జ‌గ‌న్‌కు స‌ల‌హాలు: తిట్టొద్దు.. వెళ్లిపోతారు..!

వైసీపీలో ఏం జ‌రుగుతోంది? అంటే.. వినేవారు వింటున్నారు.. ఎవ‌రి మానాన వారు ఉంటున్నారు. ఈ మాట ఎవ‌రో కాదు.. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉంటున్న‌వారే చెబుతున్న మాట‌. ఈ క్ర‌మంలో ఎవ‌రినీ తిట్టొద్ద‌ని.. తిడితే.. వారు వెళ్లిపోతార‌ని.. కీల‌క స‌ల‌హాదారు జ‌గ‌న్‌కు సూచించారు. ఇది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. తాడేప‌ల్లిలోని పార్టీ కార్యాల‌యంలో వ‌రుస‌గా భేటీ లు నిర్వ‌హిస్తున్న అధినేత‌.. జిల్లాల్లో నాయ‌కుల ప‌నితీరును ప్ర‌శ్నిస్తున్నారు.

ముందుగానే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో జిల్లాల్లో బాధ్య‌త‌లు అప్ప‌గించిన ఇంచార్జ్లు.. చాలా మంది నిద్ర మొహాల‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఆయ‌న పేర్కొంటున్నారు. ఈ విష‌యాన్ని కూడా బ‌హిరంగంగానే చెబుతున్నారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి, తూర్పు, కృష్ణాజిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి పేల‌వంగా ఉంద‌ని జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాను ప‌ట్టించుకుంటే త‌ప్ప‌.. ఎవ‌రూ ముందుకు రారా? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

దీంతో పార్టీ స‌మావేశాల్లో ఒకింత సీరియ‌స్ నెస్ పెంచారు. ఆది నుంచి కూడా బుజ్జగింపు రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం లేని వైసీపీ నుంచి అనేక మంది నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే.. ఇప్పుడు కూడా అదే పంథా కొన‌సాగుతోంది. దీనిని కొంద‌రు జీర్ణించుకోలేక పోతున్నారు. పోనీ.. వెళ్లాలంటే అవ‌కాశాలు లేవు. అయితే.. అవ‌కాశాలు లేక‌పోయినా.. వెళ్లిపోయేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఎలానూ ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవు కాబట్టి.. ఓ మూడేళ్లు వ్యాపారాలు, వ్య‌వ‌హారాలు చూసుకోవాల‌ని రెడీ అవుతున్నారు.

దీనిని ప‌సిగ‌ట్టిన ఓ కీల‌క స‌ల‌హాదారు.. జ‌గ‌న్‌కు ఓ స‌ల‌హా ప‌డేశారు. ఎవ‌రినీ తిట్టొద్దు సార్‌.. తిడితే వెళ్లిపోతారు.. అప్పుడు పూర్తిగా పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది.. అని ఆయ‌న హిత‌వు ప‌లికారు. అయితే.. జ‌గ‌న్ మాత్రం వినే టైపు కాద‌క‌దా.. ఈ క్ర‌మంలోనే పశ్చి మ ఇంచార్జ్ ప్ర‌సాద‌రాజుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే.. ఆయ‌న ఇప్ప‌టికే త‌ట్టా బుట్టా స‌ర్దుకున్నార‌ని స‌మాచారం. ఇప్పుడు జ‌గ‌న్ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఆయ‌న జంప్ చేసేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఇది ఎక్క‌డికి దారి తీస్తుందో చూడాలి.