ఔను.. మీరు చదివింది నిజమే. ప్రస్తుతం ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ తర్వాత ఓ గొప్ప అవకాశాన్ని దక్కించుకున్న మంత్రిగా నారా లోకేష్ రికార్డు సృష్టించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఘనంగా నిర్వహించే కార్యక్రమానికి నారా లోకేష్‌కు ఆహ్వానం అందింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏటా స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం (ఎస్‌వీపీ)ని ఘనంగా నిర్వహిస్తుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులను ఏరికోరి ఆహ్వానిస్తుంది. వారి స్ఫూర్తిని తమ …
Read More »జగన్‌కు అయ్యన్న అప్పీల్.. ఏమన్నారంటే!
వైసీపీ అధినేత, ఏపీ విపక్ష (ప్రధాన కాదు) నాయకుడు జగన్‌కు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలక సూచన చేశారు. అసెంబ్లీకి రావాలని ఆయనను మరోసారి కోరారు. అంతేకాదు.. సభకు వస్తే మాట్లాడే సమయంలో ఇస్తామన్నారు. సభకు రాకుండా ప్రెస్ మీట్లు పెట్టే సంప్రదాయాన్ని సృష్టించవద్దని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదని వ్యాఖ్యానించారు. వచ్చే నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని, …
Read More »జాతీయ పార్టీగా జనసేన.. రీజనేంటి?
జనసేన పార్టీని జాతీయ పార్టీగా మారుస్తానంటూ ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ప్రకటించారు. వచ్చే 10 సంవత్సరాల్లో అన్నీ అనుకూలిస్తే జనసేన జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే అసలు జాతీయ పార్టీగా ఆవిర్భవించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వచ్చిందీ ఆ ఆలోచన? అనేది కీలక విషయం. ప్రస్తుతం ఉన్న టీడీపీ కూడా జాతీయ పార్టీగానే నమోదైంది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, …
Read More »ట్రెండ్ మార్చిన చంద్రబాబు.. ఎక్కడికెళ్తే అక్కడే!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ట్రెండ్ మార్చారా? ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. గతంలో 2014-19 మధ్య కూడా ఆయన ప్రజల మధ్య తిరిగారు. కానీ, భద్రతా పరమైన కారణాలు లేదా.. పాలనా పరమైన ఒత్తిడి నేపథ్యంలో ఆయన ఎక్కడికి వెళ్లినా.. అక్కడి పనులు చూసుకుని వెనుదిరిగేవారు. ప్రజలతో కేవలం ముచ్చట్ల వరకే పరిమితం అయ్యేవారు. కానీ, ఈ ఏడు …
Read More »విశాఖలో అంతా ఓకే కదా.. బాబు ఆరా..!
విశాఖ రాజకీయాలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గత రెండు మాసాల కిందట విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌ను కూటమి కైవసం చేసుకున్న దరిమిలా సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవహారాలు, రాజకీయాలపై జిల్లాకే చెందిన పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావుతో అంతర్గతంగా చర్చించారు. విశాఖలో పర్యటించిన చంద్రబాబు నగరానికి సంబంధించిన డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులతో ఆయన అంతర్గతంగా చర్చించారు. ఈ చర్చల్లో …
Read More »జగన్ పాలిటిక్స్.. అయితే ఏంటి..!
వైసీపీ అధినేత జగన్ పాలిటిక్స్ భిన్నంగా ఉన్నాయి. ఆయన ఏం జరిగినా భిన్నంగా ఆలోచన చేస్తారు. ఏ విషయాన్ని కూడా ఆయన సీరియస్‌గా తీసుకోరు. ఇది మంచిది కాదు. కొంపతీసి రాసేస్తారా ఏంటి? రాయమాకండి! అని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు. నిజమే! జగన్ పాలిటిక్స్ అంతే అని మిగిలిన నాయకుల మాట కూడా. ఆది నుంచి ఏం …
Read More »జగన్ విమానం ఎక్కేసరికి నీళ్లన్నీ ఇంకిపోయాయి: చంద్రబాబు
నా నియోజకవర్గంలో వారు (వైసీపీ) పాగా వేయాలని అనుకున్నారు. అందుకే సినిమా సెట్టింగులు వేసి కుప్పం నియోజకవర్గంలో నీరు పారించామని డ్రామాలు ఆడారు. ఎక్కడి నుంచో నీరు తీసుకువచ్చి ఇక్కడ పారించి రిబ్బన్లు కట్ చేశారు. కానీ, జగన్ తిరిగి విమానం ఎక్కేసరికి ఆ నీళ్లన్నీ ఇంకిపోయాయి. ఇదీ ఆనాటి పాలన. కానీ ఇప్పుడు వరద ప్రవాహం మీరు చూస్తున్నారు. మనసు పెట్టి పనులు చేస్తున్నాం. కృష్ణమ్మను తీసుకువచ్చాం. రైతులకు, …
Read More »దసరా తర్వాత.. పవన్ `త్రిశూల్`!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. దసరా పండుగ తర్వాత.. జనసేన తరఫున `త్రిశూల్` కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న `సేనతో సేనాని` కార్యక్రమంలో చివరి రోజు శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తు పార్టీ వ్యూహాలను ఆవిష్కరించారు. విశాల దృక్ఫథం ఉన్న యువతకు పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. పదవుల కోసం, …
Read More »సభలో సహకరిస్తాం కానీ: కేటీఆర్ షరతులు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము సభలో సహకరిస్తామని చెప్పారు. ఏ విషయంపైనైనా అర్థవంతమైన చర్చలు చేపట్టేందుకు పూర్తిగా సహకారం ఉంటుందని తెలిపారు. అయితే సభ విషయంలో తాము సూచించినట్టు నిర్ణయాలు తీసుకోవాలని షరతులు విధించారు. సభను కేవలం మొక్కుబడిగా నాలుగు రోజులు నిర్వహించి చేతులు దులుపుకోవద్దన్నారు. కనీసం రెండు …
Read More »అజారుద్దీన్ ఒకటి తలస్తే మరొకటైందే!
కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెట్ మహమ్మద్ అజారుద్దీన్ ఒకటి తలస్తే మరొకటైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో ఆయన మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. ఇక్కడి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ టికెట్‌పై అజారుద్దీన్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. రెండు నెలల …
Read More »సొంతవాళ్లనే హతమార్చిన డీఎన్ఏ మాది కాదు: కోటంరెడ్డి
వైసీపీ మాజీ నాయకుడు, ప్రస్తుత టీడీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ సీఎం జగన్‌పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత వాళ్ళని చంపించే డీఎన్ఏ తమకు లేదన్నారు. ఆస్తులు, అంతస్థుల కోసం.. తండ్రి సొమ్ములో వాటాల కోసం.. తోడబుట్టిన వారిని వేధించి.. తరిమి కొట్టే తత్వం కూడా తనకు లేదని వ్యాఖ్యానించారు. తాను అనేక ఇబ్బందులు పడి రాజకీయాల్లో ఉన్నానని.. ఇబ్బందులు.. …
Read More »బీసీల రిజర్వేషన్లపై రేవంత్ సంచలన నిర్ణయం
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వ్యవహారం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితి కోటా వంటి అంశాలపై గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆ విషయాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates