Political News

ఏయే రాష్ట్రాల్లో ఎవ‌రిది పైచేయి.. తాజా స‌ర్వే!

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను బీజేపీ, కాంగ్రెస్‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇరు పార్టీలూ చ‌మ‌టోడుస్తున్నాయి. మూడోసారి కూడా అధికారంలోకి రావాల‌ని ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యించుకుని దూసుకుపో తున్నారు. క‌నీసం ఇప్పుడైనా గెల‌వ‌క‌పోతే.. పార్టీనే పుట్టిమునుగుతుంద‌న్న ఆందోళ‌న‌లో కాంగ్రెస్ అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో రెండు మూడు రోజుల్లోనే షెడ్యూల్ విడుద‌ల కానుంది. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉంది? ఏ పార్టీకి …

Read More »

కేసీఆర్‌కు గుత్తా గుడ్ బై.. త్వ‌ర‌లోనే కాంగ్రెస్‌లో చేరిక‌!

కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత బీఆర్ ఎస్ నేత‌, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్ప‌డం దాదాపు ఖ‌రారైపోయింది. త్వ‌ర‌లోనే వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో భువ‌నగిరి స్థానం నుంచి గుత్తా త‌న‌యుడు అమిత్ రెడ్డి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు కేటాయించే అవ‌కాశం ఉంది. …

Read More »

పొత్తుల ఎఫెక్ట్‌.. సీఎం రిజైన్‌

హ‌రియాణ రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం తెర‌మీదికి వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌రకు బాగానే ఉన్న ఈ రాష్ట్ర రాజ‌కీయాలు.. పార్ల‌మెంటు ఎన్నికల వేళ గాడి త‌ప్పాయి. అది కూడా.. కేవ‌లం ఒకే ఒక్క పార్ల‌మెంటు సీటు విష‌యంలో పొత్తు పార్టీల మ‌ధ్య నెల‌కొన్న వివాదం.. రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌భావం చూపి.. ఏకంగా ముఖ్య‌మంత్రి త‌న‌ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. ఏం జ‌రిగింది? దేశ‌రాజ‌ధాని ఢిల్లీకి చేరువ‌లో ఉన్న …

Read More »

ఆమె ట్రోల్స్‌కు భయపడే చనిపోయిందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండగా.. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు తార స్థాయికి చేరుతున్నాయి. ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టట్లేదు పార్టీలు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా రోజుకో వివాదం ముసురుకుంటోంది. ప్రస్తుతం గీతాంజలి అనే గుంటూరు మహిళ మరణానికి చెందిన వివాదం హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని రోజుల కిందట ఈ మహిళ వీడియో …

Read More »

ఆ ఇద్ద‌రు ఔట్‌.. ఏపీలో కీల‌క నిర్ణ‌యం!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజ‌కీయాలు వేడి వేడిగా మారుతున్నాయి. ప్రత్యర్థుల ను చిత్తు చేసే ఉద్దేశంలో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.  అధికార పార్టీ ఆ దిశగా మరింత వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇటీవ‌ల రెబ‌ల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్‌ ఇప్పుడు ఎమ్మెల్సీలపై మండ‌లి చైర్మ‌న్ వేటు వేశారు. వైసీపీ తరఫున ఎన్నికైన వారు..  వేరే పార్టీల్లో చేరిన నేప‌థ్యంలో వారిపై మండ‌లి చ‌ర్య‌లు …

Read More »

ఫ్యామిలి ప్యాక్ గోల పెరిగిపోతోందా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా కాంగ్రెస్ లో టికెట్ల కోసం బాగా ఒత్తిళ్ళు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉండటం, పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాల కారణంగా టికెట్ల కోసం పోటీ బాగా పెరిగిపోతోంది. ఇందులో కూడా ఫ్యామిలీ మెంటర్లకు టికెట్లు కావాలంటు సీనియర్ల నుండి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. చాలామంది సీనియర్లకు ఢిల్లీలోని కీలకనేతలతో ఉన్న సంబంధాల కారణంగా ఎవరికివారుగా తమ కుటుంబసభ్యలకు టికెట్లు ఇప్పించుకునేందుకు లాబీయింగ్ …

Read More »

