Political News

  గ్రేట‌ర్‌పై ప‌ట్టుకు రేవంత్ ప్లాన్‌

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా పీసీసీ అధ్య‌క్షుడు, సీఎం రేవంత్ రెడ్డి సాగుతున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డైతే బ‌ల‌హీనంగా ఉందో గుర్తించి ఆ చోట్ల పార్టీ పుంజుకోవ‌డానికి ఆయ‌న క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌పై రేవంత్ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది కానీ గ్రేట‌ర్ …

Read More »

జ‌నాల్లోకి కేసీఆర్‌.. బ‌స్సుయాత్ర‌తో బాగుప‌డేనా?

ఓ వైపు పార్టీలో నుంచి నాయ‌కుల జంపింగ్‌లు.. మ‌రోవైపు వివిధ కార‌ణాల‌తో పార్టీపై వ్య‌తిరేక‌త‌.. కార్య‌క‌ర్త‌ల్లో, జ‌నాల్లో పార్టీపై పోతున్న న‌మ్మ‌కం.. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. అందుకు బ‌స్సుయాత్ర‌ను మార్గంగా ఎంచుకున్నారు. ఏప్రిల్ 22 నుంచి కేసీఆర్ బ‌స్సుయాత్ర చేస్తార‌ని బీఆర్ఎస్ ప్ర‌క‌టించింది. ఇందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా …

Read More »

నేత‌లకు పొలిటిక‌ల్ వ‌డ‌దెబ్బ‌!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నేత‌ల‌కు ప్ర‌త్య‌ర్థుల రాజ‌కీయాల నుంచి సెగ ఏమేర‌కు త‌గులుతున్నా.. ఎండల తీవ్రత కార‌ణంగా.. రాజ‌కీయ సెగ మాత్రం త‌గులుతోంది. సాధార‌ణంగా.. సార్వ‌త్రిక స‌మ‌యం ఏప్రిల్‌తో ముగిసిపోతుంది. పోవాలి కూడా. 2019, 2014లోనూ ఇలానే ఏప్రిల్ రెండో వారానికి ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసింది. దీంతో నాయ‌కులు స‌జావుగానే ప్ర‌చారం చేసుకున్నారు. ఎండ‌ల తీవ్ర‌త ఉన్న మ‌ధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంట‌ల మ‌ధ్య మాత్రం ప్ర‌చారాన్ని …

Read More »

వ్య‌తిరేక‌త అర్థ‌మ‌వుతోందా జ‌గ‌న్‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీకి తిరుగేలేదు? ఈ సారి 175 సీట్లు గెలుస్తాం అనే అతివిశ్వాసంతో ఆ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సాగుతున్నారా? క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు వ్య‌తిరేకంగా మారినా అర్థం చేసుకోవ‌డం లేదా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా బ‌స్సుయాత్ర‌లో వివిధ వ‌ర్గాల నుంచి ఎదుర‌వుతోన్న అసంతృప్తి సెగ‌, వ్య‌తిరేక‌తే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాజాగా కాకినాడ‌లో కాలేజీ విద్యార్థులు జ‌గ‌న్ ముందే ప‌వ‌న్‌కు …

Read More »

ఇది ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ కాదు

కాంగ్రెస్ పార్టీ మారింది. అవును.. దేశంలో ఇత‌ర చోట్ల ఆ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్నా తెలంగాణ‌లో మాత్రం వేరే లెవ‌ల్ అనే చెప్పాలి. ఇది ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ కాదు. ఇప్పుడు మాట‌కు మాట స‌మాధానం ఇస్తూ.. ప్ర‌తిప‌క్షాల‌కు బ‌లంగా కౌంట‌ర్ ఇస్తూ.. ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెంచుకుంటూ.. బ‌లోపేత‌మ‌వుతూ తెలంగాణ‌లో పార్టీ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ముందుండి న‌డిపిస్తుండ‌గా.. ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు కూడా అండ‌గా నిలబ‌డుతుండ‌టంతో పార్టీ …

Read More »

వైఎస్ జగన్ మౌనం చాలా ప్రమాదకరం

ఐదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికల ప్రచారంలో కీలకమైన అంశాల గురించి అస్సలు ప్రస్తావించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. గతంలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అది వైసీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామనీ …

Read More »

  అన్న‌య్య అండ‌.. కూట‌మికి కొండంత బ‌లం

జ‌గ‌న్ అరాచ‌క పాల‌న నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు విముక్తి క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా, ఏపీ అభివృద్ధే అజెండాగా తాము కూట‌మిగా ఏర్ప‌డ్డామ‌ని జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ చెబుతున్నాయి. ఈ సారి ఏపీలో కూట‌మిదే అధికారం అని ధీమాతో ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా కూట‌మికి మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో ఈ మూడు పార్టీలు మ‌రింత సంతోషంలో మునిగిపోతున్నాయి. ప‌ద్మ‌భూష‌ణ్ చిరంజీవి లాంటి వ్య‌క్తి అండ‌గా నిలిస్తే అంత‌కంటే కావాల్సింది ఇంకేం ఉంటుంద‌ని అంతా …

Read More »

బీజేపీలో మాధవీలతకు ఎందుకంత ప్రాధాన్యం ?

దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న పార్లమెంటు స్థానాలలో హైదరాబాద్ ఒకటి. ఎంఐఎం కంచుకోట అయిన ఈ స్థానంలో ఎంఐఎం అధినేత సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ 1984 నుండి 1999 వరకు ఆరు సార్లు ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2004 నుండి 2019 వరకు అసదుద్దీన్ ఓవైసీ నాలుగు సార్లు విజయం సాధించారు. నాలుగు దశాబ్దాలుగా ఈ స్థానం ఎంఐఎం ఆధీనంలోనే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సారి బీజేపీ …

Read More »

ఆ ఒక్క ఫోటోతో మోడీ నోట మాట రాకుండా చేశాడు

మనిషికి మరణం ఎక్కడి నుంచైనా, ఎవరి నుంచైనా రావచ్చు. కానీ జన్మ మాత్రం ఒక్క అమ్మ ద్వారానే సంభవిస్తుంది. అందుకే ఎంతటి వారికైనా అమ్మతో అనుబంధం ప్రత్యేకం. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న నానుడి వచ్చింది. దానికి ప్రధానమంత్రి మోడీ కూడా అతీతుడు కాదు. తల్లితో ఆయనది ప్రత్యేక అనుబంధం. అనేకమార్లు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు కూడా. 2022 డిసెంబర్ 30న మోడీ మాతృమూర్తి హీరాబెన్ 100 …

Read More »

చిరంజీవిపై విమర్శల దాడి చేస్తే వైసీపీకేంటి లాభం.?

వైసీపీ అసహన రాజకీయాలకు ఇదొక నిదర్శనం. మెగాస్టార్ చిరంజీవి మీద దారుణాతి దారుణమైన రీతిలో వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడికి దిగారు. వైసీపీ కీలక నేత అయితే, ‘సింగిల్ సింహం’ అని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అపారమైన స్వామి భక్తిని చాటుకునే క్రమంలో, రాజకీయ ప్రత్యర్థుల్ని జంతువులతో పోల్చుతున్నారు. ఆ జంతువుల్లో హైనా తదితర పేర్లనూ ప్రస్తావించడం అత్యంత శోచనీయం. రాజకీయమన్నాక …

Read More »

జ‌న‌సేన‌లో కోటీశ్వ‌రురాలు.. మాధ‌వి ఆస్తులు వంద‌ల కోట్లు!

సామాన్యుల‌కు టికెట్ లు ఇస్తామ‌ని.. వారిని గెలిపించుకుంటామ‌ని చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా.. స‌మ‌యా నికి త‌గిన విధంగానే(అంటే.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఇస్తున్న టికెట్లు.. వారి అభ్య‌ర్థుల ఆర్థిక బ‌లం, అంగ బ‌లాల‌ను దృష్టిలో ఉంచుకునే) అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కోటీశ్వ‌రుడు అన్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఆయ‌న టికెట్ ఇచ్చిన వారిలో ఒకే ఒక మ‌హిళ ఉన్నారు. ఆమే లోకం మాధ‌వి. బ్రాహ్మ‌ణ …

Read More »

రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా కాపు ఉద్య‌మ నాయ‌కుడు

ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో జోరుగా ఉన్న వైసీపీ, టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి నాయ‌కులు మాట‌ల‌కు ప‌దును పెంచుతున్నారు. ముఖ్యంగా జ‌న‌సేన త‌ర‌ఫున స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఉన్న‌వారు స‌వాళ్లు కూడా రువ్వుతున్నారు. దీంతో ఎన్నిక‌ల‌కు 20 రోజుల ముందుగానే.. రాష్ట్రంలో రాజ‌కీయం కాకెక్కింది. కేక‌పుట్టిస్తోంది. తాజాగా 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, టాలీవుడ్ న‌టుడు.. పృథ్వీ రాజ్‌.. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, స‌వాళ్లు విసిరారు. …

Read More »