అవును.. ఇది అర్ధం చేసుకోవాల్సిన సమయం..!- ఒక్క జనసేన మాత్రమే కాదు.. టీడీపీ నేతలే కాదు.. రాష్ట్ర ప్రజలు కూడా! ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి. ఈ రెండింటి మధ్యే ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఒక్కడిని చేసి జగన్‌పై ఇంత మంది యుద్ధం ప్రకటించారంటూ.. వైసీపీ నుంచి సహజంగానే సెంటిమెంటుతో కూడిన కామెంట్లు వస్తున్నాయి. ఇక, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఒంటరిగా రాలేకపోతున్నారంటూ విమర్శలూ కామన్‌గానే వినిపిస్తున్నాయి. …
Read More »15 మంది జనసేన అభ్యర్థులు ఖరారు
పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తానని భావించిన 24 స్థానాలకు 21 స్థానాలకు కుదించుకోవటం తెలిసిందే. ఇందులో అధికారికంగా ఆరు స్థానాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించటం తెలిసిందే. బుధవారం రాత్రి వేళలో మరో తొమ్మిది మంది అభ్యర్థులకు పచ్చజెండా ఊపుతూ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులను వ్యక్తిగతంగా పిలిపించుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. అభ్యర్థులుగా ఖరారు చేసిన వారితో ప్రత్యేకంగా మాట్లాడి.. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న విషయాన్ని చెప్పి …
Read More »జేజమ్మకు జై!.. బీజేపీ తాజా లిస్ట్‌లో చోటు!
గద్వాల్ జేజమ్మగా పేరొందిన మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకురాలు డీకే అరుణకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆమెను మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఎంపిక చేసింది. ఆమె ఇక్కడ నుంచి పోటీ చేయనున్నారు. ఇక, ఈమెతోపాటు మరో ఆరుగురికి కూడా కమల నాథులు టికెట్లు కేటాయించారు. వీరిలో మెదక్ స్థానానికి ఎం. రఘునందన్ రావు, ఎస్టీ నియోజకవర్గమైన ఆదిలాబాద్ నుంచి గోదామ్ నాగేశ్, …
Read More »ఈ ముగ్గురిలో ఎవరికి వస్తాదో
మూడు పార్టీల కూటమి మధ్య కొన్ని సీట్లలో పంచాయితీలు పెరిగిపోతున్నాయి. సీట్ల సర్దుబాటులో ఏ పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలో డిసైడ్ అయ్యింది. అలాగే మూడు పార్టీలు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కూడా చాలావరకు నిర్ణయమైపోయాయి. కొన్ని నియోజకవర్గాల విషయంలో మూడు పార్టీల మధ్య పంచాయితి నడుస్తోంది. ఆ జాబితా అధినేతల దగ్గరే ఉన్న కారణంగా పార్టీ నేతలకు చేరలేదు. అయితే లీకుల రూపంలో సీట్ల వివరాలు బయటకు …
Read More »విడివాడ, పద్మనాభం.. YCPకి ప్లస్ అవుతారా?
కాపులను ఏకం చేయడం.. వారి ఓటు బ్యాంకు బద్నాం కాకుండా తనకు అనుకూలంగా మార్చు కోవడం వంటి కీలక వ్యూహాల దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. అయితే.. ఇంతలోనే కాపు ఉద్యమ నాయకుడు.. కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల 14న వైసీపీలో చేరనున్న విషయం తెలిసిందే. ఎలాంటి షరతులు లేకుండా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తూర్పు గోదావరి జిల్లా …
Read More »10 వేల కోట్లు ఇచ్చాం , 12 స్థానాలు గెలిపించండి
పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో 12 చోట్ల బీజేపీ గెలిచి తీరాలని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా టార్గెట్ నిర్దేశించారు. మీరు వెళ్లండి. ఇంటింటికీ తలుపు తట్టండి. ప్రజలను కలవండి. ఇంకేమైనా చేయండి. 12 స్థానాలు మనకు వచ్చేలా చేయండి – అని అమిత్‌షా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికీ బీజేపీని తీసుకెళ్లాలని సూచించారు. దేశంలో …
Read More »ఈసారి ‘తూర్పు’ అంత ఈజీ కాదు జగన్
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రయత్నిస్తుండగా.. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ మరోసారి ప్రయత్నం చేస్తోంది. అయితే.. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. తూర్పు గోదావరి వంటి కీలకమైన జిల్లా మద్దతు అవసరం. ఈ జిల్లాలోని రాజకీయాలు, నేతలు, అసెంబ్లీ స్థానాలు అధికారంలోకి వచ్చే పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో …
Read More »స్మిత సభర్వాల్ ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు
వివాదాలకు కేంద్రంగా మారిన మహిళా ఐఏఎస్ స్మితా సభర్వాల్.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నార ని అంటున్నారు రాజకీయ నాయకులు. గిరిజన శాఖ మంత్రి సీతక్క ముందు ఓ ఐఏఎస్ అధికారిగా కాలిపై కాలేసుకుని కూర్చున్న వ్యవహారం రాజకీయంగా వివాదానికి దారితీసింది. వాస్తవానికి మంత్రుల ముందు అధికారులు కూర్చుకునేందుకు కొన్ని ప్రొటోకాల్ నిబంధనలు ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా పాటించా లి. ఒక్క మంత్రి ముందు మాత్రమే కాదు.. తన ఉన్నతాధికారి …
Read More »24 నుంచి 21…. 3 నుంచి 2…ఏ కోణంలో చూడాలి !
జనసేన సీట్లు తగ్గడం వైసీపీని బాధించిందా? చిత్రంగా అనిపించినా.. ఇది నిజమే. ఎందుకంటే, తనను తాను తగ్గించుకున్నంత మాత్రాన పోయేదేమీ లేదు. పైగా ప్రజల్లోనూ సింపతీ వస్తుంది. ఈ వ్యూహానికి ప్రధాన ప్రాతిపదిక.. బీజేపీని స్వయంగా పవనే ఆహ్వా నించడం. ఈ కారణంగానే ఆయన తనను తాను తగ్గించుకున్నారు. మొదట్లో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు దక్కాయి. అయితే.. అనూహ్యంగా ఆ పార్టీ 21కి ఇప్పుడు తగ్గించుకోవాల్సి వచ్చింది …
Read More »రెండో జాబితా రెడీ అయ్యిందా ?
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా రెడీ అయినట్లు సమాచారం. రెండో జాబితాను ప్రకటించేందుకు చంద్రబాబునాయుడు కసరత్తు దాదాపు పూర్తయిపోయిందట. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే గురువారం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి రెండో జాబితాను ప్రకటించే అవకాశముందని అంటున్నారు. పవన్ కూడా జనసేన తరపున పోటీచేయబోయే ఎనిమిది మంది అభ్యర్ధులను ప్రకటించే అవకాశముందని జనసేన …
Read More »పోటీ చేస్తారా? టికెట్ ఇస్తాం.. ఫోన్లకు మెసేజ్‌లు!
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే వైసీపీ ఒంటరి పోరుకు సై అంది. ఇక, బీజేపీ, టీడీపీ. జనసేన కలిసి ఒకే యూనిట్‌గా పోటీకి దిగుతున్నాయి. ఇక, కమ్యూనిస్టులు-కాంగ్రెస్ పార్టీ కలిసి ముందుకు సాగు తున్నాయి. ఇవి ప్రధాన పార్టీలుగా బరిలో ఉన్నాయి. అయితే.. ఇవి కాకుండా.. మరో నాలుగు కీలక పార్టీలు బరిలో ఉన్నాయి. వీటికి ఏ ఇతర పార్టీలతోనూ పొత్తులు లేవు. అవే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ …
Read More »ఏపి కోసం పెద్ద స్కెట్చ్ వేశారు
రాబోయే ఎన్నికల్లో అత్యధిక సీట్లలో పార్టీ గెలుపుపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాను పోటీచేయబోతున్న సీట్లలో మ్యాగ్జిమమ్ గెలుచుకోవటంతో పాటు మిత్రపక్షాల పార్టీల అభ్యర్ధులను గెలిపిచుకునేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నరేంద్రమోడి వారంలో రెండుసార్లు ఏపీలో పర్యటించబోతున్నారు. ఈనెల 17వ తేదీన చిలకలూరిపేటలో కూటమి ఆధ్వర్యంలో జరగబోతున్న మొదటి బహిరంగసభకు నరేంద్రమోడి హాజరవుతున్నారు. అలాగే 15వ తేదీన విశాఖపట్నంలో జరగబోయే రోడ్డుషోలో పాల్గొనే అవకాశముందని …
Read More »