Political News

చంద్రబాబు డబుల్ ధమాకా.. 2 లక్షల మందికి లబ్ధి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం తన సొంత జిల్లా చిత్తూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. సామాజిక పింఛన్ల పంపిణీలో పాలుపంచుకునే నిమిత్తం చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గ పరిధిలోని రామానాయుడుపల్లెకు వెళ్లారు. అక్కడ పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు… ఆయా కుటుంబ సభ్యులతో హుషారుగా గడిపారు. ఆయా కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకుని మరీ వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఇద్దరు బాలికలకు …

Read More »

”ఏపీ భవిష్యత్తు జనసేన”

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇతరత్రా పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా… ఇప్పటికీ టాలీవుడ్ లో పవర్ స్టార్ గా ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే… దేశ రాజకీయాల్లోనే పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన పార్టీగా జనసేన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది, ఎన్నికల్లో జనసేన 2 ఎంపీ సీట్లు, 21 అసెంబ్లీ సీట్లలో పోటీ …

Read More »

పోసానిని కాపాడేది అనారోగ్యం ఒక్కటేనట!

వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రాజంపేట జైలులో విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆయనను రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పోసానికి ఈసీజీ తీసి.. సదరు రిపోర్టులను పరిశీలించి… పోసాని గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని నిర్ధారించారు. అంతేకాకుండా బుధవారం రాత్రి ఆయనను పోలీసులు …

Read More »

వైరల్ వీడియో… కన్నీరు ఆపుకోలేకపోయిన మాజీ మంత్రి

శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఓ ఘటన నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయాల్లో తూటాల్లాంటి మాటలను పేల్చడమే కాకుండా… ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేయగల సత్తా కలిగిన ఓ పవర్ ఫుల్ నేతగానే జనానికి తెలిసిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండకంట్ల జగదీశ్ రెడ్డి… చిన్న పిల్లాడికి మల్లే వెక్కి వెక్కి ఏడ్చేసినంత పనిచేశారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆయన ఆపుకోలేకపోయారు. ఎంత …

Read More »

వైసీపీ నేతలకు అనిత మాస్ వార్నింగ్!

2024 ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం వైసీపీని ఒక్కొక్కరూ వీడుతోన్న సంగతి తెలిసిందే. బాలినేని మొదలు మోపిదేవి వరకు జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇలా, వైసీపీలో అంతర్యుద్ధం మొదలై పీక్స్ కు చేరుకుంటున్న తరుణంలో కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైంది అంటూ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలకు హోం మంత్రి …

Read More »

‘రెడ్ బుక్’ ప్రశ్నలకు కందుల అదిరేటి రిప్లై!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే… వైసీపీ హయాంలో మీడియా, సోషల్ మీడియా వేదికలుగా వైరి వర్గాల నేతలు, వారి కుటుంబాలపై విచక్షణ లేకుండా వ్యాఖ్యలు చేసిన వారు వరుసగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. ఈ తరహా అరెస్టులపై అటు వైసీపీతో పాటు కొన్ని మీడియా సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు అవుతోందని, అందులో భాగంగానే …

Read More »

ఆ క్రెడిట్ అంతా రామ్మోహనుడిది కదా!

దేశంలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడికక్కడ కొత్తగా పుట్టుకు వస్తున్న కొత్త పార్టీలతో పాటు ఏళ్ల తరబడి ప్రస్థానం సాగిస్తున్న రాజకీయ పార్టీలు కూడా క్రెడిట్ కోసం పాకులాడే క్రమంలో ఏకంగా యుద్ధాలకే దిగుతున్నాయి. మొన్నటిదాకా ఈ తరహా క్రెడిట్ కోసం యత్నాలు జరిగినా.. పరస్పర నిందలు, విమర్శలు, వాదనలు, ప్రతిపాదనలు, ఆధారాల విడుదల… ఇలా రకరకాల పద్ధతులను వినియోగించే వారు. అయితే ఇప్పుడు ఈ క్రెడిట్ గోల …

Read More »

మీనాక్షి దెబ్బ అదిరిందిగా… ‘తీన్మార్’పై కాంగ్రెస్ వేటు

అంతా అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తన పనితీరు ఎంత కఠినంగా ఉంటుందో రెండో రోజే చూపించేశారు. శుక్రవారం అధికారికంగా పార్టీ తెలంగాణ ఇంచార్జీ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి… ఒక్కటంటే ఒక్క రోజు వ్యవధిలోనే తన దెబ్బ ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులకు రుచి చూపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న చింతపండు నవీన్ అలియస్ తీన్మార్ మల్లన్నపై వేటు పడిపోయింది. …

Read More »

బాబు నయా మంత్రం!… ఎక్కడి నిధులు అక్కడి అభివృద్ధికే!

ఏపీలో అధికారంలో ఉన్న కూటమి సర్కారు సరికొత్త నిర్ణయాలతో సత్తా చాటుతోంది. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి.. రెంటినీ రెండు కళ్ల మాదిరిగా భావిస్తూ సాగుతోంది. వీటిలో దేనిని కూడా నిర్లక్ష్యం చేయరాదన్న ధోరణితో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సాగుతున్నారు. అందులో భాగంగా అప్పటిదాకా ఉన్న పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలకు తిలోదకాలిచ్చేందుకు కూడా ఆయన ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ దిశగా ఇప్పుడు …

Read More »

పవన్ వ్యూహం బెటరన్న పీకే.. అయోమయంలో విజయ్

కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న సినీ నటులైనా.. ఇతర రంగాలకు చెందిన వ్యక్తులైనా… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించి సొంతంగా ఒంటి చేత్తో అధికారం చేజిక్కించుకోవడం దాదాపుగా అసాధ్యమేనని చెప్పాలి. ఎక్కడికక్కడ అటు జాతీయ పార్టీలతో పాటుగా… ఇటు ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉన్న నేపథ్యంలో ఈ తరహా వ్యూహాలు అంతగా పని చేయవని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఏపీనే తీసుకుంటే… జనసేన పేరిట రాజకీయాల్లోకి …

Read More »

జగన్ ను బాబు సాంతం చదివేశారు!

నిజమే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆసాంతం చదివేశారు. రాజకీయాల్లో తల పండిన చంద్రబాబు.. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటుపోట్లను చవిచూశారు. అందివచ్చిన విజయాలతో పాటుగా ఎదురు వచ్చిన ప్రతి ప్రతిబంధకాన్ని కూడా ఆయన క్షుణ్ణంగానే చదవేశారు. లేకుంటే… విడతల వారీగా ఓ సారి గెలుపు… ఓ సారి ఓటమి ఎలా సాధ్యపడతాయి? ఓటమి నుంచి పాఠాలు …

Read More »

ఏపీలో ఆ రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ముందా?: రేవంత్ రెడ్డి

ఏపీలో ఎన్ డి ఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, అక్కడ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని కిషన్ రెడ్డి చూస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదు? అక్కడ మాదిగలకు ద్రోహం చేయడం లేదా? అని కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి …

Read More »