ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు శనివారం రాత్రి భేటీ అయ్యారు. ఉదయం అంతా.. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానితో పాటే పాల్గొన్న సీఎం చంద్రబాబు.. మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారని ప్రధానితో కితాబు అందుకున్నారు. అనంతరం.. మరోసారి ఐదు నిమిషాల పాటు.. ప్రధాని అప్పాయింట్ మెంటు తీసుకుని ఆయనను కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఆరాతీశారని తెలిసింది. మహానాడు …
Read More »జపాన్ను పక్కకు నెట్టిన భారత్ .. సరికొత్త రికార్డు!
భారత దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే తొలి మూడు స్థానాల్లో నిలబెడతానంటూ.. తరచుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనికి ఆయన ఐదేళ్ల వరకు సమయం విధించుకున్నారు. వచ్చే ఐదేళ్లలో భారత దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. అయితే.. ఈ క్రమంలో తాజాగా ఓ అడుగు ముందుకు పడింది. తొలి ఐదు దేశాల్లో ఐదో స్థానంలో ఉన్న …
Read More »బాబు విందు.. ఘుమఘుమలు!
సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో నిర్మించుకున్న సువిశాల భవనం.. గృహ ప్రవేశం ఆదివారం తెల్లవారుజామును జరిగింది. శనివారం రాత్రి ఢిల్లీ నుంచినేరుగా హైదరాబాద్కు.. అక్కడ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో కుప్పానికి చేరుకున్నారు. అనంతరం.. ఆయన నిద్రకూడా పోకుండానే.. గృహ ప్రవేశ ఘట్టంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 25 వేల మంది పార్టీ నాయకులు, మంత్రులు, వీఐపీలను ఆహ్వానించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల …
Read More »వంశీ-నాని-పేర్ని.. వాయించేసిన బుద్దా వెంకన్న
వైసీపీ నాయకులు, ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన వల్లభనేని వంశీ, కొడాలి నానీ, పేర్ని నానీలపై టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వరుస పెట్టి వాయించేశారు. ఒక్కొక్కరినీ పేరు పెట్టి మరీ వాయించేశారు. తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న.. వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక్కొక్కరి చరిత్రా ప్రజలకు తెలియదనుకున్నారా? అంటూ.. పేర్ని నానీపై విరుచుకుపడ్డారు. బుద్దా ఏమన్నారంటే.. “జైల్లో ఉన్న వల్లభనేని వంశీ స్వాతంత్య్ర …
Read More »పాలు పొంగించిన నారా బ్రాహ్మణి
ఏపీ సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు తాజాగా నూతన ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా వారి కోడలు.. నారా బ్రాహ్మణి కొత్తింట్లో పాలు పొంగించి.. సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా కాకుండా.. ప్రైవేటుగానే నిర్వహించారు. దీంతో మీడియాను ఎలో చేయలేదు. ఇక, ఈ నూతన ఇంటి విషయానికి వస్తే చంద్రబాబు సొంత నియోజకవర్గం.. కుప్పంలోని శాంతిపురం మండలం, శివపురం …
Read More »తమ్ముళ్లకూ ‘సూపర్ సిక్స్’.. చంద్రబాబు కీలక నిర్ణయం ..!
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికలకు ముందు.. ప్రజల కోసం ఆయన ‘సూపర్ సిక్స్’ పేరుతో ఆరు కీలక పథకాలను ప్రకటించారు. వీటిలో దీపం-2 పథకాన్ని అమలు చేస్తున్నారు. మిగిలిన వాటిని త్వరలోనే అమలు చేయనున్నారు. వీటికి ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. సూపర్ సిక్స్ పథకాలు మహిళలను మంత్ర ముగ్ధులను చేశాయి. వారిలో టీడీపీపై ఇమేజ్ను కూడా పెంచాయి. ఇదిలావుంటే.. ఇప్పుటు టీడీపీ …
Read More »టైం ఇవ్వాలి.. బాబు వినాలి.. లేకపోతే.. !
ఏ పార్టీలో అయినా.. నాయకులకు సంతృప్తి-అసంతృప్తి అనేవి రెండూ ఉంటాయి. రెండు ఉన్న వారు కూడా ఉంటారు. ఎంత చేసినా అసంతృప్తేనా? అనే మాట హైకమాండ్ నుంచి వినిపిస్తుంది. కానీ ఎంతో చేస్తున్నాం.. అయినా తమకు గుర్తింపు లేదని క్షేత్రస్తాయిలో నాయకులు అంటారు. ఈ రెండు ఏ పార్టీలో అయినా కామనే. అయితే.. సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం ఉన్న టీడీపీలో ఇప్పుడు.. మరింత ఎక్కువగా ఈ మాట వినిపిస్తోంది. మరొ …
Read More »పవన్ నోరు విప్పేశారు.. ఇక, పెద్దలు ఏం చేస్తారు?
తెలుగు సినీ పరిశ్రమపై ఏపీ డిప్యూటీ సీఎం, అగ్రహీరో పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఆయన ఉన్నదేదో మొహానే చెప్పేశారు. ఇండస్ట్రీ పెద్దలకు సూటిగా.. సుత్తిలేకుండా.. తన మనసులో మాటను చెప్పేశారు. ఎక్కడా డొంక తిరుగుడు లేదు. ఎక్కడా నాన్చుడు ధోరణిని కూడా అవలంభించలేదు. మరి ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తారు? ఏం చేయాలి? అనేది వారి కోర్టులోకే చేరింది. తాజాగా ఆగ్రహం వెనుక.. ప్రభుత్వాన్ని పెద్దలు కలుసుకోవడం లేదన్న …
Read More »వైసీపీ టాక్: సాయిరెడ్డిని కెలికి తప్పు చేశారు ..!
వైసీపీ కీలక మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డిపై రెండు రోజుల కిందట వైసీపీ అధినేత జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే..ఈ వ్యాఖ్యలు ఆయనకు మైలేజీఇవ్వకపోగా.. పార్టీలో నేతల నుంచే విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి. సాయిరెడ్డిని కెలికి తప్పు చేశారు సర్! అంటూ ఒకరిద్దరు సీనియర్ నాయకులు తాజాగా జగన్ చెవిలో వేసినట్టు తెలిసింది. తాజాగా ఇద్దరు జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు ఆయననుకలిసారు. …
Read More »జగన్కు ఊహించని షాకులిస్తున్న చంద్రబాబు.. !
రాజకీయాల్లో ప్రత్యర్థులకు షాకులు ఇవ్వడం పెద్ద విషయం కాదు. కానీ.. ఊహించని విధంగా షాకులు ఇవ్వడమే ఇప్పుడు వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు కూడా.. ఇబ్బందిగా మారింది. “బాబా ఏముంది కేసులు పెడతాడు.. అంతేగా! పెట్టించుకోండి” అంటూ.. ఆరు మాసాల కిందట పార్టీ నాయకులకు జగన్ సూచించారు. ఆవెంటనే బెయిల్పై బయటకు కూడా వచ్చేయొచ్చని తేలిగ్గా చెప్పుకొచ్చారు. కానీ.. కేసులు పెడుతున్నా.. వాటి నుంచి తప్పించుకుని బయటకు వచ్చే అవకాశం …
Read More »మహానాడు ఆపమని మాస్క్ లు వేసుకుని వచ్చారు
ఏపీ అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు మరో మూడురోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నెల 27 నుంచి 29 మధ్య మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. అది కూడా వైసీపీ అధినేత జగన్ ఇలాకా.. కడపలో తొలిసారి నిర్వహిస్తున్నారు. కడపలోని జగన్ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం కమలాపురంలో మూడు …
Read More »ఇండస్ట్రీలో పవన్ తుఫాన్.. ఏం జరుగుతుంది?
అగ్ర నటుడు, సినీ హీరో పవర్ స్టార్.. తొలిసారి ఇనీ ఇండస్ట్రీపై నిప్పులు చెరిగారు. అనూహ్య రీతిలో ఆయన విరుచుకుపడ్డారు. ఇదొక తుఫానేనని చెప్పాలి. ఈ తరహా పరుషంగా కఠినంగా ఆయన వ్యాఖ్యలు చేసింది ఎప్పుడూలేదు. కానీ.. ఈ దఫా మాత్రం ఇండస్ట్రీని కడిగేశారు. సినీ పరిశ్రమలోని వారికి కృతజ్ఞత అంటూ లేదని ఆయన చేసిన వ్యాఖ్య చిన్నదేం కాదు. చాలా పెద్దదిగానే చూడాలి. అంతేకాదు.. ఇప్పటి వరకు తెలంగాణ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates