Political News

చాన్నాళ్ల తర్వాత తల్లి విజయమ్మను కలిసిన జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొంతకాలంగా తన తల్లి వైఎస్ విజయమ్మతో విభేదాలతో సాగుతున్న సంగతి తెలిసిందే. సరస్వతి పవర్ కంపెనీ షేర్ల బదలాయింపు వివాదంలో తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలలు ఓ వర్గంగా నిలవగా..జగన్ తన సతీమణి వైఎస్ భారతి రెడ్డితో కలిసి మరో వర్గంగా నిలిచారు. ఇరు వర్గాలు షేర్ల బదలాయింపుపై ఏకంగా కోర్టుకు ఎక్కి మరీ వాదులాడుకుంటున్నారు. ఈ క్రమంలో …

Read More »

ఈ బాల ఏఐ ఇంజినీర్ బాబునే ఇంప్రెస్ చేశాడు

పైన ఫొటోలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి కనిపిస్తున్న బుడ్డోడి పేరు నంద్యాల సిద్ధార్థ్. వయసు 14 ఏళ్లే. ఊరు అనంతపురం జిల్లా అయినా… అతడి ఫ్యామిలీ అమెరికాలోని డల్లాస్ లో స్థిరపడింది. ఈ బుడ్డోడూ అక్కడే పెరిగాడు. అక్కడే చదువుతున్నాడు. 14 ఏళ్లకే అతడు ఒకాకిల్, ఏఆర్ఎంల నుంచి ఏఐ నిష్ణాతుడిగా సర్టిఫికెట్లను పొందాడు. ప్రపంచంలోనే ఏఐపై పట్టు సాధించిన అతి పిన్న వయస్కుడు కూడా ఇతడే. …

Read More »

ఇక‌, మిథున్‌రెడ్డి వంతు..

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని న్యాయ‌స్థానాన్ని అభ్య‌ర్థించారు. త‌న‌పై అక్ర‌మంగా కేసులు పెట్టార‌ని.. త‌న పేరును ప‌త్రిక‌లు కూడా పేర్కొన్నాయ‌ని ఆయ‌న త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. త‌న‌కు ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం పెట్టిన కేసుతో ఎలాంటి సంబంధం లేద‌న్నారు. తాను పార్ల‌మెంటు స‌భ్యుడిన‌ని.. త‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ విధానాప‌ర‌మైన నిర్ణ‌యాల‌తో సంబంధం …

Read More »

హమ్మయ్యా.. ఎట్టకేలకు గుమ్మడి కల నెరవేరిందిగా!

గుమ్మడి నర్సయ్య.. వామపక్ష పార్టీగా అంతగా గుర్తింపే లేని సీపీఐ న్యూ డెమొక్రసీ పార్టీ నుంచి ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నేత. కమ్యూనిస్టులకు మంచి పట్టున్న ఇల్లెందు నియోజకవర్గం నుంచి వరుసగా ఎన్నికల్లో గెలిచిన నర్సయ్య తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే ఆ తర్వాత ఆయనతో పాటు ఆయన పార్టీ కూడా ఆధునిక రాజకీయాల్లో మరింతగా రాణించలేకపోయాయి. ఏదో …

Read More »

అసలు నాగ్‌పూర్‌లో ఏం జరుగుతోంది?

ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంబాజి మహరాజ్ సీన్స్ చాలామందిని కదిలించాయి. ముఖ్యంగా ఔరంగజేబు క్యారెక్టర్ శంబాజిని అతి క్రూరంగా చంపేసిన విధానం గురించి మరోసారి చర్చించుకోవడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో నాగ్‌పూర్ నగరం తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధి వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మొదట విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఔరంగజేబు సమాధిని తొలగించాలని నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ …

Read More »

ఖలిస్తానీ గ్రూప్‌పై రాజ్‌నాథ్ గురి.. అమెరికా ఎలా స్పందిస్తుందో?

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికాను కోరడం గమనార్హం. ఇటీవల ఢిల్లీలో అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తుల్సి గబ్బార్డ్‌తో జరిగిన సమావేశంలో, SFJ సంస్థ భారత్‌కు వ్యతిరేకంగా అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆయన ప్రస్తావించారు. భారత భద్రతకు భంగం కలిగించే విధంగా ఈ సంస్థ ప్రచారం చేస్తోందని, అలాగే SFJ నాయకుడు …

Read More »

పిక్ ఆఫ్ ద డే.. జానారెడ్డితో కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు సభల్లోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో ఓ మోస్తరుగా సమావేశాలు జరుగుతుండగా… తెలంగాణ సమావేశాలు మాత్రం రసవత్తరంగా సాగుతున్నాయి. అదికార కాంగ్రెస్ తో…ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఢీ అంటే డీ అన్నట్లుగా సాగుతోంది. సీఎం రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ నేతలు అన్నట్టుగా సభ సాగుతోంది. ఇలాంటి సమయంలో సోమవారం రెండు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ …

Read More »

వింతైన వినతితో అడ్డంగా బుక్కైన టీడీపీ ఎంపీ

అసలే జనం… పిచ్చ క్లారిటీతో ఉన్నారు. వారికి గూగుల్ తల్లి రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటోంది. ఇట్టా అనుమానం వస్తే… అట్టా గూగుల్ ను ఓపెన్ చేసి రీ వెరిఫికేషన్ చేసేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఆ జనానికి ప్రతినిధులుగా ఉన్న మన నేతలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఒళ్లంతా కళ్లు చేసుకుని మరీ వేసే ప్రతి అడుగు ఒకటికి పది సార్లు ఆలోచించి.. మరీ అడుగు వేయాల్సి ఉంది. …

Read More »

బాబుతో పవన్ భేటీ!… ఈ సారి అజెండా ఏమిటో?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సోమవారం సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగగా… దానికి హాజరైన పవన్… కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత… చంద్రబాబుతో విడిగా భేటీ అయ్యారు. వీరిద్దరు మాత్రమే ప్రత్యేకంగా భేటీ అయిన తీరుపై పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి …

Read More »

వైఎస్సార్ పేరు పాయే.. ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం!

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలో కొన‌సాగుతున్న కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం సాయంత్రం భేటీ అయిన మంత్రి వ‌ర్గం.. ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. వీటిలో గ‌త వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న కీల‌క నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేసింది. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని తాడిగ‌డప మునిసిపాలిటీకి.. జ‌గ‌న్ స‌ర్కారు “వైఎస్సార్ తాడిగ‌డ‌ప మునిసిపాలిటీ”గా పేరు పెట్టింది. అయితే.. దీనిపై ప్ర‌జ‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశార‌ని.. స్థానికంగా …

Read More »

కోటంరెడ్డిది ‘మురుగు’ నిరసన…మర్రిది ‘చెత్త’ నిరసన

రాజకీయాల్లో కొందరు నేతల తీరు విభిన్నంగా ఉంటుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారు ఎంతదాకా అయినా వెళతారు. ఈ తరహా నేతలు ఇటీవలి కాలంలో చాలా తక్కువగానే ఉన్నా… ఆ తక్కువ సంఖ్యలో ఉన్న నేతల తీరు అందరినీ ఆకట్టుకుంటోందని చెప్పక తప్పదు. అప్పుడెప్పుడో తన నియోజకవర్గ ప్రజలు మురుగు నీటిలో నడవకుండా ఏర్పాట్లు చేయరా అంటూ…ఏపీలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నడుముల లోతు …

Read More »

రేవంత్ రెడ్డి ‘తెలంగాణ’ను గెలిచారు!

నిజమే… తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి యావత్తు రాష్ట్రాన్ని గెలిచారు. అదేంటీ… 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే… ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ సీఎం సీటుపై కూర్చున్నారు కదా. ఇప్పుడు తెలంగాణను ఆయన గెలవడం ఏమిటి అంటారా? సోమవారం నాటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కాస్తంత లోతుగా పరిశీలిస్తే… నిజంగానే రేవంత్ రెడ్డి తెలంగాణను గెలిచారు అని …

Read More »