ఇప్పటి వరకు అటు అసెంబ్లీకైనా.. ఇటు పార్లమెంటుకైనా అభ్యర్థులను ప్రకటించేందుకు.. అంతా తన ఇష్టం అన్నట్టుగానే వ్యవహరించిన తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఈ సారి అదికూడా చివరి నిముషంలో మాత్రం రూటు మార్చారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఎందుకంటే..ఇటీవల కాలంలో కీలక నాయకులు జంప్ చేశారు. దీంతో రూటు మార్చుకుని.. అందరికీ ఫోన్లు చేసి.. అందరి అభిప్రాయాలు తెలుసుకుని పార్టీ టికెట్లను ఖరారు చేయడం …
Read More »పీ-గన్నవరం, పోలవరం.. జనసేనకే!
ఏపీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకుని వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం సహా కీలకమైన ఎస్టీ నియోజకవర్గం పోలవరం కూడా జనసేన ఖాతాలోకే చేరాయి. వాస్తవానికి పీ. గన్నవరంలో తొలుత టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. తాజాగా ఈ సీటు జనసేనకు మారింది. తొలి విడత టీడీపీ జాబితాలో ఆ పార్టీ నేత మహాసేన రాజేశ్ కు(యూట్యూబర్‌గా గుర్తింపు పొంది.. రాజకీయ విశ్లేషణలు, వైసీపీపై …
Read More »రూ.500,200 నోట్ల రద్దుతోనే వైసీపీకి చెక్ : చంద్రబాబు
రాబోయే ఎన్నికల్లో వైసీపీని కట్టడి చేసేందుకు డిజిటల్ కరెన్సీ రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, పెద్దనోట్ల రద్దు మాదిరిగా రూ.200, రూ.500 నోట్లను రద్దు చేయాలని అన్నారు. రాష్ట్ర సంపదనంతా హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. తమ అక్రమాలను వైసీపీ నేతలు అంతర్జాతీయ స్థాయికి విస్తరించారని ఎద్దేవా చేశారు. జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేశారని, జగన్ వంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని చెప్పారు. జగన్ నోరు …
Read More »పులివెందుల గ్రౌండ్ రిపోర్ట్: జగన్‌కి తిరుగులేదుగానీ..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన్ని రాజకీయంగా ఢీ కొట్టే సత్తా ఎవరికైనా వుందా.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇలా వైఎస్ కుటుంబీకులే చాలాకాలంగా పులివెందుల నియోజకవర్గాన్ని ఏలుతున్నారు.! ఔను, ఏలుతున్నారనడమే కరెక్ట్.! పులివెందులలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడటమంటే చిన్న విషయం కాదు.. శాల్తీలు లేచిపోతాయ్.. అనే భావన ఒకటుంది. వైసీపీ శ్రేణులు ఇదే మాట …
Read More »ఆ ఆరు ఎందుకు ఆపారు?.. బాబు వ్యూహంపై తమ్ముళ్ల తర్జన భర్జన
ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆయా పార్టీలకు పోగా.. 144 అసెంబ్లీ స్థానాలను తన దగ్గర ఎట్టుకున్నారు. ఈ క్రమంలో తొలి విడతలోనే 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మలి విడతలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక, తాజాగా 11 మందిని ప్రకటించారు అయితే.. మొత్తం 144లో ఇప్పటి …
Read More »లోకేష్ వాల్లకి టికెట్లు ఇప్పించేసుకున్నట్టే
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వెంట నడిచిన నాయకులకు న్యాయం జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది.. నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. ఈ యా త్ర ద్వారా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఇక, ఈ యాత్రకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఇలానే అనేక మంది యాత్రకు సహకరించారు. ఆర్థిక సాయం చేయడంతోపాటు.. జనాలను తరలించ డం వరకు …
