“ఏపీ ప్రభుత్వం చెబుతున్న సమాచారాన్ని బట్టి.. అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వడం కుదరదు. ఏదైనా ఉంటే.. ఏపీ హైకోర్టులోనే తేల్చుకో“ అని వైసీపీ నాయకుడు, సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుప డ్డ బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని.. నకిలీ వైద్య సర్టిఫికెట్‌ను సమర్పించి.. ఏపీ హైకోర్టును తప్పుదోవ పట్టించి.. మోస పూరితంగా …
Read More »15 రోజులే గడువు,వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయండి: చంద్రబాబు
ఒకసారి చెప్పి చూశారు. రెండు సార్లు వార్నింగ్ ఇచ్చారు. మూడో సారి కేసులు పెట్టమని ఆదేశించారు. అయినా.. వారు దారికి రాలేదు. పైగా మరింతగా రెచ్చిపోతున్నారు. ఇక, ఏం చేస్తారు? ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ డీలర్లు, మిల్లర్లు, రేషన్ సంబంధిత ఉద్యోగులపై రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని సంచలన ఆదేశాలు జారీ చేశారు. తాజాగా వివిధ జిల్లాల్లో జరుగుతున్న …
Read More »ఈ సారి వారి కోసం కదిలిన.. నారా భువనేశ్వరి!
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. స్వచ్ఛంద కార్యక్రమాలలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎన్నికలకు ముందు రాజకీయంగా కూడా సత్తా నిరూపించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ప్రజా సేవలో తనదైన కోణాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో గత నెలలో విజయవాడలో కేన్సర్ బాధితుల కోసం.. తమన్‌తో కలిసి.. మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించారు. దీని ద్వారా వచ్చిన సొమ్మును కేన్సర్ రోగుల చికిత్స.. వారికి సాయం …
Read More »ఉగ్రవాదం వేరు ముస్లిం సమాజం వేరు: పవన్
జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే. పర్యాటకులుగా కశ్మీర్ లోయలో అడుగుపెట్టిన ఆ 26 మందిని ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా తూటాలతో కాల్చి చంపారు. హిందువులను మాత్రమే ఎంచుకొని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ముస్లింలను వదిలేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య సున్నితమైన వాతావరణం ఏర్పడింది. టెర్రరిస్టులుగా మారిన …
Read More »మోదీతో బాబు భేటీ… అమరావతి 2.0 కి ఆహ్వానం!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు… ప్రధాని నివాసంలో మోదీతో శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై ఇరువురు నేతల మధ్య కీలక చర్చ జరిగింది. 26 మందిని బలి తీసుకున్న ఈ దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు… ఉగ్రవాదులపై కేంద్రం తీసుకునే ఏ …
Read More »విడదల రజినీకి షాక్.. విచారణకు సహకరించాలన్న కోర్టు
మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దండుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీకి శుక్రవారం హైకోర్టులో షాక్ తగిలింది. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్డపాడులో ఓ స్టోన్ క్రషింగ్ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించి… రూ.2.2 కోట్లను వసూలు చేశారంటూ రజినీ సహా ఆమె మరిది గోపీ, ఆమె పీఏ రామకృష్ణతో పాటు నాడు విజిలెన్స్ ప్రాంతీయ అధికారిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి …
Read More »పార్టీలు చూడం.. కఠినంగా శిక్షిస్తాం: పవన్ కల్యాణ్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ మాట చెప్పారంటే… దానికి అనుగుణంగానే ముందుకు సాగుతూ ఉంటారు. ఈ విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితం కాగా.. తాజాగా శుక్రవారం నాటి తన పిఠాపురం పర్యటనలోనూ ఇదే విషయాన్ని ఆయన మరోమారు నిరూపించారు. అక్రమ, అసాంఘీక కార్యక్రమాలను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని చెప్పిన పవన్… వాటికి పాల్పడ్డ వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అంతేకాకుండా అలాంటి వారి విషయంలో పార్టీలను చూడబోమని కూడా తెలిపారు. ఇలాంటి …
Read More »సీఎంలకు అమిత్ షా ఫోన్.. దేశంలో హై అలర్ట్
పెహల్ గాం లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా ఉగ్ర దాడికి సంపూర్ణంగా మద్దతు పలికిన పాకిస్తాన్ పై కఠిన చర్యలకు కూడా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వరుసబెట్టి ఫోన్లు చేశారు. మీ పరిధిలోని రాష్ట్రాల్లో ఉంటున్న పాక్ …
Read More »చెల్లెలు ఎమ్మెల్యే.. అన్నదమ్ముల పెత్తనం.. ఎక్కడంటే!
అధికారం చెల్లిది.. ప్రజలు గెలిపించింది కూడా ఆమెనే. కానీ.. పెత్తనం మాత్రం అన్నదమ్ములు చేసేస్తున్నారు. ఈ వ్యవహారం.. టీడీపీలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఇదేంటని.. చంద్రబాబు వరకు కూడా విషయం చేరింది. నిజానికి గత 2024 ఎన్నికలలో టీడీపీ పలువురు కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చింది. వివిధ కారణాలతో సీనియర్ నాయకులను పక్కన పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వారి కుటుంబాలకు చెందిన వారికే టికెట్లు ఇచ్చారు. ఇలా.. …
Read More »పవన్ తో కలిసి సాగిన వర్మ
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన శ్రేణులతో కొంతకాలంగా అంటీ ముట్టనట్టుగా సాగుతున్న టీడీపీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ… పవన్ టూర్ లో మాత్రం ఆ తరహా వైఖరికి స్వస్తి చెప్పేశారు. అంతేకాకుండా పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య ఓ రేంజిలో అభిప్రాయ …
Read More »సస్పెండ్ చేసినా.. చింత లేదా…
ఒక నాయకుడిని సస్పెండ్ చేస్తే.. చింత ఉండాలి. మార్పు రావాలి. కనీసం.. ఆవేదన అయినా ఉండాలి. కానీ.. వైసీపీ నుంచి సస్పెండ్ అవుతున్న నాయకులకు ఈ తరహా చింత లేకపోవడం.. గమనార్హం. తాజాగా దువ్వాడ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. అయితే.. ఆయనలో చిన్నపాటి ఆవేదన కూడా లేకపోగా.. పై పెచ్చు.. ఇండిపెండెంటుగా ఉంటేనే బాగుందన్న కామెంట్లు చేయడం మరింతగా ఆయన శైలిని.. ఇగోను బట్టబయలు చేస్తోంది. నిజానికి.. రాజకీయాల్లో ఉన్నవారు …
Read More »నో డౌట్: కాళేశ్వరం బ్యారేజీలు పనికిరావు…!
తెలంగాణ ఏర్పాటై తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశాక కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తనను ఎల్లకాలం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంచుతుందని ఎన్నో కలలు కన్నారు. వరుసగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించడానికి తెలంగాణ రైతాంగం అంతా తనకు ఓట్లేస్తుందని కలలు కన్నారు. అయితే ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates