గాజువాక, భీమవరం, తిరుపతి.. ఇలా మూడు నియోజకవర్గాలపై సంకేతాలు ఇచ్చి, చివరికి పిఠాపురం నియోజకవర్గంలో తాను పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, పిఠాపురం విషయమై జనసేనలో క్లారిటీ వున్నా, వైసీపీ శ్రేణుల్లో కొంత అయోమయం కనిపిస్తోంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వ్యూహాత్మకంగా పిఠాపురంలో మోహరించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కాకినాడ ఎంపీ వంగా గీత, పిఠాపురం అసెంబ్లీ …
Read More »సీనియర్లను పక్కన పెడుతున్న బీజేపీ
ఏపీ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. వయసుతో సంబంధం లేకుండా ఏపీలో బీజేపీ కురువృద్ధులకు వీరతాళ్లు వేయాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సీనియర్లను ముందుపెట్టి విజయం దక్కించుకునేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. టీడీపీ ఎన్డీఏలో చేరడంతో ఆరు పార్లమెంట్, 10 అసెంబ్లీ సీట్లలో పోటీకి బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఏయే సీట్లలో ఎవరు పోటీ చేయాలన్నదానిపై రాష్ట్ర స్థాయిలో కసరత్తు జరిగింది. ఈ కసరత్తులో బీజేపీకి …
Read More »వైసీపీలో చేరిన వంగవీటి రాధా తమ్ముడు.. రీజనేంటి?
ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సోదరుడు(చిన్నాన్న కుమారుడు) వంగవీటి నరేంద్ర తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి నరేంద్రను సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసేలా.. సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వరుస పెట్టి …
Read More »‘లక్ష’ చుట్టూనే తిరుగుతున్న పవన్ కల్యాణ్
ప్రతికూల పరిస్థితులు ఉన్న వేళ.. బడాయి మాటల కంటే కూడా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం చాలా ముఖ్యం. ఆ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. తనకు లక్ష మెజార్టీ రావటం ఖాయమన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. తనను ఓడించేందుకు అధికార పార్టీ వైసీపీ వారు ఒక్కో ఇంటికి రూ.లక్ష ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. …
Read More »చేసిన పాపం.. కేసీఆర్‌ను వెంటాడుతోందా!
వ్యక్తిగత జీవితంలో అయినా.. రాజకీయంగా అయినా.. చేసిన పాపం వెంటాడుతుందనే వాదన వినిపిస్తుంది. ఇప్పుడు తెలంగా ణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ విషయంలోనూ ఇదే మాట నెటిజన్ల నుంచి వినిపిస్తోంది. ఏకంగా బీఆర్ ఎస్ లెజిస్లేచర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు లోపాయికారీగా చేస్తున్న వ్యాఖ్యలు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల …
Read More »ఏపీలో అరాచక పాలన.. అందుకే బాబుకు మద్దతు: జేపీ
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీలు కలిసి వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కూటమికి, ముఖ్యంగా చంద్రబాబుకు తమ మద్దతు ప్రకటిస్తున్నామని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ(జేపీ) చెప్పారు. ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో మేం ఎన్డీయే కూటమివైపే ఉంటాం. ఏపీలో అరాచక పాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులు ఏకమవ్వాలి అని జేపీ …
Read More »భగత్ సింగ్ గ్లాసుకి రాజకీయ రంగులు
నిన్న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో సంభాషణలు రాజకీయ ఉద్దేశాలతో ఉన్నాయనే వివాదం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ తాను ఇంకా చూడలేదని, ఒకవేళ ఓటర్లను ప్రేరేపించేలా ఉంటే మాత్రం దర్శక నిర్మాతలకు నోటీసు పంపిస్తామని చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పవన్ పిఠాపురం మీటింగ్ లో కార్యకర్తలతో మాట్లాడుతూ దర్శకుడు హరీష్ శంకర్ …
Read More »పిఠాపురంపై వైసీపీ ప్రత్యేక కన్ను
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపు రం నియోజకవర్గంపై వైసీపీ కుయుక్తులు పన్నుతోందా? ఏదో ఒక విధంగా ఇక్కడ జనసేనను ఓడించా లనే లక్ష్యంతో ముందుకు సాగుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. సహజంగా రాజకీయా ల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. వీటిని ఎవరూ కాదనరు. కానీ, పనిగట్టుకుని యుక్తిగా చేసే పనులు మాత్రం చర్చకు వస్తాయి. పిఠాపురంలో …
Read More »అతి చేసిన వారి ఉద్యోగాలు ఊడుతున్నాయి
ఔను.. ఇప్పుడు ఈ మాటే రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. సీఎం జగన్‌పై అభిమానమో.. లేక వైసీపీ నేతల ప్రలోభాల కారణమో తెలియదు కానీ.. ఎన్నికల సంఘం ఆదేశాలు, కోడ్‌ను కూడా ధిక్కరిస్తూ.. వలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, రేషన్ డీలర్లు.. ఇలా దిగువస్తాయి అల్పాదాయ జీవులు వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇదే.. వీరి జీవితాలకు ఎఫెక్ట్ అయింది. ఎన్నికల సంఘం ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. ఈ …
Read More »నారా లోకేష్ కాన్వాయ్ తనిఖీ.. ఎక్కడ? ఎందుకు?
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఉదయాన్నే 7 గంటలకల్లా ఉండవల్లిలోని నివాసం నుంచి మంగళగిరిలోని నిర్ణీత ప్రాంతానికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కూడా ఆయన తన కాన్వాయ్(మూడు కార్లు)తో ఉండవల్లి నుంచి బయలు దేరి.. మంగళగిరికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే.. ఆయన కాన్వాయ్ మంగళగిరి హైవే …
Read More »కాంగ్రెస్ గూటికి పనబాక.. రీజనేంటి..!
ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తిరిగి ఆ పార్టీ గూటికి చేరుతున్నారా? రేపోమాపో ఆమె కండువా కప్పుకోవడం ఖాయమా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం పనబాక టీడీపీలో ఉన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత.. అనూహ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయింది. ఈ క్రమంలో పనబాక లక్ష్మి.. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అప్పటికే ఆమె కేంద్రంలోనూ …
Read More »జనసేన కాకినాడ ఎంపీ టికెట్ వెనుక కథ ఇదే.. !
పొలిటికల్ పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ టికెట్‌ను దక్కించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా ఈ టికెట్‌ను తంగెళ్ల ఉదయ్‌కు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇది చాలా కీలకమైన నియోజకవర్గం. పైగా బలమైన సామాజిక వర్గాలు (కాపు+ రెడ్లు) ఉన్న నియోజకవర్గం. మరి అలాంటి నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు అసలు పేరు కూడా పెద్దగా తెలియని ఉదయ్ అనే యువకుడికి ఇవ్వడం ఏంటి? అనే చర్చ సాధారణమే. అయితే.. ఉదయం …
Read More »