జగన్.. మూడు అక్షరాలు.. కానీ, 2019-2024 మధ్య జరిగిన ఐదు సంవత్సరాల్లో.. ఆ పేరు అనేక విమర్శలకు.. వివాదాలకు కూడా దారితీసింది. తూర్పు-పడమరగా ఉన్న బీజేపీ-టీడీపీలను చేతులు కలిపేలా కూడా చేసింది. అంతేకాదు.. ప్రజల్లో మహోజ్వల చైతన్యానికి.. కలియతత్వానికి కూడా.. నాంది పలికింది ఆ పేరే. నేటికి(జూన్ 4) సరిగ్గా ఏడాది కిందట జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంపై ఆశలు పెట్టుకున్న జగన్.. పతనావస్థకు చేరిందికూడా ఏడాది కిందట ఇదే రోజు!.
30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని..తనను తప్ప.. ప్రజలు ఇంకెవరికీ ఓట్లు వేయరని లెక్కలు వేసుకున్న జగన్‌కు అదే ఏపీ ప్రజలు ఘాటుగా సమాధానం చెప్పిన రోజు కూడా ఇదే. జగన్ ఓటమికి ఏడాది పూర్తి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినా.. జగన్ విషయానికి వస్తే.. మాత్రం దీనిని భిన్నమై న కోణంలోనే చూడాలి. నిజానికి ఈ ఏడాదిలో ఆయనలో మార్పు కనిపించి ఉండాలి. కానీ.. అలాంటిదేమీ కనిపించలేదు. ఒక ప్రస్థానం మార్పు చెందాక.. మరో ప్రస్థానమైనా మారాలి. కానీ.. అలా లేదనేది పబ్లిక్ టాక్.
టీడీపీ అయినా.. కాంగ్రెస్ అయినా.. మరో పార్టీ అయినా.. గెలుపు, ఓటములను ఒడికి గట్టుకునే రాజకీయాలు చేశాయి. జనసేన 2019లో ఓడిపోలేదా.. ఒక్క సీటుకే పరిమితం కాలేదా..? కానీ.. జన హితం.. ప్రజాభిమ తం అనే రెండు లెక్కలను ముందుకు తీసుకుని నడిచిన ఫలితంగానే జనసేన విజయం దక్కించుకుంది. ఈ విషయంలో ఎలాంటి తేడాలేదు. ఇక, టీడీపీ కూడా 2019లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 23 స్థానాలకు పరిమితం అయింది. అయినా.. కుంగిపోలేదు. వంగి పోలేదు.
కానీ.. జగన్ ఓటమి తర్వాత.. ఈ ఏడాది కాలంలో తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు.. ఆయనను, పార్టీని కూడా ఇరుకున పెడుతూనే ఉన్నాయి. అసెంబ్లీకి వెళ్లేది లేదని భీష్మించడం.. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదాను.. ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం వంటివి జగన్‌ను డైల్యూట్ చేశాయి. ఆయన రాజకీయ ప్రస్తానాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. పైగా అనేక మంది నాయకులు.. పార్టీకిరాం రాం చెప్పారు. రైట్ హ్యాండ్ అనుకున్న నాయకులే.. రన్ పెట్టారు. సో.. మొత్తంగా ఈ ఏడాది కాలంలో జగన్ చేసింది.. సాధించింది ఏమీ లేదనే చెప్పాల్సి ఉంటుందని ప్రముఖ విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.