బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ ఆర్ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ కోర్టులో ఆయనను హాజరుపరచగా 14 రోజులపాటు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఆంజనేయులును విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.ఈ కేసులో మంగళవారం నాడు ఆంజనేయులును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడైనట్లు …
Read More »మహానాడు.. పొలిటికల్ పంబరేగేలా..!
టీడీపీ నిర్వహించ తలపెట్టిన మహానాడు ఈ దఫా పంబరేగడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. పోయి పోయి.. వైసీపీ అధినేత జగన్ ఇలాకాలో పెడుతున్న ఈ మహానాడుకు చాలా విశేషాలు ఉన్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు 75వ సంవత్సరం పూర్తి చేసుకోవడంతోపాటు.. ఆయన సుదీర్ఘకాలంగా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రికార్డును సృష్టించారు. ఈ క్రమంలో నిర్వహిస్తున్న మహానాడుకు.. అతిరథులను కూడా ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఎన్డీయే కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలను ఈ …
Read More »పహల్గాం ఉగ్రదాడి.. ఐపీఎల్ మ్యాచ్ లో చీర్ లీడర్ల బంద్!
పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్ తో పాటు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో కశ్మీర్లో ముష్కరులు అమాయకులపై దాడి చేసిన వైనం కలవరపాటుకు గురిచేసింది. కశ్మీర్ అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులే లక్ష్యంగా టెర్రరిస్టులు పాశవికంగా జరిపిన ఈ దాడిలో 30 మంది చనిపోయారు. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద …
Read More »పహల్గామ్ మారణ హోమానికి మూడు కారణాలు!
జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ మారణ హోమం.. దేశాన్నే కాదు.. ప్రపంచ దేశాలను కూడా కుదిపేస్తోంది. దేశంలో ఉగ్రవాదానికి చాలా మటుకు తుదముట్టించామని.. ఇప్పుడు అంతర్గత శత్రువులతో(రాజకీయ నేతలు) పోరాడుతున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పిన రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం.. ఏపీ సహా పలు ప్రాంతాలకు చెందిన పర్యటకులు ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోవడం.. మరో వందల సంఖ్యలో పర్యాటకులు స్థానికంగా చిక్కుకు …
Read More »దువ్వాడపై చర్యలు జగన్ కు ఇష్టం లేదా?
ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ దాదాపుగా ఏడాదికి పైగానే వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తున్నారు. దువ్వాడకు సంబంధించి ఏ వార్త వచ్చినా అది ఇట్టే వైరల్ అయిపోయింది. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలను వదిలేసిన దువ్వాడ… దివ్వెల మాధురితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దివ్వెల మాధురితో కలిసి దువ్వాడ హైదరాబాద్ లో ఓ చీరల దుకాణాన్ని కూడా తెరిచారు. తాజాగా దువ్వాడను …
Read More »కసిరెడ్డి గుట్టు విప్పేశారు!.. సూత్రధారి జగనే!
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణానికి సంబంధించిన గుట్టు దాదాపుగా వీడిపోయినట్టేనని చెప్పాలి. ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి… సీఐడీ విచారణలో భాగంగా ఈ కుంభకోణానికి సంబందించిన మొత్తం గుట్టును విప్పేసినట్లుగానే తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారం మొత్తానికి సూత్రధారి నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని కూడా ఆయన …
Read More »జైలుకు వెళ్లాలని పీఎస్ఆర్ కోరుకున్నారా?
ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపుల కేసులో అరెస్టైన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పి.సీతారామాంజనేయులు అరెస్టు కావడానికి తహతహలాడిపోయారా? అంటే… సీఐడీ అధికారుల విచారణలో ఆయన సమాధానం వింటే మాత్రం అవుననే చెప్పాలి. అరెస్టు అయ్యేందుకు ఆయన అమితాసక్తి చూపారట. తన కోసం ఏపీ పోలీసులు వస్తారని, తనను అరెస్టు చేస్తారని ముందే తనకు తెలుసునని… అరెస్టు అయ్యాక ఓ సారి జైలుకు వెళ్లి …
Read More »పహల్గామ్ ఉగ్రదాడి.. TRF వెనకున్నది ఎవరు?
పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడి వెనుక ఉన్నది తామేనంటూ TRF (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ప్రకటించుకోవడంతో, ఈ సంస్థ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ దాడిలో 25 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో ‘టీఆర్ఎఫ్’ గురించి మరోసారి చర్చ మొదలైంది. అసలు ఈ టీఆర్ఎఫ్ ఎవరు? దీని వెనుక ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2019 ఆగస్టులో …
Read More »ఔను… వారు చేయమంటేనే చేశా: రాజ్ కసిరెడ్డి!
ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ ప్రభుత్వ మద్యం దుకాణాలే కావడం.. ఎక్కడా ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటినివినియోగించకపోవడం ద్వారా భారీ ఎత్తున నగదు అక్రమాలు జరిగాయని అప్పట్లోనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిని కూటమి సర్కారు వచ్చాక దుమ్ముదులిపే ప్రయత్నం చేసింది. తాజాగా కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..ఉరఫ్ రాజ్ కసిరెడ్డిని పోలీసులు మంగళవారం సాయంత్రం వరకు …
Read More »మోడీకి బాబు గిఫ్ట్ : ఆ రాజ్యసభ సీటు బీజేపీకే
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు ప్రాజెక్టులు.. ఇతర కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఆయనకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం నుంచిఫోన్ వచ్చింది. వాస్తవానికి షెడ్యూల్లో ఈ కార్యక్రమం లేదు. అయినప్పటికీ..చంద్రబాబుకు స్వయంగా షా కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఆయన …
Read More »అమరావతిలో అన్నగారి విగ్రహం.. ఇదిగో ఇలా..!
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యం లో తెలుగు వారి ఆరాధ్య కథానాయకుడు.. పేదల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న అన్నగారు.. ఎన్టీ ఆర్ విగ్రహాన్ని దేశంలోనే అత్యంత ఎత్తయిన రీతిలో.. రికార్డు స్థాయిలో నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి కొన్ని ఫొటోలను ప్రభుత్వం విడుదల చేసింది. విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తాడేపల్లి …
Read More »జగన్ విధానాలు మార్చుకోవాల్సిందేనా…
మూడు రాజధానుల నుంచి మద్యం వరకు.. వలంటీర్ వ్యవస్థ నుంచి సచివాలయాల వరకు.. వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగాలు వికటించిన విషయం తెలిసిందే. ఇవే.. ఆయనను నిలువునా ముంచాయన్నది మేధావుల నుంచి విశ్లేషకుల వరకు చెబుతున్న మాట. తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అన్నట్టుగా ఆయన అప్పట్లో వ్యవహరించారన్న విమర్శలు తెలిసిందే. ఏరాష్ట్రంలోనూ లేని విధంగా మూడురాజధానులు తెచ్చారు. దీనిపైకేంద్రం కూడా విస్మయం వ్యక్తం చేసింది. ఇక, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates