Political News

మోడీ మొండి ధైర్యం, నో ఫ్రీ బీస్

సాధార‌ణంగా ఎన్నిక‌ల మేనిఫెస్టో అంటే.. అధికారంలో ఉన్న పార్టీ ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్ని స్తుంది. పైగా మూడోసారి అధికారంలోకి రావాల‌ని గ‌ట్టిగా సంక‌ల్పం చెప్పుకొన్న ప్ర‌ధాని మోడీ.. ఆయ‌న పార్టీ బీజేపీలు ప్ర‌జ‌లను చేరువ చేసుకునేందుకు అన్ని రూపాల్లోనూ వ్యూహాలు రెడీ చేస్తుంది. ఇలానే అంద‌రూ అనుకున్నారు. ఈ క్ర‌మంలో బారీ ఎత్తున ఉచితాలు ఇచ్చేందుకు.. పేద‌ల‌ను, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని లెక్క‌లు వేసుకున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ …

Read More »

నిన్న రాళ్ల దాడి,  నేడు విమర్శల దాడి

ప్ర‌స్తుతం రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను కుదుపుగా మారిన సీఎం జ‌గ‌న్‌పై రాళ్ల దాడి.. ఔను ఒక‌టి కాదు.. ఆయ‌న‌పై రెండు ద‌ఫాలుగా రాళ్లు ప‌డ్డాయి. ఒక‌టి గ‌జ మాల వేస్తున్న స‌మ‌యంలో త‌ర్వాత‌.. కొంత దూరం వెళ్లిన త‌ర్వాత‌.. ఈ రెండు దాడుల్లో మొద‌టి దాన్ని లైట్ తీసుకున్నారు. దండ‌లో ఏదో త‌గిలి ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ.. త‌ర్వాత‌.. గ‌ట్టిగానే రాయి నేరుగా వ‌చ్చి త‌గిలింది. దీంతో సీఎం జ‌గ‌న్ …

Read More »

జనసేన పార్టీకి ఓ ట్రబుల్ షూటర్ కావలెను.!

ఏ రాజకీయ పార్టీకి అయినా ట్రబుల్ షూటర్ తప్పనిసరి.! అధినేత కనుసన్నల్లో, అధినేత ఆదేశాల్ని తు.చ. తప్పకుండా పాటించేలా ఆ ట్రబుల్ షూటర్ పనిచేయాల్సి వుంటుంది. పార్టీలో ఎక్కడన్నా ఏదన్నా సమస్య వస్తే, అధినేత వరకూ ఆ సమస్య వెళ్ళకుండా పరిష్కరించగలిగేంత చాతుర్యం ఆ ట్రుబల్ షూటర్‌కి వుండి తీరాలి. ఔను, జనసేన పార్టీకి ఇప్పుడు ఖచ్చితంగా ఓ ట్రబుల్ షూటర్ అవసరం.! ఎన్నికల వేళ టిక్కెట్ల పంచాయితీ నేపథ్యంలో, …

Read More »

  పులివెందుల‌లో ష‌ర్మిల‌కు హ్యూజ్ రెస్పాన్స్‌

రోజురోజుకూ ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌వుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడూ మాటల్లో రాటుదేలుతున్నారు. పులివెందుల గ‌డ్డ మీద నిల‌బ‌డి సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆమె పాల్గొన్న పులివెందుల స‌భ‌కు వ‌చ్చిన హ్యూజ్ రెస్పాన్స్ చూసి వైసీపీ నాయ‌కుల‌కు గుండె ద‌డ పుట్టింద‌నే టాక్ వినిపిస్తోంది. ఎంత‌గా అడ్డుకున్నా, వెళ్లొద్ద‌ని వైసీపీ నాయ‌కులు చెప్పినా లెక్క‌చేయ‌ని ప్ర‌జ‌లు ష‌ర్మిల స‌భ‌కు …

Read More »

ఫోన్ ట్యాపింగ్ చుట్టూ పాలిటిక్స్‌

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో దేశ‌మంత‌టా రాజ‌కీయ వేడి రాజుకుంది. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా ఉండ‌టంతో ఇక్క‌డ ఆ హీట్ ఇంకా ఎక్కువ‌గానే ఉంది. మ‌రోవైపు తెలంగాణ‌లోనూ పార్ల‌మెంట్ స్థానాల్లో ఆధిప‌త్యం కోసం కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీ ఢీ అంటే ఢీ అన‌డంతో పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం చుట్టూనే తిరుగుతోంద‌నే చెప్పాలి. గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి మ‌ద్ద‌తుగా, ప్ర‌త్య‌ర్థి నాయ‌కుల‌ను దెబ్బ‌కొట్టేందుకు బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కుట్ర‌కు తెర‌లేపింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో విచార‌ణ కొన‌సాగుతోంది.

Read More »

‘జ‌గ‌న్ ఈ రోజు నాలుగు టీవీలు ప‌గ‌ల‌గొడ‌తాడు’

చంద్రబాబు స్పీచుల్లో మొత్తం మారిపోయింది. గతంలో చెప్పిందే చెప్పి బోర్ కొట్టించే చంద్రబాబు… ఇపుడు ప్రతి చోటా కొత్త సబ్జెక్టు, కొత్తపంచులతో అలరిస్తున్నారు. ఈమార్పుపై కేడర్ ఫుల్ హ్యాపీ. విశ్లేషకులు కూడా చంద్రబాబులో రావల్సిన మార్పు ఇదే అంటున్నారు. తాజాగా ఈరోజు రెండు మూడు చోట్ల చంద్రబాబు మాట్లాడితే అన్ని చోట్లా సబ్జెక్ట్ మారింది. ఉదాహరణకు ఒక చోట బాబు మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ ఈ రోజు నాలుగు టీవీల‌ను ప‌గ‌ల‌గొడ‌తాడ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. కూట‌మి పార్టీల ఉమ్మ‌డి స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాల‌ను చూసి.. జ‌గ‌న్‌కు నిద్ర ప‌ట్ట‌డం లేద‌న్నారు. రాజ‌ధాని ప్రాంత‌మైన తాడికొండ‌లో నిర్వ‌హించిన స‌భ‌కు జ‌నం పోటెత్తార‌ని.. వీరిని చూసి జ‌గ‌న్‌కు నిద్ర ప‌ట్ట‌ద‌ని, అదేవిధంగా ఫ్రెస్ట్రేష‌న్ త‌ట్టుకోలేక‌ నాలుగు టీవీల‌ను కూడా ప‌గ‌ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించారు.

Read More »

మేన‌త్త గుట్టు బ‌య‌ట‌పెట్టిన ష‌ర్మిళ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌గా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని న‌డిపించే వైఎస్ కుటుంబంలో అంత‌ర్గ‌త విభేదాలు తార స్థాయికి చేరుతున్నాయి. సీఎం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న సొంత సోద‌రి ష‌ర్మిళ‌, బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్ వివేకా హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన అవినాష్ రెడ్డిని జ‌గ‌నే కాపాడుతున్నాడ‌ని, వివేకాను చంపించిన అవినాష్‌కు మ‌ద్దతిస్తారా న్యాయం …

Read More »

సీఎం జగన్‌ పై రాళ్ల దాడి

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మేమంతా సిద్ధం  పేరుతో నిర్వ‌హిస్తున్న ఎన్నిక‌ల ప్ర‌చార బ‌స్సు యాత్ర‌లో క‌ల‌క‌లం రేగింది. తాజాగా ఈ యాత్ర విజ‌య‌వాడ శివారు ప్రాంత‌మైన సింగ్‌న‌గ‌ర్ మీదుగా సాగింది. ఇక్క‌డి పైపుల్ రోడ్డు సెంట‌ర్‌లో నాలుగు రోడ్ల కూడ‌లి వ‌ద్ద సీఎం జ‌గ‌న్ బ‌స్సుపై నుంచి ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ.. ముందుకు సాగుతున్నారు. అయితే.. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌పై రాయితో దాడి జ‌రిగింది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి బ‌లంగా విసిరిన రాయి.. దాదాపు 7 అడుగుల ఎత్తున ఉన్న సీఎం జ‌గ‌న్ నుదుటిపై తాకింది.దీంతో ఎడమ కంటి క‌నుబొమ ద‌గ్గర గాయ‌మైంది. కొద్దిగా ర‌క్తస్రావం కూడా జ‌రిగింది. అయితే.. భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లి రావ‌డంతో రాయిని ఎవ‌రు విసిరార‌నే విష‌యంపై అస్ప‌ష్ట‌త నెల‌కొంది. అయితే వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. వీరే విసిరారా?  లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే.. రాయితో దాడి అనంత రం.. కూడా జ‌గ‌న్‌త‌న యాత్ర‌ను కొన‌సాగించారు. బ‌స్సులోనే ఉన్న ప్ర‌త్యేక వైద్యుడు ఒక‌రు జ‌గ‌న్‌కు ప్రాథ‌మిక చికిత్స చేశారు. త‌ల‌కు బ్యాండ్ ఎయిడ్ వేశారు. అదేవిధంగా ఫ్లూయిడ్ అందించారు.అనంత‌రం.. యాత్ర‌ను కొన‌సాగించారు. అయితే.. గ‌త నెల‌లో కూడా సీఎం జ‌గ‌న్‌పై దాడి జ‌రిగింది. అప్ప‌ట్లో క‌ర్నూలులో నిర్వ‌హించిన యాత్ర‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చెప్పు విసిరాడు. అయితే.. ఇది జ‌గ‌న్‌కు తృటిలో త‌ప్పించి.. ప‌క్క‌న ప‌డింది. అప్ప‌ట్లోనూ దీనిపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే.. తాజాగా జ‌రిగిన రాయి ఘ‌ట‌న వెనుక రెండో వాద‌న కూడా వినిపిస్తోంది. రాయి కాద‌ని.. అది క్యాట్ బాల‌ని కొంద‌రు చెబుతున్నారు. ఇక‌, అంత పెద్ద సెక్యూరిటీ ఉండి కూడా.. ప‌ట్టించుకోలేదా? అనేది కూడా చ‌ర్చ‌నీయాంశం అయింది. దీని వెనుక నిజానిజాలు తెలియాల్సి ఉంది. కానీ, ఏలూరు దిశ‌గా జ‌గ‌న్ త‌న యాత్ర‌ను కొన‌సాగించారు.

Read More »

బాలయ్య వచ్చాడు.. కొట్టాడు

నందమూరి బాలకృష్ణ పబ్లిక్‌లోకి వచ్చాడంటే చాలు.. అక్కడ్నుంచి ఒక వార్త కామన్. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం.. వారి మీద బాయల్య చేయి చేసుకోవడం మామూలే. ఇప్పటికే ఇలా చాలాసార్లు జరిగింది. ఇంకో నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య బస్సు యాత్రకు రెడీ అయ్యారు. బాలయ్య అన్‌స్టాపబుల్ అని బస్సు మీద రాయించి.. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఆయన ఎన్నికల ప్రచారానికి రెడీ …

Read More »

అన్న‌కు షాకిచ్చి.. చెల్లికి జై కొట్టి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల దూసుకెళ్తున్నారు. క‌డ‌ప‌లో ప‌ర్య‌టిస్తూ స‌భ‌లో ప్ర‌సంగిస్తూ ప‌దునైన మాట‌ల‌తో సాగిపోతున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్ర‌జ‌లకు చేరువ చేస్తూనే.. మ‌రోవైపు పార్టీ బ‌లాన్ని కూడా పెంచే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ముఖ్యంగా అన్న జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పార్టీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, నాయ‌కులు కాంగ్రెస్‌లో చేరేలా ష‌ర్మిల ప‌టిష్ఠ‌మైన వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీ అసెంబ్లీ …

Read More »

వైఎస్ కుటుంబ ప‌రువును రోడ్డున ప‌డేస్తున్నారు..

క‌డ‌ప‌లో కొన్ని ద‌శాబ్దాలుగా పెంచుకున్న వైఎస్ కుటుంబం ప‌రువును ఆ ఇంటి ఆడ‌ప‌డుచులు.. వైఎస్ ష‌ర్మిల‌, సునీత‌లు రోడ్డున ప‌డేస్తున్నార‌ని.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, వివేకానంద‌రెడ్డిల సోద‌రి వైఎస్ విమ‌లారెడ్డి విమ‌ర్శించారు. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య విష‌యంపై త‌మ కుటుంబం చింతిస్తూనే ఉన్న‌ద‌న్నారు. అయితే.. దీనిని చిన్న‌వాడైన ఎంపీ అవినాష్‌పైకి నెట్టేసి.. హంత‌కుడు.. హంత‌కుడు అని ప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. దీనివ‌ల్ల రాష్ట్రంలో వైసీపీ స‌హా సీఎం జ‌గ‌న్‌పైనా ప్ర‌భావం ప‌డుతోంద‌ని, …

Read More »

గ్లాసును బకెట్ తన్నేస్తుందా ?

పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతుంది అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం నుండి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం శాసనసభ స్థానాల నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయాడు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గెలవడం తప్పనిసరి పరిస్థితి. అయితే రాజకీయాలు అంటేనే ఎత్తులు, పై ఎత్తులు. పిఠాపురం ఎన్నికల్లో పవన్ గెలుపుకు నవరంగ్ నేషనల్ …

Read More »