Political News

ఏపీ హింస‌.. నిప్పులు చెరిగిన ఈసీ..

రాష్ట్రంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత చెల‌రేగిన తీవ్ర హింస‌ పై కేంద్ర ఎన్నికల సంఘం నిప్పులు చెరిగింది. ఈ దాడుల‌ను ఎందుకు నిలువ‌రించ‌లేక పోయారని.. రాష్ట్ర ప్ర‌భు త్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, డీజీపీ హ‌రీష్‌కుమార్ గుప్తాల‌ను నిల‌దీసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. వారు ఇచ్చిన వివ‌ర‌ణ‌తో ఏ మాత్రం సంతృప్తి చెంద‌లేదు. దీంతో తానే స్వ‌యంగా ఈ హింస‌పై చ‌ర్య‌లు చేప‌ట్టింది. …

Read More »

151 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తాం..ఐ-ప్యాక్ తో జగన్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం జగన్ తొలిసారి బయటకు వచ్చారు. విజయవాడలోని ఐ-ప్యాక్ ఆఫీసును జగన్ సందర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ ప్రతినిధులతో జగన్ చిట్ చాట్ నిర్వహించారు. వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన బృందానికి జగన్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు …

Read More »

ఏపీలో ఎవ‌రు గెలుస్తున్నారు? కేటీఆర్ స‌మాధానం ఇదే!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌.. తాజాగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితంపై స్పందించారు. ఇంకా ఫ‌లితం రాక‌పోయినా.. ఏపీలో ఏం జ‌రుగుతుంది? ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? అనే అంశాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఎన్డీయే కూట‌మి(టీడీపీ+జ‌న‌సేన‌+బీజేపీ) అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఢిల్లీలో చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల అనంత‌రం.. కేటీఆర్‌ను తెలంగాణ మీడియా ఇదే అంశంపై ప్ర‌శ్నించింది. …

Read More »

ఏపీ గురించి దేశం బాధ‌ప‌డుతోంది..

ఏపీలో ఎన్నిక‌ల త‌ర్వాత‌.. చెల‌రేగిన హింస‌పై జాతీయ స్థాయిలో చ‌ర్చ‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. దీనిలో కీల‌క‌మైన అత్యంత స‌మ‌స్యాత్మ‌క‌మైన జిల్లాలు, న‌గ‌రాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు కూడా ఉన్నాయి. క‌ర‌డుగ‌ట్టిన మావోయిస్టుల అడ్డాల్లోనూ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. అదేవిధంగా జ‌మ్ము క‌శ్మీర్‌లోని శ్రీన‌గ‌ర్‌(అత్యంత స‌మ‌స్యాత్మ‌క ప్రాంతం)లోనూ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌లో నాలుగో ద‌శ‌లో జ‌రిగిన పోలింగ్లో 3 వేల పైచిలుకు …

Read More »

సీఎం జ‌గ‌న్ ఇంట్లో రాజ‌శ్యామ‌ల యాగం..!

ఏపీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉంటే తాడేప‌ల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజ‌శ్యామల యాగం నిర్వ‌హించారు. అయితే.. ఇది 41 రోజుల పాటు సాగడం విశేషం. కానీ.. ఎక్క‌డా బ‌య‌ట‌కు కూడా పొక్క‌కుండా మొత్తం క్ర‌తువును పూర్తి చేశారు. చివ‌రి రోజు పూర్ణాహుతి సంద‌ర్భంగా మాత్ర‌మే మీడియాకు ఫొటోలు విడుద‌ల చేశారు. బుధ‌వారం చివ‌రి రోజు నిర్వ‌హించిన పూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ ఒక్క‌రే ఈ యాగంలో పాల్గొని క్ర‌తువులు పూర్తి …

Read More »

కాయ్ రాజా కాయ్ : లక్షకు 5 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది. ఆంధ్రాలో శాసనసభ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా ? వైసీపీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా ? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? ఎవరు గెలుస్తారు ? ఎంత మెజారిటీ వస్తుంది ? అన్న ప్రాతిపదికన …

Read More »

ఉండిలో త్రిముఖ పోరు.. ర‌ఘురామ ఫేట్ ఎలా ఉంది?

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోరులో అంద‌రినీ ఆక‌ర్షించిన ఐదు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేసిన పిఠాపురం, నారా లోకేష్ బ‌రిలో ఉన్న‌ మంగ‌ళ‌గిరి, చంద్ర‌బాబు పోటీ చేసిన కుప్పం, కాంగ్రెస్ పార్టీ చీఫ్ ష‌ర్మిల పోటీ చేసిన క‌డ‌ప పార్ల‌మెంటు స్థానంతోపాటు.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. టీడీపీ నాయ‌కుడు క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పోటీ చేసి ఉండి అసెంబ్లీ స్థానం. ఈ ఐదు స్థానాల‌పైనా.. ఎక్కువ …

Read More »

మా కోసం ప్ర‌చారం చేస్తారా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. ప్ర‌ధాని మోడీ బిగ్ ఆఫ‌ర్ ఇచ్చారు. మోడీ వ‌రుస‌గా మూడోసారి కూడా.. ప‌ర‌మ ప‌విత్ర కాశీ నియోజ‌క‌వ‌ర్గం(వార‌ణాసి) నుంచి పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నామినేష‌న్ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో కూట‌మి పార్టీల‌కు కూడా ఆయ‌న ఆహ్వానం పంపించారు. దీంతో చంద్ర‌బాబు కూడా అక్క‌డ‌కు వెళ్లారు. నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీని చంద్ర‌బాబు ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ స‌మ‌యంలో …

Read More »

పోటెత్తిన ఓట‌రు 81.6 శాతం ఓటింగ్‌.. ఎవ‌రికి ప్ల‌స్‌?

ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోలింగ్ శాతం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు సాగింది. ఇది నిర్ణీత స‌మ‌యం క‌న్నా 1గంట ఎక్కువ‌. ఇక‌, ఇత‌ర 47 పోలింగ్ బూతుల్లో రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు, 34 చోట్ల రాత్రి 2 గంట‌ల వ‌ర‌కు కూడా జ‌రిగింది. దీంతో పోలింగ్ శాతం 70 అనుకున్న‌ది కూడా.. …

Read More »

కేజ్రీ బెయిల్ లాభమా ? నష్టమా ?

మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బెయిల్ మీద బయటకు రావడం ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నది. ఆప్‌ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాలలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదరవుతాయి అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు. ఇండియా కూటమి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా కేజ్రివాల్ ఈ రోజు లక్నో, 16న జమ్‌షెడ్‌పూర్‌, …

Read More »

బీజేపీకి మ్యాజిక్‌ ఫికర్‌ !

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఏడు దశల పోలింగ్ లో నాలుగు దశలు పూర్తయ్యాయి. జూన్ 1తో ఏడో దశ పోలింగ్ ముగియనున్నది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే 400 లోక్ సభ స్థానాలు లక్ష్యంగా పెట్టుకుని విపరీతంగా చెమటోడుస్తున్న బీజేపీ పార్టీ ఈ సారి అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితి లేదన్న వార్తలు కమలనాథులను కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల …

Read More »

హింసపై కదిలిస్తున్న రొంపిచెర్ల వాసి ఆవేదన

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో గతంలో ఎన్నికలు అంటే గ్రామాలు రణరంగంగా మారిపోతాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలలో నెలకొన్న హింసను చూసి గతంలో అనుభవాలను నెమరు వేసుకుంటూ రాసిన కథనం అందరినీ కదిలిస్తుంది. “ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరుగుతున్న అల్లర్లు చూస్తే మా ఊరి గతం గుర్తుకొస్తోంది. 1995-96 సమయంలో …

Read More »