తెలంగాణ రాజకీయాలను పెను కుదుపులకు గురిచేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కీలక దశకు చేరుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ప్రతిపక్షాల ఫోన్లను ట్యాప్ చేసి.. వారిని కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక.. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలువురు అధికారులను అరెస్టు చేసింది. అప్పట్లో ఆఫీసునే ట్యాపింగ్ కేంద్రంగా మార్చుకున్న తీరు.. అనుసరించిన విధానాలు తీవ్ర సంచలనం …
Read More »అక్కడ వేటేయరు!… ఇక్కడ రాజీనామాలు ఆమోదించరు!
చట్టసభల్లో ప్రజా ప్రతినిధుల వ్యవహార తీరుకు సంబంధించి చట్టాల్లోని నియమ నిబంధనలు పెద్దగా పనిచేయడం లేదు. చట్టాలను పక్కనపెట్టేస్తున్న కొందరు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయపార్టీల భావాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ విమర్శల పాలు అవుతున్నారు. అలాంటి వారిలో సభాధ్యక్ష స్థానాల్లో ఉన్న నేతలు కూడా ఉంటుండటంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఇలాంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరస్పర విరుద్దంగా ఉంటోంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో ఆయా …
Read More »‘డ్రైవర్’ సీట్లో మంత్రి నారా లోకేశ్!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం బస్సు డ్రైవర్ గా అవతారం ఎత్తారు. భారత పారిశ్రామిక దిగ్గజం హిందూజా గ్రూప్ నకు చెందిన అశోక్ లేల్యాండ్ బస్సు ఎక్కిన ఆయన వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. అంతేనా ఏకంగా స్టీరింగ్ కూడా పట్టేశారు. గేర్ రాడ్ పైనా చేయేశారు. ఇగ్నిషన్ ఒక్కటే తిప్పలేదు. అది కూడా జరిగి ఉంటే.. నిజంగానే మనం …
Read More »అప్పులు తప్పవా రేవంత్ సర్!
రాష్ట్రాన్ని గత పదేళ్లు పాలించి కేసీఆర్.. అప్పులపాలు చేశారని పదే పదే విమర్శించే సీఎం రేవంత్ రెడ్డి సైతం తన పాలనలో అప్పులు చేయక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్లోనే స్పష్టం చేయడం గమనార్హం. తాజా బడ్జట్లో ఏకంగా 66 వేల కోట్లకు పైగానే అప్పులు చేయాల్సి వుంటుందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. అయితే.. ఇది …
Read More »తలా కొంచెం.. తెలంగాణ బడ్జెట్ తీరిదే!
నొప్పింపక.. తానొవ్వక.. అన్నట్టుగా.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను తీర్చి దిద్దింది. డాంబికాలకు పోకుండా.. అలాగని ఎవరినీ విస్మరించకుండా.. అన్ని వర్గాలను అంతో ఇంతో సంతృప్తి పరిచేలాగానే.. వార్షిక బడ్జెట్ను రూపొందించడం గమనార్హం. అయితే.. కీలకమైన వ్యవసాయ, విద్య, ఉపాధికల్పన రంగాలకు మాత్రం.. ఈ బడ్జెట్ విదిలింపేనని చెప్పాల్సి ఉంటుంది. బలమైన సాగు రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని.. రెండు రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి సభాముఖంగా చెప్పుకొచ్చారు. …
Read More »బిల్ గేట్స్ తో బాబు భేటీ…చర్చలు ఫలించాయన్న సీఎం
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర పెద్దలను కలిసేందుకు మంగళవారం రాత్రికే ఢిల్లీ చేరిన చంద్రబాబు… బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బిల్ గేట్స్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బాబుతో పాటుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు …
Read More »జగన్ మారిపోయినట్టేనా
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు. 2019 ఎన్నికలకు ముందు నిత్యం జనంలోనే ఉండిపోయిన ఆయన… 2019 ఎన్నికల్లో అధికారం చేతికి అందడంతోనే జనానికి దూరమైపోయారు. ఫలితంగా ఐధేళ్లు తిరక్కుండానే… జగన్ అధికారం నుంచి దిగిపోయారు.151 సీట్లున్న వైసీపీ కేవలం 11 సీట్లకు పడిపోయిందంటే.. జగన్ పరాజయం ఏ రేంజిలో ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. రాజకీయాలన్నాక …
Read More »జగన్కు భారీ షాక్: వైసీపీకి మర్రి రాజీనామా..!
వైసీపీ అధినేత జగన్కు తాజాగా భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ గా ఉన్నారు. అయితే.. గత కొన్నాళ్లుగా మర్రి పార్టీ మారుతున్నారన్న చర్చ ఉన్నప్పటికీ.. ఆయన స్పం దించలేదు. తాజాగా ఉరుములు లేని పిడుగులా.. మర్రి తన రాజీనామాకు పార్టీ కార్యాలయానికి పంపించా రు. బలమైన …
Read More »జనవరిలో మాట.. మార్చిలో అచరణ
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మద్య స్నేహబంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో చంద్రబాబు తొలిసారి సీఎం అయిన రోజుల్లోనే వారిద్దరి మధ్య అనుబంధం మొదలైంది. ఆ బంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. వీరి మధ్య స్నేహ సంబంధాలు ఎంత బలీయమైనదంటే… చంద్రబాబు అలా నోరు తెరిచి అడిగినంతనే బిల్ గేట్స్ రంగంలోకి దిగిపోయేంత అని చెప్పాలి. జనవరిలో దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ …
Read More »జనసేన వైపు బొత్స మనసు లాగుతోందా..?
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే… వైసీపీలో ఆయన చాలా కష్టంగానే కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది.151 ఎమ్మెల్యే సీట్లున్న సమయంలో జగన్ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగిన బొత్స…పార్టీ 11 సీట్లకు పడిపోవడం, మొన్నటి ఎన్నికల్లో తానే ఓడిపోవడం.. ఆపై ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఆయనకు జగన్ అవకాశం ఇవ్వడం… ఆ …
Read More »వైరల్ వీడియో… పోసానితో సీఐడీ పోలీసుల ఫొటోలు
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ వైరి వర్గాలకు చెందిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అసభ్యపదజాలంతో దూషించారన్న కేసుల్లో అరెస్టైన పోసాని ప్రస్తుతం గుంటూరు జైలులో రిమాండ్ …
Read More »పెట్టుబడుల్లో ‘పార్టీ’ల గోల.. బాబు ఏమన్నారు
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయంటే… కూటమి సర్కారు పెట్టుబడులకు ఏ మేర ప్రాధాన్యం ఇస్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. సోమవారం నాటి కేబినెట్ భేటీలోనూ పెట్టుబడులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సోలార్ ప్లేట్ల తయారీ కోసం ఏపీలో భారీ పెట్టుబడులు పెడుతున్న శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates