ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ ప్రభుత్వ మద్యం దుకాణాలే కావడం.. ఎక్కడా ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటినివినియోగించకపోవడం ద్వారా భారీ ఎత్తున నగదు అక్రమాలు జరిగాయని అప్పట్లోనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిని కూటమి సర్కారు వచ్చాక దుమ్ముదులిపే ప్రయత్నం చేసింది. తాజాగా కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..ఉరఫ్ రాజ్ కసిరెడ్డిని పోలీసులు మంగళవారం సాయంత్రం వరకు …
Read More »మోడీకి బాబు గిఫ్ట్ : ఆ రాజ్యసభ సీటు బీజేపీకే
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు ప్రాజెక్టులు.. ఇతర కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఆయనకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం నుంచిఫోన్ వచ్చింది. వాస్తవానికి షెడ్యూల్లో ఈ కార్యక్రమం లేదు. అయినప్పటికీ..చంద్రబాబుకు స్వయంగా షా కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఆయన …
Read More »అమరావతిలో అన్నగారి విగ్రహం.. ఇదిగో ఇలా..!
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యం లో తెలుగు వారి ఆరాధ్య కథానాయకుడు.. పేదల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న అన్నగారు.. ఎన్టీ ఆర్ విగ్రహాన్ని దేశంలోనే అత్యంత ఎత్తయిన రీతిలో.. రికార్డు స్థాయిలో నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి కొన్ని ఫొటోలను ప్రభుత్వం విడుదల చేసింది. విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తాడేపల్లి …
Read More »జగన్ విధానాలు మార్చుకోవాల్సిందేనా…
మూడు రాజధానుల నుంచి మద్యం వరకు.. వలంటీర్ వ్యవస్థ నుంచి సచివాలయాల వరకు.. వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగాలు వికటించిన విషయం తెలిసిందే. ఇవే.. ఆయనను నిలువునా ముంచాయన్నది మేధావుల నుంచి విశ్లేషకుల వరకు చెబుతున్న మాట. తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అన్నట్టుగా ఆయన అప్పట్లో వ్యవహరించారన్న విమర్శలు తెలిసిందే. ఏరాష్ట్రంలోనూ లేని విధంగా మూడురాజధానులు తెచ్చారు. దీనిపైకేంద్రం కూడా విస్మయం వ్యక్తం చేసింది. ఇక, …
Read More »బాబు గారూ.. మూల్యం చెల్లించక తప్పదు: అంబటి రాంబాబు
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీప్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై విపక్ష వైసీపీ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టును ఖండించడంతో పాటుగా.. ఆయనను కూటమి సర్కారే కక్షపూరితంగా అరెస్టు చేయించిందని సంచలన ఆరోపణ చేశారు. అంతేకాకుండా ఈ అరెస్టులకు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ అంబటి ఏకంగా టీడీపీ అధినేత, సీఎం నారా …
Read More »జగన్ గ్రాఫ్ వర్సెస్ బాబు గ్రాఫ్.. ఎలా ఉన్నాయ్ ..!
నాయకులన్నాక.. ప్రజల మధ్య చర్చ ఉంటుంది. వారిచ్చే మార్కులు కూడా అవసరం. ఒకప్పుడు నాయ కులు.. ప్రజల ఆలోచనలు వేరేగా ఉండేవి. ఎన్నికలకు ఏడాది ముందు నాయకులకు ప్రజల్లో మార్కులు ఎలా ఉన్నాయనే చర్చ ఉండేది. పార్టీలు కూడా..ఎన్నికలకు ముందు అప్రమత్తం అయ్యేవి. కానీ.. ఇప్పుడు అలా కాదు. ఎన్నికలకు కనీసం మూడేళ్ల నుంచే పార్టీలు, నాయకులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రజల్లో తమ గ్రాఫ్ పడిపోకుండా పెంచుకునే వ్యూహాలతో …
Read More »తమ్ముడిపైనే బాబుకు పిర్యాదు చేసిన కేశినేని నాని
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని మంగళవారం ఓ కీలక అడుగు వేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తనను ఓడించిన తన సోదరుడు, విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్నిపై ఏకంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకే ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం పొద్దున్నే సోషల్ మీడియాలో నాని ఓ సుదీర్ఘ ట్వీట్ ను పోస్ట్ చేశారు. …
Read More »ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి నిందితుడిగా
ఏపీలో మంగళవారం ఉయదం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పి.సీతారామాంజనేయులు(పీఎస్ఆర్ ఆంజనేయులు) అరెస్టు అయ్యారు. ఏపీ పోలీసులు మంగళవారం ఉదయం హైదరాబాద్ బేగంపేట పరిధిలోని పీఎస్ఆర్ ఇంటిలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించారు. మంగళవారం సాయంత్రానికి గానీ పీఎస్ఆర్ ను విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీకి …
Read More »అనిల్.. రెంటికీ చెడిపోయారా? ఊసేలేదు!
రాజకీయాల్లో తొడ కట్టడం విమర్శలకు గుర్తించడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అయితే అందరూ అలా ఉంటారని కాదు కానీ కొంతమంది నాయకులు తొడగొట్టి రాజకీయాల్లో శఫదాలు చేసిన వారు సవాళ్లు చేసిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ కీలకమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నోరు విప్పితే విమర్శలు వివాదాలు కేంద్రం గా …
Read More »బ్రేకింగ్ : కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ పోలీసులు
ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్న మద్యం కుంభకోణంలో సోమవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అన్నీ తానై వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి సోమవారం పోలీసులకు పట్టుబడిపోయారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత గోవా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన కసిరెడ్డిని…విమానాశ్రయం బయటే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తాను మంగళవారం విచారణకు హాజరు అవుతున్నానని, ఇప్పుడెందుకు అదుపులోకి తీసుకుంటారని …
Read More »రఘురామ వర్సెస్ జగన్.. ఇన్ని ట్విస్టులా..!
వైసీపీ నుంచి బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజు.. టీడీపీలో చేరి.. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఉండినియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం కూడా దక్కించుకున్నారు. అయితే.. అసలు వైసీపీ నుంచి ఆయన బయటకు ఎందుకు వచ్చారన్న విషయంపై ఇప్పటికీ అనేక చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. రఘురామ ఎంపీగా ఉన్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. తర్వాత రివర్స్ అయ్యారు. నిరంతరం.. జగన్‌పై ఎద్దేవా చేస్తూ.. వ్యాఖ్యలు సంధించారు. అయితే.. …
Read More »ఇది నిజంగా సీఎం రేవంత్ `రికార్డే`!
తెలంగాణ గొప్పతనాన్ని దశదిశలా చాటుతామని చెప్పిన వారు… ఏం చేశారో.. ఏమో తెలియదుకానీ.. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం నిజంగానే ఆ పనిచేశారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆయన.. తెలంగాణ కీర్తిని అక్కడ రెపరెపలాడించారు. జపాన్‌లో ఏటా.. ఏప్రిల్ మధ్య వారం నుంచి `ఒసాకా` ఎక్స్‌పో నిర్వహిస్తారు. ఇది చాలా ప్రతిష్టాత్మకం. పెద్ద పెద్ద కంపెనీలే కాదు.. పెద్ద పెద్ద దేశాలకు చెందిన వారే పాల్గొంటారు. ఇప్పటి వరకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates