జగన్‌కు రాజకీయంగా ఎంత మంది ప్రత్యర్థులు ఉన్నా.. ఇబ్బంది లేదు. వారిపై ఎదురు దాడి చేయొచ్చు. … లేదా రాజకీయంగా దూకుడుగా వ్యాఖ్యానించవచ్చు. కానీ, ఎటొచ్చీ.. ఆయన ఎదిరించలేని.. దూకుడు ప్రదర్శించలేని ఏకైక నాయకురాలు షర్మిల. ఏమన్నా.. ఇరకాటమే. ఏం మాట్లాడినా తలనొప్పే.. ఇదీ ఇప్పుడు జగన్ పరిస్థితి. రాజకీయంగా విమర్శించినా.. షర్మిల సెంటిమెంటు అస్త్రం తీసేస్తున్నారు. అలాగని మౌనంగా ఉంటే.. ఇదిగో ఇలా.. వరస పెట్టి వాయించేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో ఉన్న షర్మిల.. జగన్‌ను వాయించేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జగన్ పర్యటనలపై కాంన్సన్‌ట్రేట్ చేస్తున్న షర్మిల.. గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో జరిగిన సింగయ్య ప్రమాద మృతిని అస్త్రంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జగన్ పర్యటనలకు అనుమతులు ఇవ్వద్దని.. ఆయన బయటకు కూడా రాకుండా చూడాలని సర్కారును కోరుతున్నారు. తాజాగా కూడా ఇవే వ్యాఖ్యలు చేసినా.. కొంత డిఫరెంట్ యాంగిల్ లో వాయించేశారు.
“జగన్ ప్రజల మధ్యకు ఎందుకు వస్తున్నారు. ప్రజలు ఆయనను మరిచిపోతారన్న భయం వెంటాడు తోంది. అందుకే ప్రజల మధ్యకు వస్తున్నాడు“ అని షర్మిల వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఏమాత్రం బాధ్యతలేని నాయకులను ప్రజల మధ్యకురాకుండా చూడాలని ప్రభుత్వానికి సలహాఇచ్చారు. “వైసీపీ అనేది లేదు. ప్రజలు గత ఎన్నికల్లోనే పక్కన పెట్టారు. అదే ఇప్పుడు జగన్ గారికి బాధగా ఉంది. ప్రజలు.. తనను , తన పార్టీని కూడా మరిచిపోయారని ఆవేదన చెందుతున్నాడు. అందుకే ఇలా బల ప్రదర్శనలకు దిగుతున్నారు“ అని షర్మిల ఎద్దేవా చేశారు.
ప్రభుత్వానికి కూడా ఆమె పలు సూచనలు చేశారు. ప్రజలను హింసించే ఇలాంటి నాయకుల పర్యటన లకు అనుమతులు ఇవ్వొద్దన్నారు. సింగయ్య కుటుంబానికి వైసీపీ అధినేతగా జగన్ 10 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాన వత్వం గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు. కాగా.. జగన్ సోమవారం.. మానవత్వం పేరుతో సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates