వైసీపీ కీలక మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డిపై రెండు రోజుల కిందట వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే..ఈ వ్యాఖ్యలు ఆయనకు మైలేజీఇవ్వకపోగా.. పార్టీలో నేతల నుంచే విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి. సాయిరెడ్డిని కెలికి తప్పు చేశారు సర్! అంటూ ఒకరిద్దరు సీనియర్ నాయకులు తాజాగా జగన్ చెవిలో వేసినట్టు తెలిసింది. తాజాగా ఇద్దరు జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు ఆయననుకలిసారు.
ప్రస్తుతం సాయిరెడ్డి సైలెంట్గా ఉన్నారని.. ఆయన వైలెంట్ గా మారితే మనకే ఇబ్బందులని కూడా.. జగన్‌కు తేల్చి చెప్పినట్టు తెలిసింది. అంతేకాదు.. మద్యం కుంభకోణంలో సాయిరెడ్డి అప్రూవర్‌గా మారే అవకాశం కూడా ఉందని తెలుస్తున్నట్టు వారు సమాచారం ఇచ్చారు. ఇదే జరిగితే.. ఇబ్బందులు పెరుగు తాయని.. చెప్పుకొచ్చారని తెలిసింది. మీరు బాగానే ఉంటారు. దీనిపై మాకు కూడా నమ్మకం ఉంది. కానీ, కేడర్ దెబ్బతింటుంది
అని గుంటూరుకు చెందిన ఓ వృద్ధ నేత జగన్‌కు చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది.
అయితే.. దీనికి జగన్ చిత్రమైన సమాధానం చెప్పారని అంటున్నారు. అన్నీ చూడాలన్నా.. ఏం జరిగినా తట్టుకునే వారే మనకు కావాలి. రేపు అధికారంలోకి వచ్చాక వారికే ప్రాధాన్యం ఉంటుంది
అని నవ్వుతూ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ పరిణామాలతో వైసీపీలో జగన్ వ్యవహారం మరోసారి రచ్చగా మారింది. ఇలానే వ్యవహరిస్తే.. పార్టీలో ఉన్న నాయకులు కూడా మరింత దూరం అవుతారని అంటున్నారు. ఇది సరైన విధానం కాదని కూడా చెబుతున్నారు.
పార్టీలో ఉన్న నాయకులకు భరోసా ఇవ్వాలంటే.. వెళ్లిపోయిన వారిని సాధ్యమైనంత వరకు విమర్శించ కుండా ఉంటేనే బెటర్ అన్న విధంగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గతంలో కేసులతో సంబంధాలుఉన్న వారి విషయంలో అయితే.. అసలు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటేనే బెటర్ అనికూడా వ్యాఖ్యానిం చినట్టు తెలిసింది. కానీ.. జగన్ వినే రకం కాదు కాబట్టి.. వారు చెప్పడం వరకు మాత్రమే పరిమితమయ్యారు.