ముహూర్తం పెట్టేశారా.. జ‌గ‌న్ అరెస్టు ఖాయమేనా.. ?

ఎస్‌! ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం వ్య‌వహారం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. దీనిలో కీల‌క పాత్ర వ‌హించిన వారిని ఇప్ప‌టికే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అరెస్టు చేసింది. వీరు ఇస్తున్న స‌మాచారం ఆధారంగా.. మ‌రింత మందిని అరెస్టు చేస్తున్నారు. ఇప్పుడు మ‌రో పేరు బాల్ రెడ్డి అని వినిపిస్తోంది. ఈయ‌న ఎవ‌రు ఏంట‌నేది .. సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. ఇవ‌న్నీ చూస్తే.. అంతిమంగా జ‌గ‌న్ అరెస్టుకు మార్గం సుగ‌మం చేసుకుంటున్నార‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

అయితే.. జ‌గ‌న్ అరెస్టు విష‌యంలో రెండు ర‌కాలుగా ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంద‌న్న‌ది ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ‌. సాధార‌ణంగా ఒక రాజ‌కీయ నేత‌ను, ముఖ్యంగా మాజీ సీఎంను అరెస్టు చేస్తే.. ప్ర‌జ‌ల్లో సానుభూతి వెల్లువెత్తుతుంది. రాజ‌కీయ దురుద్దేశంతోనే ఆయ‌న‌ను అరెస్టు చేస్తున్నార‌న్న చ‌ర్చ కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తుంది. గ‌తంలో త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత‌ను క‌రుణానిధి అరెస్టు చేసి జైలుకు పంపించిన‌ప్పుడు కూడా ఇతే త‌ర‌హా చ‌ర్చ సాగింది.

దీంతో అది క‌రుణానిధికి మైన‌స్ అయి.. జ‌య‌ల‌లిత విజ‌యానికి బాట‌ప‌రిచింది. ఏపీలోనూ.. గ‌త రెండేళ్ల కింద‌ట ఇదే జ‌రిగింది. చంద్ర‌బాబు అరెస్టుతో అప్ప‌టి వ‌ర‌కు వేర్వేరుగా ఉన్న జ‌న‌సేన -టీడీపీ చేతులు క‌లిపి.. క్షేత్ర‌స్థాయిలో వైసీపీని ఓడించాల‌న్న క‌సిని పెంచాయి. మ‌రి .. ఇప్పుడు కూడా ఇదే ప‌రిస్థితి ఉండే అవ‌కాశం ఉంటుందా? అనేది చ‌ర్చ‌. అయితే.. అలా రాకుండా.. ఉండేందుకు.. ప‌క్కాప్ర‌ణాళిక‌తో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వైసీపీ హ‌యాంలో మ‌ద్యం వ్య‌వ‌హారంపై ప్ర‌జ‌ల్లోనూ వ్య‌తిరేక ప్ర‌భావం ప‌డింది. నాణ్య‌మైన లిక్క‌ర్‌ను లేకుండా చేసి.. చీప్ లిక్క‌ర్‌ను తీసుకువ‌చ్చి.. త‌మ ప్రాణాలు హ‌రిస్తున్నార‌ని మందుబాబులు కూడా ఉద్య‌మించారు. ఇప్పుడు అదే కేసును అదే కోణంలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించి.. జ‌గ‌న్‌ను దోషిగా నిల‌బెట్టి.. ఇది రాజ‌కీయ క‌క్ష సాధింపు కాద‌న్న కోణంలో ప్ర‌జ‌ల‌ను ఆలోపించేలా చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. దీంతో సింపతీ వ‌చ్చే అవ‌కాశం లేదు.

ఇక‌, రెండోది ఇప్ప‌టికిప్పుడు ఎలానూ ఎన్నిక‌లు లేవు. పైగా.. క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ లేరు. ఈ క్ర‌మంలో ఇప్పుడు అరెస్టు చేసినా.. రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని .. పోరాడే నాయ‌కులు కూడా లేర‌ని చంద్ర‌బాబు అంచ‌నాలు వేసుకున్నారు. సో.. ఈ రెండు కార‌ణాల‌పై క్లారిటీ వ‌చ్చిన నేప‌థ్యంలోనే ఆయ‌న ఢిల్లీకి వెళ్లి.. కేంద్రంతోనూ చ‌ర్చించారు. జ‌గ‌న్‌పై ఉన్న వివాదాల‌ను కేంద్రానికి వివ‌రించారు. అక్క‌డ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వ‌చ్చిన‌ట్టు తెలిసింది.