Political News

పొంగులేటీపై టీపీసీసీ చీఫ్ గుస్సా.. రీజనేంటి?

వారిద్దరూ తెలంగాణలోని అదికార పార్టీకి చెందిన వారే. ఒకరేమో మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరొకరేమో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బొమ్మా మహేశ్ కుమార్ గౌడ్. ఈ ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. వీరి మధ్య ఇప్పటిదాకా పెద్దగా విబేధాలన్న మాటే లేదు. అయితే ఒకే ఒక్క విషయం… పొంగులేటిపై మహేశ్ గౌడ్ అంతెత్తున ఎగిరి పడేలా చేసింది. ఇదేం ఆతృత? చూసుకొని మాట్లాడాలిగా… అంటూ ఆయన మంత్రిగారి …

Read More »

జోగి ఇల్లు నేల మ‌ట్టం చేస్తాం: టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలో ఎన్టీఆర్ జిల్లా రాజ‌కీయాలు వేడి వేడిగా ఉన్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని శివ‌నాథ్‌, ఆయ‌న సోద‌రుడు, మాజీ ఎంపీ కేశినేని నానీల మ‌ధ్య రాజ‌కీయ విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు వైసీపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నేత‌, మాజీ మంత్రి జోగి ర‌మేష్ వ‌ర్సెస్ మైల‌వ‌రం ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు, వైసీపీ మాజీ నేత వసంత కృష్ణ ప్ర‌సాద్ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. …

Read More »

కొడాలి నాని అరెస్టుపై పేర్ని నాని జోస్యం

2019-24 మధ్య వైసీసీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రెచ్చిపోయి వ్యవహరించిన నాయకులు, అధికారులను గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. ఒక పద్ధతి ప్రకారం వారి మీద కేసులు పెడుతూ.. వారికి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా చాలామంది వైసీపీ నేతలు చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఐతే ఇప్పటికే చాలామంది నాయకులను టార్గెట్ చేసినప్పటికీ.. …

Read More »

తగ్గేదేలే… 30 సార్లైనా వస్తా: కేటీఆర్

ఫార్ములా ఈ కారు రేసుల కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణకు వెళ్లే మెుందు బీఆర్ఎస్ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్… విచారణలంటే తనకేమీ భయం లేదని, తమపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటిదాకా 3 నోటీసులు ఇచ్చారని, తాను ఓ సారి విచారణకు హాజరయ్యానన్న కేటీఆర్… ఇంకా …

Read More »

తేడా వ‌స్తే త‌ప్పించుకుంటారా.. క‌మ‌ల నాథుల వ్యూహ‌మేంటో..!

రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో జరిగిన పాలనపై రాష్ట్ర ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. ప్రధానంగా ప్రజలను కలుసుకోవడం ప్రజల సంతృప్తిని లెక్క వేసుకోవడం వారికి అనుకూలంగా మళ్లీ కార్యక్రమాలు నిర్వహించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. అయితే కూటమి పార్టీలుగా విజయం దక్కించుకున్న వాటిలో బీజేపీ కీలకమైంది. కేంద్రంలో ఈరోజు మోడీ ప్రభుత్వం ఏర్పడడానికి రాష్ట్రంలో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం అత్యంత …

Read More »

‘త‌ల్లికి వంద‌నం’.. ఆనందంపై చంద్ర‌బాబు ఆరా!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ప‌క్షాన ఇచ్చిన ‘సూప‌ర్-6’ హామీల్లో కీల‌క‌మైన త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని గ‌త గురువారం ప్రారంభించారు. శుక్ర‌వారం, శ‌నివారాల్లో ల‌బ్ధిదారులైన మ‌హిళ‌ల ఖాతాల్లో రూ.13000 చొప్పున నిధులు జ‌మ చేశారు. ఇంట్లో ఒక తల్లికి ఎంత మంది చ‌దువుకునే చిన్నారులు ఉన్నా.. వారంద‌రికీ ఈ సొమ్ములు జ‌మ చేస్తామ‌ని చెప్పిన‌ట్టుగానే.. ప్ర‌స్తుతం అదే ప‌నిచేస్తున్నారు. దాదాపు 85 శాతం మందికి ఈ నిధులు ఇచ్చేశారు. కుటుంబంలో ముగ్గురు …

Read More »

`లీడ‌ర్‌`.. ఎవ‌రి కోసం.. క‌విత ఫ్యూచ‌ర్ ప్లానేనా?

బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత నూత‌న కార్యక్ర‌మానికి శ్రీకారం చుట్టారు. `లీడ‌ర్‌` పేరుతో ఆమె యువ‌త‌కు ఆహ్వానం ప‌లుకుతున్నారు. రాష్ట్ర స్తాయిలో యువ‌త‌ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా తెలంగాణ యువత, మహిళలకు రాజకీయ శిక్షణ అందించేందుకు తెలంగాణ జాగృతి ‘లీడర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభిం చారు. ఇప్ప‌టి వ‌ర‌కు లేని ఈ కార్య‌క్ర‌మానికి యువ‌త నుంచి మ‌హిళ‌ల నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుంద‌నేది చూడాలి. …

Read More »

జ‌గ‌న్‌.. 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తా: నారా లోకేష్‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. “జ‌గ‌న్ గా రూ.. మీరు క‌డుపు మంట‌తో అల్లాడుతున్నారు. నాకు తెలుస్తోంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తా. నీళ్ల‌లో క‌లుపుకొని తాగండి. క‌డుపు మంట త‌గ్గుతుంది.” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కీల‌క‌మైన సూప‌ర్ 6 హామీల్లో ఒక‌టైన త‌ల్లికి వంద‌నంప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ ప‌థ‌కంలో లోపాలు ఉన్నాయంటూ.. …

Read More »

15 రోజుల గ‌డువు.. `కాంగ్రెస్` రెడీ అయ్యేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పైగా ప్ర‌భుత్వానికి ఏడాదిన్న‌ర కూడా దాటిపోయింది. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు శ్రీకారం చుడుతున్న‌ట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి చెప్పేశారు. ఈ నెల ఆఖ‌రు నాటికి నోటిఫికేష‌న్ ఇచ్చేసేలా ప్ర‌భుత్వం నుంచి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అంతేకాదు.. ఆయ‌నే స్వ‌యంగా ఈ క్ర‌తువుకు 15 రోజుల గ‌డువు మాత్ర‌మే ఉంద‌ని వెల్ల‌డించారు. ఈ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పార్టీ పుంజుకుని.. స్థానిక …

Read More »

‘ఫ్యాన్’కు బేరింగులన్నీ పాడయ్యాయబ్బా!

ఇంటిలో తిరుగుతున్న ఫ్యాన్ కు బేరింగులు బాగుంటేనే దాని నుంచి నలుదిక్కులా గాలి వస్తుంది. శబ్ధం లేకుండా ఫ్యాన్ ఆహ్లాదాన్ని అందిస్తుంది. రాత్రి వేళ సుఖమయ నిద్రను అందిస్తుంది. ఫ్యాన్ లొని ఇతరత్రా పరికరాల కంటే బేరింగులే కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి ఫ్యాన్ ను పట్టుకుని ఎన్నికల ప్రచారంలో వైసీపీ అదినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యాన్ ఇంటిలో ఉండాలి.. టీడీపీ గుర్తు …

Read More »

మోడీ రాక‌.. 2 రోజుల ముందే.. విశాఖ‌కు చంద్ర‌బాబు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఏపీకి మ‌రోసారి వ‌స్తున్నారు. ఈ నెల 21న నిర్వ‌హించ‌నున్న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వానికి రావాలంటూ.. సీఎం చంద్ర‌బాబు ఆహ్వానించిన నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ ఈ నెల 20న రాత్రికి ఒడిశా నుంచి విశాఖ‌కు చేరుకుంటారు. ఆ రాత్రికి అక్క‌డే బ‌స చేసి.. తెల్ల‌వారు జామున 5.30 గంట‌ల‌కే యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. దీనిని విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతంగా రాజిల్లుతున్న ఆర్కేబీచ్‌లో నిర్వ‌హిస్తున్నారు. దీనికి …

Read More »

23 ముహూర్తం.. అస‌లు విష‌యాలు తేలేది అప్పుడే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఓ కీల‌క కార్య‌క్ర‌మానికి ఈ నెల 23ను ముహూర్తంగా నిర్ణ‌యించారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో ఈ ఏడాది కాలంలో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, చేసిన సంక్షేమం వంటి కీల‌క అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని నిర్ణ‌యించారు.ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 23 నుంచి ‘ఇంటింటికీ సుప‌రిపాల‌న‌’ పేరుతో ప్ర‌చారం చేయాల‌ని ఇప్ప‌టికే కార్య‌క‌ర్త‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. ఇది మంచి …

Read More »