Political News

ఇద్దరు అభ్యర్ధులను ఎంపికచేశారా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేయబోయే ఇద్దరు నేతలకు కేసీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నల్గొండ పార్లమెంటు సీటు నుండి కొంచర్ల కృఫ్ణారెడ్డి, చేవెళ్ళ లోక్ సభకు కాసాని జ్ఞానేశ్వర్ ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇప్పటికి విడతలవారీగా కేసీయార్ ఆరుగురు అభ్యర్ధులను ఫైనల్ చేశారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో 6 గురిని ఫైనల్ చేసిన కేసీయార్ తాజాగా మరో రెండుస్ధానాల్లో కూడా ఖరారు చేసినట్లు పార్టీ …

Read More »

కాంగ్రెస్ వేట మొదలుపెట్టిందా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ వేట మొదలుపెట్టినట్లుంది. అన్నీ స్ధానాల్లో కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులకు ధీటైన అభ్యర్ధులను రంగంలోకి దింపాలన్న ఆలోచనతోనే వేట మొదలుపెట్టింది. విషయం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం బోల్తాపడింది. సికింద్రాబాద్, హైదరాబాద్, మెదక్, మల్కాజ్ గిరి, భువనగిరి లోక్ సభ సీట్ల పరిధిలో ఆశించిన స్ధాయిలో గెలవలేదు. …

Read More »

చంద్రబాబుపై మరో ఛార్జ్ షీట్

అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రూ.4,400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్లు సీఐడీ నిర్ధారించింది. ఈ కుంభకోణంలో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు పేరును చేర్చిన దర్యాప్తు సంస్థ.. ఆయనతో పాటు మాజీ మంత్రి నారాయణను ముద్దాయిగా పేర్కొంది. రాజధాని అమరావతి పేరిట భారీ భూ దోపిడీ జరిగిందని సీఐడీ ఆరోపించింది. మొత్తం 1100 ఎకరాల …

Read More »

టీడీపీ 144, జ‌న‌సేన 21, బీజేపీ 10

టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ మిత్ర ప‌క్షం మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు ఒక కొలిక్కి వ‌చ్చింది. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించిఈ మూడు పార్టీలూ.. సుదీర్ఘంగా 8 గంట‌ల పాటు చ‌ర్చించిన ద‌రిమిలా.. అనేక మార్పులు, చేర్పుల అనంత‌రం సీట్ల పంప‌కాల‌పై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయి. దీని ప్ర‌కారం.. అసెంబ్లీలోని 175 స్థానాల‌కు గాను టీడీపీ 144, జ‌న‌సేన 21, బీజేపీ 10 స్థానాల్లోనూ పోటీ చేయ‌నుంది. ఇక‌, పార్ల‌మెంటు స్థానాల‌కు సంబంధించి ఏపీలో …

Read More »

ఈ ‘లెస్ కరప్టడ్’ YCP మంత్రి ని చూశారా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా పిలవబడుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం.! వైసీపీ నేత, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, తనను తాను ‘లెస్ కరప్టడ్’‌గా అభివర్ణించుకోవడమే ఆ తీవ్ర కలకలానికి కారణం.! అయినా, ఆయన ఏమన్నాడనీ, ‘లెస్ కరప్టడ్’ అని మాత్రమే కదా.? రూపాయి దొంగతనం జరిగినా, దాన్ని దొంగతనం అనే అంటారు.! లక్ష కోట్ల దొంగతనాన్నీ దొంగతనమే అంటారు.! రెండిటికీ పెద్ద …

Read More »

మోడీ మ‌రో విశ్వ‌రూపం..

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ త‌న విశ్వరూపం మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు. ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు, ఉమ్మ‌డి పౌర‌స్మృతి అమ‌లు, జ‌మ్ము క‌శ్మీర్ విభ‌జ‌న, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు వంటి అనేక నిర్ణ‌యాల‌తో త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించిన ప్ర‌దాని మోడీ.. తాజాగా పౌర స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం-2019(సీఏఏ(CAA)-సిటిజ‌న్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్‌)ను అమ‌ల్లోకి తెచ్చేసింది. త‌క్ష‌ణ‌మే ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర హొంశాఖ‌ ప్రకటించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుద‌ల‌ చేసింది. …

Read More »

ఏటి.. ఆ పార్టీలింకా ఉన్నాయా?