ఇద్దరు అభ్యర్ధులను ఎంపికచేశారా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేయబోయే ఇద్దరు నేతలకు కేసీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నల్గొండ పార్లమెంటు సీటు నుండి కొంచర్ల కృఫ్ణారెడ్డి, చేవెళ్ళ లోక్ సభకు కాసాని జ్ఞానేశ్వర్ ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇప్పటికి విడతలవారీగా కేసీయార్ ఆరుగురు అభ్యర్ధులను ఫైనల్ చేశారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో 6 గురిని ఫైనల్ చేసిన కేసీయార్ తాజాగా మరో రెండుస్ధానాల్లో కూడా ఖరారు చేసినట్లు పార్టీ …

Read More »

కాంగ్రెస్ వేట మొదలుపెట్టిందా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ వేట మొదలుపెట్టినట్లుంది. అన్నీ స్ధానాల్లో కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులకు ధీటైన అభ్యర్ధులను రంగంలోకి దింపాలన్న ఆలోచనతోనే వేట మొదలుపెట్టింది. విషయం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం బోల్తాపడింది. సికింద్రాబాద్, హైదరాబాద్, మెదక్, మల్కాజ్ గిరి, భువనగిరి లోక్ సభ సీట్ల పరిధిలో ఆశించిన స్ధాయిలో గెలవలేదు. …

Read More »

చంద్రబాబుపై మరో ఛార్జ్ షీట్

అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రూ.4,400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ కుంభకోణంలో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు పేరును చేర్చిన దర్యాప్తు సంస్థ.. ఆయనతో పాటు మాజీ మంత్రి నారాయణను ముద్దాయిగా పేర్కొంది. రాజధాని అమరావతి పేరిట భారీ భూ దోపిడీ జరిగిందని సీఐడీ ఆరోపించింది. మొత్తం 1100 ఎకరాల …

Read More »

టీడీపీ 144, జ‌న‌సేన 21, బీజేపీ 10

టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ మిత్ర ప‌క్షం మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు ఒక కొలిక్కి వ‌చ్చింది. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించిఈ మూడు పార్టీలూ.. సుదీర్ఘంగా 8 గంట‌ల పాటు చ‌ర్చించిన ద‌రిమిలా.. అనేక మార్పులు, చేర్పుల అనంత‌రం సీట్ల పంప‌కాల‌పై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయి. దీని ప్ర‌కారం.. అసెంబ్లీలోని 175 స్థానాల‌కు గాను టీడీపీ 144, జ‌న‌సేన 21, బీజేపీ 10 స్థానాల్లోనూ పోటీ చేయ‌నుంది. ఇక‌, పార్ల‌మెంటు స్థానాల‌కు సంబంధించి ఏపీలో …

Read More »

ఈ ‘లెస్ కరప్టడ్’ YCP మంత్రి ని చూశారా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా పిలవబడుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం.! వైసీపీ నేత, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, తనను తాను ‘లెస్ కరప్టడ్’‌గా అభివర్ణించుకోవడమే ఆ తీవ్ర కలకలానికి కారణం.! అయినా, ఆయన ఏమన్నాడనీ, ‘లెస్ కరప్టడ్’ అని మాత్రమే కదా.? రూపాయి దొంగతనం జరిగినా, దాన్ని దొంగతనం అనే అంటారు.! లక్ష కోట్ల దొంగతనాన్నీ దొంగతనమే అంటారు.! రెండిటికీ పెద్ద …

Read More »

మోడీ మ‌రో విశ్వ‌రూపం..

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ త‌న విశ్వరూపం మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు. ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు, ఉమ్మ‌డి పౌర‌స్మృతి అమ‌లు, జ‌మ్ము క‌శ్మీర్ విభ‌జ‌న, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు వంటి అనేక నిర్ణ‌యాల‌తో త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించిన ప్ర‌దాని మోడీ.. తాజాగా పౌర స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం-2019(సీఏఏ(CAA)-సిటిజ‌న్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్‌)ను అమ‌ల్లోకి తెచ్చేసింది. త‌క్ష‌ణ‌మే ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర హొంశాఖ‌ ప్రకటించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుద‌ల‌ చేసింది. …

Read More »