తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోమవారం ఓ కీలక అడుగు వేసింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు అయిన సోమవారం నాడు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకువస్తూ అదికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుతో పాటు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఈ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. వెరసి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలులోకి వచ్చినట్టేనని చెప్పాలి. సుదీర్ఘ కాలంగా మాదిగలు వారి తరఫున …
Read More »పవన్ అభివృద్దిలో మరింత వేగం పక్కా!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపడుతున్న అభివృద్ది పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ అలా చెబుతుంటే.. పనులు ఇలా జరిగిపోతున్నాయి. నిధుల విడుదల, పనుల గుర్తింపు, పనులను కాంట్రాక్టర్లకు అప్పగింత, పనుల ప్రారంభం… అన్నీ ఇట్టే చకచకా జరిగిపోతున్నాయి. ఇందుకు పవన్ ఎంచుకున్న అధికారులే కారణమని చెప్పాలి. కేరళ కేడర్ ఐఏఎస్ అదికారిగా ఉన్న కృష్ణతేజను ఏరికోరి మరీ ఏపీకి రప్పించుకున్న పవన్… …
Read More »తాను చెడి.. పార్టీని చెరిపి..
గోరంట్ల మాధవ్. 2022లో జోరుగా వినిపించిన పేరు. హిందూపురం వైసీపీ ఎంపీగా అప్పట్లో ఆయన న్యూడ్ వీడియో ఆరోపణల తో అడ్డంగా దొరికిపోయారు. అయితే.. దీనిని సమర్థించుకునేందుకు నానా పాట్లు పడ్డారు. ఇక, బీసీ నాయకుడు కావడం.. తాను ఏరికోరి పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేయించి.. పార్టీలో చేర్చుకున్న నేపథ్యంలో జగన్ కూడా.. ఆయనను చూసీ చూడనట్టు వ్యవహరించారు. ఫలితంగా వైసీపీకి మహిళా ఓటు బ్యాంకుదూరమైంది. అయితే.. ఇప్పటికీ గోరంట్ల …
Read More »ఏడాది టైం పెట్టి 10 నెలల్లోనే.. తండ్రికి తగ్గ తనయుడు!
ఎవరైనా నాయకులు ఎన్నికలకు ముందు ఏదైనా హామీ ఇస్తే.. దానిని నెరవేర్చేందుకు సమయం పడుతుంది. పైగా గెలిచిన తర్వాత.. వారిచ్చిన హామీలను అమలు చేయాలంటూ.. ప్రజలు గుర్తు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే.. నాయకులు ఇచ్చే హామీల్లో సగానికి పైగా అమలుకు నోచుకోవడం కష్టమనే టాక్ ఉంది. అయితే.. ఈ వాదనను కొట్టి పారేస్తూ.. మంత్రి నారా లోకేష్.. తన తండ్రి చంద్రబాబుకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకునే …
Read More »రాజకీయాల్లోకి వస్తున్నా.. జగన్ భరతం పడతా!
“ఈ రోజు నుంచే.. ఈ క్షణం నుంచే నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే ప్రకటిస్తా. జగన్ భరతం పట్టేందుకే.. నేను రాజకీయ నాయకుడిగా మారుతున్నా. జగన్‌కు చుక్కలు చూపిస్తా. ఎవరైనా జగన్ గురించి ఫిర్యాదు చేయాలని అను కుంటే.. నిర్భయంగా 7816020048 వాట్సాప్ నంబర్ కు సమాచారం పంపండి. నేను మీకు అండగా ఉంటా. అందరం కలిసి జగన్ భూతాన్ని జైల్లో పెడదాం” అని ఏపీకి …
Read More »శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కల్యాణ్ సతీమణి!
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సతీమణి, ఇటాలియన్ అన్నాలెజెనోవో తిరుమల సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. విదేశాలకు చెందిన వారు, ఇతర మతాలను ఆచరించేవారు.. తిరుమలకు వచ్చినప్పుడు ఎలాంటి సంప్రదాయాలు పాటించాలో ఖచ్చితంగా వాటిని ఆమె పాటించారు. కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్రిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో శ్రీవారికి మొక్కుకున్న అన్నా లెజెనోవా.. మార్క్ శంకర్ …
Read More »స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖర్చు చేశా: నారా లోకేష్
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి నారాలోకేష్ తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఉండబట్టే అలా చేసినట్టు చెప్పారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నారా లోకేష్ శంకు స్థాపన చేశారు. అదేసమయంలో మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా పలువురికి పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ …
Read More »అమరావతికి డబ్బే డబ్బు.. మాటలు కాదు చేతలే!
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ పాలనలో మూడు రాజధానుల పేరుతో అమరాతిని మురగబెట్టడంతో అంచనా వ్యయం పెరిగిపోయింది. దీనికి తోడు అన్ని శాఖల్లోనూ అప్పులు పేరుకుపోయాయి. దీంతో స్వయంగా రాజధానిని నిర్మించలేక.. కేంద్రం నుంచి సాయం తెచ్చుకునే ప్రయత్నాలు చేశారు. అయితే.. కేంద్రం తను ఇచ్చేదానికంటే కూడా.. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకు …
Read More »అఖండ రాజధాని అమరావతికి మరో 30 వేల ఎకరాలు
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగానే కాకుండా అఖండ రాజధానిగా తీర్చిదిద్దాలని కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే సేకరించిన 33 వేల ఎకరాల భూములకు అదనంగా మరో 30 వేల …
Read More »అశోక్‌కే చంద్రబాబు మొగ్గు.. ఏం జరుగుతోంది ..!
విజయనగరం మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతి రాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారా? ఇదే సమయంలో సీనియర్ నాయకుడైనప్పటికీ.. యనమల రామకృష్ణుడుని పక్కన పెట్టారా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు. ఇటీవల యనమల రామకృష్ణుడు 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దే శించి.. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఓ పుస్తకాన్నికూడా లిఖించారు. దీనిపై పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కానీ, యనమల ఇంత …
Read More »మోదీ, శ్రేయోభిలాషుల పట్ల పవన్ భావోద్వేగం
అసలే చిన్న కుమారుడు, ఆపై అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న వైనం.. అలాంటి కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిస్తే… ఏ తండ్రి అయినా ఇట్టే కుప్పకూలిపోతారు. జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిస్థితి కూడా ఈ నెల 8న ఇదే తరహా పరిస్థితి. గిరిజన గ్రామాల రూపురేఖలు మార్చేద్దామన్న భారీ లక్ష్యంతో ఏకంగా రెండు రోజుల పాటు అరకు పరిధిలో పర్యటన కోసం ఆయన అల్లూరి …
Read More »మాధవ్ చిందులు ఇంతమందిని బుక్ చేశాయా?
వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మొన్న పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి యత్నించడం, ఆపై తనను అరెస్టు చేసిన పోలీసులపై చిందులు తొక్కడం ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాను మాజీ పోలీసు అధికారిని అని, మాజీ ఎంపీని అని పోలీసులపై ఆయన చిందులేసిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ తరహా మాధవ్ చిందులాట ఏకంగా 11 మంది పోలీసులపై చర్యలకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates