వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి.. సమయం చూసుకుంటున్నారా? సరిగ్గా సమయం చూసుకుని జగన్ పై విరుచుకుపడనున్నారా? అంటే.. పొలిటికల్ సర్కిళ్లలో ఇదే చర్చ సాగుతోంది. జగన్ కు ఇప్పటికే ఆయన సోదరి బద్ధ శత్రువుగా మారారు. ఆమె కూడా సమయం చూసుకుని అన్నపై చెలరేగుతున్నారు. ఏ చిన్న పాటిటివిటీ వచ్చే అవకాశం ఉందని తెలిసినా.. వెంటనే షర్మిల ఎంట్రీ ఇస్తున్నారు. అన్నని కూడా చూడకుండా ఏకేస్తున్నారు.
తాజాగా కూడా జగన్ పై సానుభూతి పెరిగే సంకేతాలు వస్తున్నాయని మీడియాలో ప్రచారం జరగడంతో ఎప్పుడో జగన్ పోలీసులపై విరుచుకుపడిన సంగతులను ఏకరువు పెట్టి షర్మిల ఓ రేంజ్‌లో ఏకేశారు. ఇదీ .. ఇప్పుడు జగన్ పరిస్థితి. ఇక, సాయిరెడ్డి విషయాన్ని కూడా జగన్ తరచుగా కెలుకుతున్నారు. ఆయనను కూడా తూర్పారబడుతున్నారు. అమ్ముడు పోయారన్న పెద్ద మాటే అనేశారు. రాజ్యసభ సీటును చంద్రబాబుకు అమ్మేశారని చెప్పుకొచ్చారు.
మరి ఇంత మాట అన్నాక కూడా సాయిరెడ్డి ఒక్క మాట కూడా అనలేదు. అంతేకాదు.. తన పేరుతో మీడియాలో ప్రచారంలోకి వచ్చిన ఓ మెసేజ్‌ను కూడా ఆయన ఖండించారు. ఇది నాది కాదు! అని తేల్చి చెప్పారు. అలాగని జగన్ అనేస్తే.. సాయిరెడ్డి పడతారా? అంటే.. అసలు పడరు. కానీ, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటే.. సమయం కోసం! అదే ఖచ్చితమైన సమయం చూసుకుని ఆయన కూడా చెలరేగే అవకాశం ఉందని పరిశీలకులే కాదు.. పొలిటికల్ సర్కిళ్లలోనూ వినిపిస్తున్న మాట.
నిజానికి చెప్పాలంటే.. వైసీపీ అంతర్గత సంగతులే కాదు.. జగన్ అంతర్గత విషయాలు కూడా.. సాయిరెడ్డికి బాగా తెలుసు. సో.. ఆయన నోరు విప్పితే.. లేదా.. సీబీఐ, ఈడీ కేసుల్లో అప్రూవర్‌గా మారితే.. అది నిజంగా జగన్‌కు భారీ షాకిచ్చే పరిణామంగా మారుతుంది. బహుశ ఆ సమయం కోసమే సాయిరెడ్డి ఎదురు చూస్తన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇంత జరిగినా.. జగన్ తనను అమ్ముడు పోయారని అన్నా.. మౌనంగా ఉన్నారని పరిశీకులు, విశ్లేషకులు, మేధావులు సైతం అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.