వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-2(అక్యూజ్డ్-2)గా ఉన్న సునీల్ యాదవ్ సైతం.. అప్రూవర్‌గా మారేందుకు రెడీ అయ్యారు. “వివేకానందరెడ్డి హత్యకు చాలానే కుట్ర జరిగింది. ఈ కుట్ర వెనుక ఏముంది? ఎవరున్నారు? అసలు ఈ ప్లాన్ ఎవరిది అనేది చెప్పేస్తా“ అని తాజాగా మీడియాకు చెప్పారు. గురువారం ఉదయం …
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు: కోర్టు సంచలన తీర్పు!
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావుకు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన ఎఫ్ ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఫోన్‌ట్యాపింగ్ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్.. హరీష్ రావుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు హరీష్‌రావును ఏ1గా పేర్కొంటూ గతంలో కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసును కొట్టి వేయాలని.. రాజకీయ కక్ష సాధింపుల క్రమంలోనే తనపై కేసు నమోదైందని పేర్కొన్నారు. …
Read More »గోరంట్ల సహా ముగ్గురికి గాయాలు… ఏం జరిగింది?
ఏపీలో శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యులకు ప్రస్తుతం క్రీడా పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో హోదాలు, వయసును పక్కనపెట్టేసిన ప్రజా ప్రతినిధులు చిన్న పిల్లల మాదిరి కేరింతలు కొడుతున్నారు. ఉత్సాహంగా క్రీడల్లో పాలుపంచుకుంటున్నారు. తమలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను బయటకు తీస్తున్నారు. అయితే క్రీడలకు ఎంతైనా ఫిట్ నెస్ అవసరం కదా. అంతేకాకుండా ఒకింత గ్యాప్ వచ్చిందంటే… తిరిగి పుంజుకోవడానికి కాస్తంత సమయం కూడా పడుతుంది. …
Read More »అసెంబ్లీలో దొంగ సంతకాలు పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు
ఏపీ రాజకీయాలంటేనే ఇటీవలి కాలంలో ఎక్కడ లేనంత మేర చర్చకు తెర లేపుతోంది. రోజుకో వింత పరిణామం, వినూత్న ఘటనలతో రసవత్తర రాజకీయానికి నిలయంగా మారిన ఏపీలో… ఇప్పుడు ఆ రాష్ట్ర చట్ట సభలు, అందులో సాగుతున్న శాసన వ్యవహారాలపైనా అమితాసక్తి కనిపిస్తోంది. అందులో భాగంగానే గురువారం ఓ వింత ఘటన ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకుంది. సభకు రాకుండానే… అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ సభ్యులు దొంగతనంగా రిజిష్టర్లలో …
Read More »`బెట్టింగ్ ప్రమోషన్’… ప్రముఖ సినీ నటులపై కేసులు
`బెట్టింగ్ యాప్` వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ యాప్‌ల కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పెట్టుబడులు పెట్టి.. మోసపోతున్న విషయం తెలిసిందే. దీంతో వారు ఆర్థిక కష్టాలు తాళలే క.. రుణ గ్రహీతల నుంచి వస్తున్న వత్తిళ్లు తట్టుకోలేక.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు బెట్టింగ్ యాప్‌లపై ఉక్కుపాదం మోపే …
Read More »బాబుతో భేటీ అద్భుతం: బిల్ గేట్స్
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. దాదాపుగా 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ గురించి బుధవారం ఆ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు స్పందించారు. బిల్ గేట్స్ తో తాను సమావేశం అయ్యానని.. ఏపీ ప్రగతిలో కీలకం కానున్న ఈ బేటీ …
Read More »UKలో చిరుకు అవార్డు : పవన్ పట్టరాని ఆనందం
పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత భారతదేశ పురస్కారాలు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి సిగలో మరో కలికితురాయి తోడయ్యింది. యుకె పార్లమెంట్ హౌస్ అఫ్ కామన్స్ లో ఆయనకు లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డు అందజేశారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల హాజరులో అక్కడి అధికార లేబర్ పార్టీ ఎంపి నయెందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన నట ప్రస్థానంలో చిరంజీవి చేసిన …
Read More »పవన్ మార్కు… అదికారంలో ఉన్నా మార్పు లేదు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహార సరళి ఇతరులకు భిన్నంగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకున్నారంటే… పవన్ దానిపై ఏమంత పెద్దగా ఆలోచన చేయరు. అనుకున్న వెంటనే దానిని చేసేయడమే ఆయనకు తెలుసు. కౌలు రైతులకు ఆర్థిక సాయమైనా… అగ్ని ప్రమాదంలో సర్వ కోల్పోయిన జాలరులను ఆదుకోవడంలో అయినా… పవన్ ఇలా అనుకుని అలా రంగంలోకి దిగిపోయారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా పవన్ …
Read More »బాబు – జగన్ మధ్య తేడా ఇదే : ఏపీ ప్రభుత్వానికి కొత్త సలహాదారులు
ఏపీలో వైసీపీ గత పాలనకకు, కూటమి ప్రస్తుత పాలనకు స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోంది. అది కూడా ఈ 9 నెలల కూటమి పాలనలోనే సదరు విభజన రేఖ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రత్యేకించి ప్రభుత్వ పాలనలో సలహాలు, సూచనలు ఇచ్చే కీలకమైన ప్రభుత్వ సలహాదారుల నియామకంలో ఈ విషయం మరింత విస్పష్టంగా కనిపిస్తోందని చెప్పక తప్పదు. గతంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వారే అర్హులుగా కనిపించగా… ప్రభుత్వ సలహాదారులంతా …
Read More »పాత పథకాలు.. భలే జోష్.. !
పాత చంద్రబాబును చూస్తారు.. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు – అంటూ.. సీఎం చంద్రబాబు తరచుగా వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు.. పెద్దగా ప్రజల నుంచి స్పందనరాలేదు. కానీ… తాజాగా పాత పథకాలను తీసుకువస్తున్నట్టు ప్రభుత్వం సంకేతా లు ఇచ్చింది. గతంలో 1995, 2014లో చంద్రబాబు పాలనా కాలంలో అమలు చేసిన కొన్ని పథకాలు ప్రజల ఆదరణ పొందాయి. వీటిని తర్వాత ప్రభుత్వాలు నిలిపివేశాయి. …
Read More »హైడ్రా పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్య
హైడ్రా పేరు వింటేనే తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు కీలక నగరాల జనం హడలిపోతున్నారు. ఈ ఆందోళనలు కూడా కేవలం పేదలు, మధ్యతరగతి ప్రజల నుంచి మాత్రమే వినిపిస్తున్నాయి. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ సాగుతున్న సంపన్నులకు హైడ్రాలోనూ మినహాయిపులు దక్కిపోతున్నాయి. మొత్తంగా పేదలు, మధ్య తరగతిని మాత్రమే టార్గెట్ గా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతున్న హైద్రా… ధనవంతుల జోలికే వెళ్లడం లేదు. ఈ మాటలన్నది కాంగ్రెస్ …
Read More »గేట్స్ అగ్రిమెంట్స్: ఏపీకి ఓ హిస్టరీ!
ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలానే.. ఇక నుంచి మార్చి 19వ తేదీని ఏపీ ప్రజలు, ప్రభు త్వాలు కూడా మరిచిపోలేని విధంగా సీఎం చంద్రబాబు మార్చనున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో చేయలేని పనిని ఆయన బుధవారం సాధించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చంద్రబాబు ఏపీకి సంబంధించిన పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇవి సాదా సీదా ఒప్పందాలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates