ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. గతంలో ఫ్యాక్షన్ కక్షలతో నిత్యం దాడులు, హత్యలతో ఆ నియోజకవర్గ పరిధిల రక్తమోడింది. అయితే గత కొంతకాలంగా అక్కడ అసలు ఫ్యాక్షన్ అనే పదమే వినిపించడం లేదు. నాడు టీడీపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం జరిగితే.. ఇప్పుడు టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయం నడుస్తోంది. నాడు టీడీపీని కాంగ్రెస్ పార్టీ ఓడించిందే లేదు. అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ …
Read More »మిధున్ రెడ్డికి షాక్… బెయిల్ ఇవ్వలేమన్న హైకోర్టు
వైసీపీ కీలక నేత, లోక్ సభలో ఆ పార్టీ పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి గురువారం భారీ షాక్ తగిలింది. మద్యం కుంభకోణంలో తనను సీఐడీ పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఇప్పటికే ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణను ముగించగా… తాజాగా గురువారం ఈ వ్యవహారంపై …
Read More »అమరావతీ ఊపిరి పీల్చుకో.. డబ్బులొచ్చేశాయి
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని పురిట్లోనే చిదిమేయాలని వైసీపీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయని యత్నమంటూ లేదు. నాడు టీడీపీ సర్కారు ఎంపిక చేసిన అమరావతి తనకూ సమ్మతమేనని నమ్మ బలికిన జగన్… ఆ తర్వాత అమరావతికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపితే… నిలుస్తుందో, లేదో తెలియని అమరావతికి నిధులెలా ఇస్తారంటూ ఆ సంస్థకు ఫిర్యాదులు చేశారు. ప్రపంచ బ్యాంకు …
Read More »రోజా అరెస్టు పక్కా.. ఎవ్వరూ ఆపలేరట
వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్ని నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజాకు సంబంధించి ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా అరెస్టు తధ్యమని చెప్పిన ఆయన… ఏ క్షణంలో అయినా ఆమె అరెస్టు కావొచ్చంటూ ఆయన జోస్యం చెప్పారు. ఆడుదాం ఆంధ్రా పేరిట జరిగిన క్రీడా పోటీల్లో రోజా భారీ ఎత్తున అవినీతికి …
Read More »విశాఖ టార్గెట్గా నారా లోకేష్ పావులు…!
ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖ జిల్లాపై మంత్రి నారా లోకేష్ పట్టు పెంచుతున్నారు. తరచుగా విశాఖ పట్నంలో పర్యటించడంతోపాటు.. జిల్లా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. అదేసమయం లో ప్రజలకు కూడా చేరువగా ఉంటున్నారు. అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లో 11 సార్లు నారా లోకేష్ విశాఖలో పర్యటించడం గమనార్హం. ప్రతిసారీ ఆయన ప్రజలకు చేరువ అవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. తాజాగా నారా లోకేష్ ఆదివారం నుంచే విశాఖలో పర్యటిస్తున్నారు. …
Read More »కేటీఆర్ వ్యాఖ్యలు ‘రియల్’పై పిడుగుపాటేనా..?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న ఈ భూములను తాము అధికారంలోకి వస్తే… తిరిగి వర్సిటీకి అప్పగిస్తామని చెప్పిన కేటీఆర్… ఆ భూములను ఎవరూ కొనుగోలు చేయవద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ వ్యక్తులు ఈ భూములను కొనుగోలు చేసినా.. వాటిని వెనక్కు తీసుకుంటామని, …
Read More »మే వరకు ఆగుదాం.. జగన్ డెడ్లైన్!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రతువుకు డెడ్లైన్ పెట్టారు. ఇప్పటికి రెండు సార్లు ఇలా వాయిదా వేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి జనవరి నుంచే ప్రజల మధ్యకు తాను వస్తానని.. చెప్పిన జగన్ తర్వాత ఫిబ్రవరి వరకు పొడిగించారు. దీంతో ఫిబ్రవరిలో అయినా.. తమ నాయకుడు ప్రజల మధ్యకు వస్తాడని.. తమను పట్టించుకుంటారని ప్రజల కంటే ఎక్కువగా పార్టీ కార్యకర్తలు ఎదురు చూశారు. కానీ, …
Read More »సుప్రీం చేరిన ‘సెంట్రల్’ పంచాయితీ.. కీలక ఆదేశాలు జారీ
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా… హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపైనే చర్చ నడుస్తోంది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూములు తమవేనని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు వాదిస్తోంది. అంతేకాకుండా ఆ భూములను పారిశ్రామిక అవసరాల కోసం వాడుకుంటామంటూ ఏకంగా ఆ భూముల చదునుకు శ్రీకారం చుట్టింది. అయితే ఈ భూములు వర్సిటీకి చెందినవేనని విద్యార్థులు, కొన్ని ప్రజా సంఘాలతో పాటుగా విపక్షాలు వాదిస్తున్నాయి. చిక్కటి అడవితో అరుదైన జంతుజాలంతో పర్యావరణానికి …
Read More »వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఓకే!
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు దిగువ సభ లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం లోక్ సభలో ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టగా.. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ చేపట్టారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓకే చెప్పగా… బిల్లుకు వ్యతిరేకంగా 232 మంది ఓటేశారు. దీంతో వక్ఫ్ …
Read More »పవన్ ఒక్క మాటతో ఆ ఊళ్ల దశ మారుతోంది!
నిజమే… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే… ఆ గ్రామాల పూర్తి స్వరూప స్వభావాలే సమూలంగా మారిపోతాయని చెప్పక తప్పదు. పవన్ సొంతూరు మొగల్తూరుతో పాటుగా దానికి సమీపంలోని పెనుగొండల్లో ఇప్పుడు అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. రెండు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు కోట్ల కొలది నిధులు మంజూరయ్యాయి. తాజాగా ఈ రెండు గ్రామాలను …
Read More »లాయర్ అవతారంలో అంబటి.. కథ పెద్దదే
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం ఓ కొత్త అవతారంలో కనిపించారు. ఫక్తు రాజకీయ నేతగా కనిపించిన అంబటి… బుధవారం మాత్రం న్యాయవాదిగా కనిపించారు. ఎంచక్కా న్యాయవాదులు వేసుకునే డ్రెస్ కోడ్ లోకి మారిపోయిన అంబటి.. హైకోర్టులో తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తానే వాదించుకునేందుకు రంగంలోకి దిగారు. కోర్టు అనుమతితోనే న్యాయవాది రూపంలో వచ్చిన అంబటి…తన పిటిషన్ విచారణ వాయిదా పడటంతో …
Read More »తెలంగాణ గ్రూప్-1 పరీక్షల్లో భారీ స్కాం?
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన పది నిమిషాలకే పేపర్లు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో రేవంత్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో భారీ స్కాం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. గ్రూప్-1 టాపర్లంతా ఒకే గదిలో పరీక్ష …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates