తమతో రమ్మన్నారట

రాజకీయ లెక్కలు మారుతున్నాయి. గతానికి భిన్నమైన రాజకీయం ఇప్పుడు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. ఏ పార్టీలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకోకుండా.. విపక్షాల్ని ఊరిస్తున్న పొంగులేటి.. జూపల్లిల ఉదంతంలో కొత్త సీన్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఇద్దరు నేతల్ని తమ పార్టీలోకి తీసుకుంటే మరింత బలోపేతం అవుతాయన్న ఆలోచనలో ఉన్నాయి బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు. అందుకు తగ్గట్లే పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ …

Read More »

ఎన్టీఆర్‌-వైఎస్‌ల‌ను మ‌రిచిపోతే.. ప్ర‌మాదం..

ఏపీ రాజకీయాల్లో పార్టీలు అనుసరిస్తున్న విధానాలను గమనిస్తే ఏ వర్గానికి లబ్ధి చేకూరితోంది. ఏ వర్గం నష్టపోతోంది అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా.. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు కోరుకునేది సంక్షేమ అభివృద్ధి. ఈ రెండు విషయాల్లో ప్రభుత్వాలు అనుకూలంగా ఉండాలని తమకు అనుకూలంగా పనిచేయాలని కోరుకుంటారు. కానీ ఏపీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఏ వర్గం ప్రజలు కూడా ఆసక్తిగా లేరు అని చెప్పాలి. …

Read More »

విష్ణుకు టీడీపీ మొండిచేయి?

రాజకీయాల్లో పాపం కొందరు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఎన్ని రోజులు ఎదురుచూసినా వాళ్ల ఆశలు నెరవేరవు. చివరకు ఉన్న దాంట్లో సర్దుకుపోదాములే అనుకుని ఊరుకుంటారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు, విశాఖ నార్త్ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పరిస్థితి కూడా అంతే. నిజానికి విష్ణు కుమార్ రాజు బీజేపీలో క్రియాశీల సభ్యుడు. పార్టీ లైన్లోనే ఉండేవారు. 2019లో ఓడిపోయిన తర్వాత ఏపీలో బీజేపీకి మనుగడ లేదని ఆయన అనిపించి …

Read More »