వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేష్ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ‘స్త్రీ శక్తి’ని ప్రారంభించి అనంతరం.. విజయవాడలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. “కొందరు ఉంటారు. వారిని రాక్షసులు అనాలో.. ఇంకేమైనా అనాలో.. కూడా అర్ధం కాదు. ఎందుకంటే.. వాళ్లు రాక్షసులకంటే కూడా ఘోరంగా తయారయ్యారు. విషం లాంటి మద్యం అమ్మి.. మహిళల తాళిబొట్లు తెంపాడు” అని జగన్‌పై …
Read More »ఫామ్ హౌస్ లో కేటిఆర్, కవిత… మాట కలిసిందా?
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఇప్పుడు వారసరత్వ పోరు ఓ రేంజికి చేరినట్టు బహాటంగానే చర్చ జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కే అధికారమంతా కట్టబెడితే… మరి తన పరిస్థితి ఏమిటని పార్టీ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆయన కుమార్తె కవిత ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ నుంచి పెద్దగా సమాధానం లేకపోవడంతో పార్టీకి దూరంగా జరిగిన ఆమె… తాను స్థాపించిన తెలంగాణ జాగృతి వేదికగా …
Read More »కడప రెడ్డమ్మా…ఈ కుర్చీల గోలేమిటమ్మా?
కడప జిల్లా కేంద్రం స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి సతీమణి రెడ్డప్పగారి మాధవి రెడ్డి వ్యవహారం స్వాతంత్య్ర దినోత్సవాన వివాదాస్పదంగా మారింది. అంతకుముందు కూడా ఇదే తరహా వివాదాలు రేగినా… అవన్నీ మాధవి రెడ్డి స్టామినాను, పోరాట పటిమను చాటాయి. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కడపలో జరిగిన అధికార వేడుకలో వేదికపై తనకు కుర్చీ ఏధంటూ ఆమె ఏకంగా జాయింట్ కలెక్టర్ …
Read More »కొమ్మినేని కేసులో సుప్రీంకోర్టు ఏమందంతే…
టీవీ ఛానెళ్లు నిర్వహించే చర్చలు.. ఈ సందర్భంగా పార్టిసిపెంట్లు చేసే వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు జారీచేసింది. “ఏదైనా చర్చలో పాల్గొనే పార్టిసిపెంట్లు.. వివాదాస్పద, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు, అంశాలు లేవనెత్తినప్పుడు.. యాంకర్లు.. వినోదం చూడడం సరికాదు. వాటిని అరికట్టండి. సదరు పార్టిసిపెంట్లను కట్టడి చేయండి. అవసరమైతే.. మీ చేతిలోనే రిమోట్ పెట్టుకుని వారి వాయిస్‌ను నిలువరించిండి. అంతేకానీ.. మీకు సంబంధం లేదని చూస్తూ కూర్చోవద్దు.” అని …
Read More »‘ట్వీట్’తోనే జగన్ స్వాతంత్య్రం!
అధికారంలో ఉంటే.. ఒకలా, అధికారం కోల్పోతే మరోలా వ్యవహరించడం నాయకుల లక్షణం. అయితే.. దేశానికి సంబంధించిన పండుగల విషయంలో కూడా ఇలానే చేయడం విమర్శలకు తావిస్తోంది. ము ఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగరేస్తారేమో.. పార్టీ కార్యకర్తలు, లేదా తమకు ఓటేసిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారేమో.. అని నాయకు లు ఎదురు చూశారు. కానీ, ఆ జాడ ఎక్కడా కనిపించలేదు. …
Read More »‘స్త్రీ శక్తి’ సంబరం అంబరాన్నంటింది!
భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఎక్కడికక్కడ జనం జాతీయ జెండాలను ఎగురవేసి… ఆయా ప్రాంతాల్లో జరిగిన అధికార వేడుకలకు హాజరై తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు. సరిగ్గా… భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తానని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే శుక్రవారం మధ్యాహ్నం స్త్రీ శక్తి పేరిట రూపొందించిన మహిళలకు ఉచిత బస్సు …
Read More »ఢిల్లీ టూర్లపై రేవంత్ దిమ్మతిరిగే కౌంటర్!
తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తన ఢిల్లీ టూర్లపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై శుక్రవారం అదిరిపోయే సమాధానం ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొలువై ఉండే ఢిల్లీకి కాకుండా… దుబాయి వెళతానా? అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన తానేమీ ఇతర నేతల మాదిరిగా దోచేసిన డబ్బును దాచుకునేందుకు దుబాయి వెళ్లలేదని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగానే …
Read More »ఓడితేనే ఓట్ చోరీ గుర్తుకొస్తుందా?: పవన్ కల్యాణ్
భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ఓ కీలక అంశంపై జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే.. వాటి వెనుక ఉన్న పెను ముప్పును కూడా పవన్ కల్యాణ్ వివరించి.. అందరినీ ఆలోచనలో పడేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం కాకినాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మరియు …
Read More »నిశ్శబ్ద విప్లవం కొనసాగాలి: చంద్రబాబు
2024 ఎన్నికల్లో ‘ప్రజలు గెలవాలి- రాష్ట్రం నిలవాలి’ అనే ఎన్డీయే నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఓ నిశబ్ద విప్లవాన్ని సృష్టించారని అన్నారు. ఈ విప్లవం వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగాలని ఆయన పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం… రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రాన్ని …
Read More »నేతల ‘అతి’ వైసీపీ కొంప ముంచుతోందా!
నేతలు తమ తమ స్థాయిని గుర్తించి వ్యవహరించాలి. అది ఏ పార్టీ అయినా.. నాయకుల తీరులో స్పష్టత.. చేసే ఆరోపణలకు ప్రాధాన్యం తెలుసుకుని వ్యవహరించాలి. కానీ.. వైసీపీలో విజ్ఞతలేని నాయకులు చేస్తున్న అతి కారణంగా.. ఆ పార్టీ పుట్టి మునిగిపోతోంది. అసలు ఆ పార్టీ అధినేతకే విజ్ఞత లేదని అనే వారు కూడా ఉన్నారు. సరే.. తాజాగా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. సహజంగానే …
Read More »పాక్‌కు పరోక్ష హెచ్చరిక – భారత్ ఆత్మరక్షణలో రాజీ పడదు!
దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గట్టి హెచ్చరిక చేశారు. మూడు కీలక అంశాలపై ఆయన స్పందిస్తూ.. ఈ విషయాల్లో పాక్ పేరు ఎత్తకుండానే ఆయన వార్నింగ్ ఇచ్చారు. 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి శుక్రవారం ఢిల్లీలోని చరిత్రాత్మక ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం.. జాతిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. అనేక విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ …
Read More »జీఎస్టీ తగ్గిస్తాం: ప్రధాని సంచలన ప్రకటన
దేశ ప్రజలకు తీవ్ర ఆర్థిక భారంగా మారిన జీఎస్టీ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. జీఎస్టీ వ్యవహారాన్ని ప్రస్తావించారు. దేశ ప్రజలు జీఎస్టీ గురించి ఏమనుకుంటున్నారో.. తనకు వినిపిస్తోందన్నారు. దీనిపై ఉద్దీపనలు (రాయితీ) ప్రకటించనున్నామని ఆయన చెప్పారు. వచ్చే దీపావళి నాటికి.. జీఎస్టీలో కొత్త సంస్కరణలు తీసుకురానున్నట్టు చెప్పారు. తద్వారా ప్రజలపై భారాలు తగ్గిస్తామన్నారు. సామాన్యులకు కొత్త …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates