అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానెల్ లో నిర్వహించిన డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చర్చ నిర్వహించిన జర్నలిస్ట్ కొమ్మినేని వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా జడ్జి అడిగిన ప్రశ్నలకు సమాధానం …
Read More »ఏపీపై మోదీ ఇంత ప్రత్యేక దృష్టి పెట్టారా?
ఆంధ్ర ప్రదేశ్ అక్షరమాల ప్రకారం చూస్తే… దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే పైన తొలి స్థానంలో కనిపిస్తుంది. అలాంటి ఏపీకి అన్ని రకాలుగా ప్రాధాన్యం దక్కాల్సిందే. నిధుల కేటాయింపులో అయినా, ఇతరత్రా అభివృద్ధి పనుల్లో అయినా ఏపీకి కేటాయింపులు జరిగిన తర్వాతే ఇతర రాష్ట్రాల జోలికి కేంద్రం వెళ్లాలి. అయితే మొన్నటిదాకా ఈ తరహా పరిస్థితి ఏమీ కనిపించలేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. …
Read More »‘సర్వే’ చేయించుకుంటున్నారు ..!
రాష్ట్రంలో సర్వేలకు ప్రాధాన్యం పెరుగుతోంది. పార్టీ ఏదైనా.. నాయకులు ఎవరైనా.. సర్వేలకు ఇస్తున్న ప్రా ధాన్యం అంతా ఇంతా కాదు. నిజానికి సర్వేలంటే.. ఎన్నికలకు ముందు లేదా.. ఎన్నికల ఏడాదిలో జరుగుతాయి. అప్పుడు ప్రజల నాడిని తెలుసుకునేందుకు నాయకులు ప్రయత్నాలు చేస్తారు. ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు సర్వేలు చేయించుకుంటారు. ఇది కొన్ని దశాబ్దాలుగా ఉన్న పద్ధతి. అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారింది. …
Read More »చెవిరెడ్డి ఉబలాటం ఓ సారి తీరిస్తే పోలా..?
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అదినేతకు అత్యంత విశ్వసనీయుడిగా గుర్తింపు సంపాదించుకున్న చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి ఈ మధ్య పదే పదే మీడియా ముందుకు వస్తున్నారు. ఏపీలో కలకలం రేపుతున్న లిక్కర్ స్కాం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో తనను ఇరికించాలని కూటమి సర్కారు కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. అదే గనుక జరిగితే… సిట్ అదికారులు తనకు ఫోన్ చేస్తే …
Read More »జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్‌ను రెడ్లకు అమ్మే కుట్ర: రాజా సింగ్
హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రెండు రోజుల కిందట మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మరో ఆరు మాసాల్లో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే.. తాజాగా బీజేపీ నాయకుడు, ఘోషా మ హల్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ ఈ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు. ఉప ఎన్నికకు ఇంకా ముహూర్తం ఖరారు కాకముందే.. ఈ టికెట్‌ను రెడ్లకు …
Read More »బాబు సెలెక్షన్ ఏపాటిదో చెప్పే ఘటన ఇది!
ఏపీలో 2019-24 మధ్య సాగిన వైసీపీ పాలనలో ప్రభుత్వ సలహాదారుల ఎంపిక ఏ రీతిన సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షిలో పనిచేసిన చాలా మంది జర్నలిస్టులకు ఆయన ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఇంకా లోతుగా వెళితే చాలానే ఉంది గానీ… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సలహాదారులుగా ఎంపిక చేస్తున్న వారి అర్హతలు, వారి పూర్వానుభవం, …
Read More »రేపే విచారణకు కేసీఆర్.. మేనల్లుడితో సుదీర్ఘ చర్చ
తెలంగాణ రాజకీయాల్లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. భారత రాష్ట్ర సమతి (బీఆర్ఎస్) అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనా కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. అయితే ఆ ప్రాజెక్టులోని కీలక భాగం అయిన మేడిగడ్డ డ్యామ్ ఉపరితలం కుంగింది. దీనిపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఏకంగా విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి …
Read More »ఏలూరు ‘సాక్షి’ ఆఫీసుకు నిప్పు.. ఎవరి పని?!
ఏలూరు జిల్లాలోని ‘సాక్షి’ కార్యాలయానికి కొందరు దుండగులు నిప్పంటించారు. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడి.. ఫర్నిచర్ సహా.. పలు కీలకవస్తువులు, వాహనాలు కూడా దహనమయ్యాయి. అయితే.. ఈ ఘటనపై రెండు రకాల వాదనలు తెరమీదికి వచ్చాయి. ఇదంతా టీడీపీ తరఫున నిరసనల పేరుతో అరాచకాలకు దిగిన వారి పనేనని సాక్షి ప్రతినిధులు చెబుతు న్నారు. పోలీసులు కూడా అక్కడే ఉన్నా.. ఎవరినీ అదుపు చేయలేదని.. నిప్పు పెట్టి …
Read More »సుపరిపాలన-స్వర్ణాంధ్ర.. 12న వేడుక!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12కు ఏడాది పూర్తవుతుంది. వాస్తవానికి ఎన్నికల ఫలితం వచ్చింది జూన్ 4నే అయినా.. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది మాత్రం గత ఏడాది జూన్ 12న. దీంతో ఈ నెల 12నాటికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పార్టీల పరంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు రెడీ అయ్యాయి. ఈ పార్టీల్లోనూ టీడీపీ నేతలు.. …
Read More »పోలీసులూ మీ ఇష్టం : చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు ప్రకటించారు. “పోలీసులూ మీ ఇష్టం. ఎలాంటి చర్యలు తీసుకున్నా.. నేనేమీ అడగను. కానీ, రాష్ట్రంలో మహిళలకు, యువతులకు, చిన్నారులకు భద్రత కల్పించాలి. అసాంఘిక శక్తులు నేరం చేయాలంటేనే వణుకు పుట్టేలా చేయాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా సచివాలయంలో రాష్ట్ర డీజీపీ సహా హోం శాఖ సెక్రటరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత వారం రోజుల్లో …
Read More »శాంతి భద్రతలపై కుట్ర పన్నారు: కొమ్మినేని రిమాండ్ రిపోర్ట్
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే.. కొమ్మినేనికి సంబందించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను పేర్కొన్నారు. సాక్షి మీడియా వేదికగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి, అశాంతిని రెచ్చగొట్టి, అల్లర్లను ప్రేరేపించే విధంగా కుట్ర పన్నినట్టు పేర్కొన్నారు. దీనిని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే అమరావతిపై …
Read More »సజ్జల మూర్ఖుడు: షర్మిల
వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్.. సజ్జల రామకృష్నారెడ్డిపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఆయన మూర్ఖుడు.. అంటూ దుమ్మెత్తి పోశారు. రాజధాని అమరావతిలో ఆ తరహా మహిళలు ఉంటారంటూ.. సాక్షిమీడియాలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్లపై మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజధాని మహిళలు మరింత ఎక్కువగా ఆవేదన, ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు సాక్షి ఆఫీసుల వద్ద …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates