Political News

లోక‌ల్ వార్‌… వైసీపీ రెడీయేనా ..!

ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది. ముఖ్యంగా పంచాయతీ ల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ ఇచ్చేశారు. దీంతో స్థానిక సమరం ఇక ప్రారంభం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమరంలో ఎవరు విజేత అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవమే. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీనే స్థానికంగా కూడా విజయం దక్కించుకుంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయం. గ‌తంలోనూ ఇదే …

Read More »

సేమ టు సేమ్‌: క‌విత‌-ష‌ర్మిల‌… పొలిటిక‌ల్‌ బాధితులా..!

తెలంగాణకు చెందిన నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీకి తాజాగా రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత వ్యవహారం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఏపీకి చెందిన వైఎస్ షర్మిల విషయం కూడా తెర‌ మీదకు వచ్చింది. ఇద్దరూ ఫైర్ బ్రాండ్ నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రుల‌ కుమార్తెలు కావడం, ఇద్దరికీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావడం వంటివి చర్చనీయాంశంగా మారాయి. ఏపీలో షర్మిల, తెలంగాణలో కవిత ఇద్దరూ …

Read More »

సుగాలి ప్రీతి.. జ‌న‌సేన‌లో సునామీ ..!

కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి అనే విద్యార్థి 2017 లో అత్యాచారం, హత్యకు గురయ్యారు. ఇది జరిగిన‌ చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు రాజకీయంగా పెద్ద వివాదంగా మారుతోంది. ఈ కేసును విచారించి తమకు న్యాయం చేయాలని నిందితులను పట్టుకుని శిక్షించాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి దేవి కోరుతున్నారు. అయితే ఈ క్రమంలో జనసేన చుట్టూ రాజకీయాలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది ఎన్నికలకు ముందు చాలా ఆర్భాటంగా …

Read More »

చిక్కుల్లో టీడీపీ ఎమ్మెల్యే ద‌గ్గుబాటి!

అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైకోర్టు తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎందుకు అరెస్టు చేయకుండా నానుస్తున్నారు అంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి చేసిన విమర్శలు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై గతంలో హత్య కేసు నమోదయింది. ఈ కేసులో తన ప్రమేయం లేదని ఆయన చెబుతున్నప్పటికీ ఆధారాలు ఉన్నాయి …

Read More »

వైసీపీకి కార్య‌క‌ర్త‌లు.. దూర‌మా.. భార‌మా..?

వైసీపీలో కార్యకర్తలు కీలకమని, కార్యకర్తలను బలోపేతం చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి కార్యకర్తలకు ప్రాధాన్యం పెరుగుతుందని ఆ పార్టీ అధినేత జగన్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో కార్యకర్తలను దూరం చేసుకుని.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టి.. తాము ఓడిపోయామని ఆయన గతంలో ఒకటి రెండుసార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల‌ సెంట్రిక్‌గా వైసీపీ రాజకీయాలు సాగుతాయని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకు వచ్చి …

Read More »

టీడీపీపై రేవంత్ ఇంటరెస్టింగ్ కామెంట్స్!

ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా, గ్రాండ్ ఓల్డ్ పార్టీ కీలక నేతగా దాదాపుగా స్థిరపడిపోయారు. అయితే ఎంత కాంగ్రెస్ పార్టీ నేత అయినా రేవంత్ కూడా గతంలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కొనసాగిన నేతే కదా. టీడీపీలో చాలా కాలం పాటు కీలక హోదాలో పనిచేశారు. తాజాగా తెలంగాణ సీఎం హోదాలో తన సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా వేమూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ గురించి అత్యంత ఆసక్తికర …

Read More »

మీ పంచాయతీల్లోకి నన్ను లాగొద్దు: రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయ్యారని మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. వారిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని, కాళేశ్వరం అవినీతి అంటూ కేసీఆర్ పై సీబీఐ విచారణకు పురిగొల్పారని ఆరోపించారు. అందుకే, హరీష్ రావు పేరును రేవంత్ రెడ్డి ప్రస్తావించడం లేదని, కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ ను మాత్రమే రేవంత్ విమర్శిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే కవిత …

Read More »

రేవంత్ రెడ్డికి హరీష్ లొంగిపోయారు: కవిత

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీష్ రావు పాత్ర ఉందంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి హరీష్ రావు, సంతోష్ లపై కవిత షాకింగ్ ఆరోపణలు చేశారు. పార్టీలో లబ్ధిపొందాలని అనుకుంటున్న కొందరితో కలిసి హరీష్ రావు కుట్ర పన్నుతున్నారని, కేసీఆర్ కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను విడగొట్టి పార్టీని హస్తగతం …

Read More »

బ్రేకింగ్… ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా

తెలంగాణ రాజకీయాల్లో వరుసగా బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే సమయంలో పార్టీ నుంచి దక్కిన శాసనమండలి సభ్యత్వానికి (ఎమ్మెల్సీ) రాజీనామా చేశారు. అది కూడా స్పీకర్ ఫార్మాట్ లో ఆమె రాజీనామా చేయడం గమనార్హం. ఈ మేరకు పార్టీ నుంచి తనను సస్పెండ్ …

Read More »

కేటీఆర్ పై కవిత షాకింగ్ వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పై, మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన కవితపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే సస్పెన్షన్ అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి హరీష్ రావుతో పాటు తన సోదరుడు కేటీఆర్ ను కూడా …

Read More »

నేటి త‌రం: బాబు నుంచి నేర్వాల్సిందిదే.. !

“చంద్ర‌బాబు ఓ డిక్ష‌న‌రీ. ఆయ‌న నుంచి మ‌నం చాలానేర్చుకోవాలి.” – ఈ ఏడాది టీడీపీ ఘ‌నంగా నిర్వహించిన ప‌సుపు పండుగ మ‌హానాడులో ఓ నాయ‌కుడు చేసిన వ్యాఖ్య ఇది. నిజ‌మే.. చంద్ర‌బాబు ఒక డిక్ష‌న‌రీనే. కానీ, త‌ర‌చి చూస్తే.. ఆయ‌న ఓ గ్రంధం!!. రాజ‌కీయంగా ఏం చేయాలి.. ఏం చేయ‌కూడ‌దు.. ఎలా ఎద‌గాలి.. ఎక్క‌డ త‌గ్గాలి.. ఎక్క‌డ నెగ్గాలో ప‌ట్టి చూపించే పెద్ద బాలశిక్ష కూడా!. ముఖ్యంగా నేటి త‌రం …

Read More »

బ‌ఫే భోజ‌నం ఎంతో.. ఎరువులు కూడా అంతే!

ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ట్టే .. రైతులు యూరియా, ఎరువుల సమ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. చాలా జిల్లాల్లో అయితే.. అస‌లు యూరియా కొర‌త ఆకాశానికి అంటుతోంది. దీంతో రైతులు ల‌బోదిబోమంటున్నారు. రాత్రి పూట కూడా ఎరువుల కేంద్రాల వ‌ద్దే ప‌డిగాపులు కాస్తున్నారు. అక్క‌డే ప‌డుకుని నిద్ర చేస్తున్నారు. ఇది వాస్త‌వం. దీనిపై సీఎం చంద్ర‌బాబు కూడా రెండు సార్లు …

Read More »