Read More »ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయట్లేదు..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌కు-పోలింగ్‌కు మధ్య భారీ గ్యాప్ వచ్చింది. దీంతో నాయ కులు ఎక్కడికక్కడ తొంగుంటున్నారు. ఇప్పుడే ప్రచారం చేస్తే జేబులు ఖాళీ అవుతాయని అనుకుంటు న్నారో.. లేక.. ఇప్పటి నుంచి అన్నిరోజులు ఎండలో తిరగలేమని బావిస్తున్నారో.. తెలియదు కానీ.. అన్ని పార్టీల నాయకులు, టికెట్లు ప్రకటించిన తర్వాత కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. అయితే.. ఈ సమ యాన్నే టీడీపీ అధినేత చంద్రబాబు సద్వినియోగం …
Read More »పవన్ వర్సెస్ గీత.. ఆస్తుల్లోనూ పోటీ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈయనపై వైసీపీ తరఫున సీనియర్ నాయకురాలు, కాకినాడ ఎంపీ వంగా గీత ఢీ అంటున్నారు. వీరిద్దరి విషయం రాజకీయంగా చర్చకు వస్తున్న తెలిసిందే. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అనేది ఒక చర్చ అయితే.. ఎవరెవరి ఆస్తులు ఎంత? అనేది కీలకంగా మారింది. ఇటీవల పవన్ మాట్లాడుతూ.. తనను …
Read More »తెలంగాణ బీజేపీ నేతకు చంద్రబాబు టికెట్!
బీజేపీతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు త్యాగాలకు సిద్ధమయ్యారా? బీజేపీ నేతలకు ఏపీలోనూ టికెట్లు ఇస్తున్నారా? అంటే. తాజాగా జరిగిన పరిణామం ఔననే అంటోంది. టీడీపీ శుక్రవారం ప్రకటించిన ఎంపీల జాబితాలో బాపట్ల(ఎస్సీ) అభ్యర్థిగా తెన్నేటి కృష్ణ ప్రసాద్ ను చంద్రబాబు ఎంపిక చేశారు. వాస్తవానికి బాపట్ల నుంచి ఉండవల్లి శ్రీదేవి(వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీకి జై కొట్టారు) పేరు ఎక్కువగా వినిపించింది. అయితే.. …
Read More »విజయం మాదే.. పిఠాపురంపై పవన్ మాస్టర్ ప్లాన్!
వచ్చే ఎన్నికల సమరంలో టీడీపీ – బీజేపీ – జనసేన కూటమిదే విజయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి చెప్పారు. ‘నేను పిఠాపురంలో పోటీ చేస్తుండడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోంది. జనసేన శ్రేణులు ప్రతీ దశలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. పిఠాపురం నుంచే ఎన్నికల శంఖం పూరిస్తున్నాం. ఎన్నికల కోడ్, ఈసీ నిబంధనలు పాటించడంపైనా జనసైనికులు పూర్తి అవగాహనతో ఉండాలి’ అని …
Read More »వసంత రాజకీయం అదరహో!
తాజాగా ప్రకటించిన టీడీపీ మూడో అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆయన ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నారు. మైలవరం సీటును ఉమాకు కరడు గట్టిన ప్రత్యిర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే.. ఈ మధ్యే వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించారు. దీంతో దేవినేని ఉమాకు సీటు లేనట్లయింది. అయితే.. వసంత కూడా టీడీపీకి …
Read More »విశాఖ డ్రగ్స్ కేసు: బీజేపీని బరిలోకి లాగేసిన వైసీపీ
విశాఖపట్నం సముద్ర తీరంలో వెలుగు చూసిన 25 వేల కిలోల డ్రగ్స్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో టీడీపీ వర్సెస్ వైసీపీల మధ్య తీవ్ర మాటల యుద్ధం సాగుతోంది. మీరంటే మీరేనని ఒకరిపై ఒకరు ఈ డ్రగ్స్ వివాదాన్ని రాజకీయంగా మార్చుకుని విమర్శలు చేసుకుంటున్నారు. అయితే.. ఇంతలోనే వైసీపీ మరో వ్యూహాత్మక విమర్శలను తెరమీదికి తెచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో బీజేపీని కూడా లాగేసింది. బీజేపీఏపీచీఫ్ …
Read More »