దాయాది దేశం పాకిస్థాన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. తమపై భారత్ కత్తి దూస్తుందని పాక్ అంచనా వేసింది. అయితే.. దీనిని యాగీ చేయాలని.. ప్రపంచం దృష్టిని ఆకర్షించి.. భారత్‌ను ఏకాకిని చేయాలని పాక్ పన్నాగం పన్నింది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా కవ్వింపు చర్యలకు కూడా దిగింది. దీంతో భారత్ రెచ్చిపోయి.. పాక్‌పై నేరుగా యుద్ధానికి దిగితే.. దానిని బూచిగా చూపించి.. భారత్‌పై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించేలా చేయాలన్నది పాక్ పన్నాగం.
కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం పాక్‌కు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. పక్కా వ్యూహంతో దాయాది దేశానికి కౌకు దెబ్బలు కొట్టారు.(పైకి కనిపించకుండా.. లోలోన కుమిలిపోయేలా) దీంతో ఇప్పుడు పాక్ లబోదిబోమంటోంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా.. ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎక్కడా ఏ దేశం కూడా..ఉగ్రవాదాన్ని సమర్థించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పాక్‌లో ఆశ్రయం పొందుతున్న, ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతున్న ఉగ్రవాదులపై కత్తి దూస్తే.. ఏ దేశం కూడా భారత్‌ను అడ్డుకునే పరిస్థితి లేకుండా.. ముందుండి.. గత వారం రోజులుగా మంత్రాంగం నడిపారు.
అటు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యదేశాల నుంచి ఇటు వ్యక్తిగతంగా ఇతర మిత్ర దేశాలను కూడా మోడీ భారత్ కు అనుకూలంగా మళ్లించారు. వాటు చూసి వేటేసినట్టు.. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై పక్కా లెక్కతో దాడులు చేశారు. ఇప్పుడు దాడులు జరిగింది ఎక్కడ? అంటే.. ఉగ్రవాద శిబిరాలపై. దీనిని ప్రపంచం కూడా హర్షిస్తుంది. పాక్‌కు వాయిస్ లేకుండా పోయింది. ఇప్పుడు ధ్వంసమైనవి ఏంటి? అంటే.. ఉగ్రవాద శిబిరాలే.. ఇక్కడ ప్రపంచ మద్దతు భారత్ కే ఉంది. పాక్ ఒంటరి అయింది.
ఇక, పాక్ భూభాగంలోకి వెళ్లి.. దాడులు చేసిందా? అంటే..అది కూడా కేవలం భారత భూభాగం నుంచే తాజాగా జరిగిన సిందూర్ దాడులు జరిగాయి. సో.. ఈ విషయంలోనూ పాక్ నోరు మెదపలేని పరిస్థితి వచ్చింది. ఎలా చూసుకున్నా.. పాక్‌కు గట్టి దెబ్బే తగిలినా..చెప్పలేని పరిస్థితి.. పైకి కనిపించని పరిస్థితి నెలకొంది. ఎలా చూసుకున్నా.. ఉగ్ర శిభిరాలపై దాడి జరిగింది తప్ప.. పాక్‌పై కాదన్న వాదనే బలంగా వినిపిస్తోంది. సో.. ఇదీ.. భారత్ కౌకు దెబ్బ అంటే! అనే కామెంట్లుఅందరి నుంచి వినిపిస్తున్నాయి.