ఏటి.. ఆ పార్టీలింకా ఉన్నాయా? నాకైతే ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు అని వైసీపీ సీనియ‌ర్ నేత‌, మంత్రి బొత్స స‌త్య‌నారాయణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ముఖ్యం కాదని, తమకు నైతిక విలువే ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. ఎక్కడో ఒక‌టి రెండు చోట్ల ఉన్న టీడీపీ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత‌.. చ‌రిత్ర‌లో క‌లిసి పోతుంది. కనుమరుగు అవుతుంది అని …

Read More »

మ‌రి ప‌దేళ్ళు ఏం చేశారు ష‌ర్మిల‌మ్మా!

Sharmila

రాజ‌కీయాలంటేనే అవ‌కాశ వాదం. అవ‌స‌రాల సమాహారం. ఏ పార్టీ కూడా ఉత్తినే మ‌రో పార్టీతో చేతులు క‌ల‌ప‌దు. సొంత లాభం కొంత మానుకోవ‌డానికి ఇదే గుర‌జాడ‌ వారి రోజులు కానేకావు. ఇవ‌న్నీ.. ఎవ‌రి స్వార్థం వారు చూసుకునే ప‌క్కా పొలిటిక‌ల్ డేస్‌. ఈ విష‌యం తెలిసి.. తాను కూడా ఇదే బాటలో న‌డిచిన ష‌ర్మిల‌.. పొరుగు పార్టీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం విచిత్రంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తెలంగాణ‌లో పార్టీ పెట్టుకున్న …

Read More »

ఎస్‌బీఐకి మైండ్ బ్లాక్ చేసిన సుప్రీంకోర్టు

రాజ‌కీయ పార్టీల‌కు ఎల‌క్టోర‌ల్ బాండ్ల రూపంలో వెల్లువెత్తిన విరాళాల వివ‌రాల‌ను బ‌య‌ట పెట్టి తీరాల్సిం దేన‌ని సుప్రీంకోర్టు మ‌రోసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఏ పార్టీకి ఎవ‌రు.. ఎంతెంత ఇచ్చారు? ఎవ‌రెవ‌రు దీనిని తీసుకున్నారు. వంటివివ‌రాల‌ను వెల్ల‌డించాల్సిందే. దీనిలో మిన‌హాయింపు లేదు అని తాజాగా సుప్రీంకోర్టు ఐదుగురు స‌భ్యుల బెంచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వాస్త‌వానికి ఈ కేసును గ‌త వార‌మే విచారించిన కోర్టు.. బాండ్ల వివ‌రాలను …

Read More »

గ్రీన్ మ్యాట్లా.. ఇది మరీ విడ్డూరం

సిద్ధం.. సిద్ధం.. సిద్ధం.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మద్దతుదారులు కొంత కాలంగా ఊదరగొట్టేస్తున్నారు. ఆ పేరుతో సభలు నిర్వహించడంతో పాటు భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఐతే ‘సిద్ధం’ సభలన్నీ జగన్ జన బలాన్ని చూపించే లక్ష్యంతోనే సాగుతున్నాయి. తొలి సభకు 3 లక్షల మంది హాజరైతే.. రెండో సభకు 6 లక్షల మంది వచ్చారన్నారు. మూడో సభకు 10 లక్షల టార్గెట్ …

Read More »

జ‌గ‌న్, మ‌మ‌తా.. సేమ్ టు సేమ్‌!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌లు రాజ‌కీయ పార్టీలు ప్రచారం ప్రారంభించాయి. అయితే.. వీటిలో కొన్ని పార్టీలు వ్యూహాల‌కు సంబంధించి సంస్థ‌ల‌ను పెట్టుకున్నాయి. వీటిలో ఐప్యాక్ కీల‌కంగా ప‌నిచేస్తోంది. మ‌రో వైపు కాంగ్రెస్ సునీల్ క‌నుగోలు ప‌నిచేస్తున్నారు. ఈయ‌న మాట ఎలా ఉన్నా.. ఐప్యాక్ మాత్రం ప్రాంతీయంగా చూసుకుంటే.. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్‌, ఏపీ అధికార పార్టీ వైసీపీకి, త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకేకి కూడా ప‌నిచేస్తోంది. దీంతో …

Read More »

నేటితో లెక్కలు తేలిపోనున్నాయి

Chandrababu

గుంటూరు జిల్లాలోని ఉండ‌వ‌ల్లిలో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నివాసంలో పొత్తుల చ‌ర్చ‌లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అగ్ర‌నేత‌లు, ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌లుగా తాత్కాలిక బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా అటు పవన్‌తో పాటు తమ …

Read More »