Political News

వాళ్లు కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్లే కదా: ర‌ఘురామ సీరియ‌స్

అమ‌రావ‌తిలో మ‌హిళ‌ల‌పై సాక్షి టీవీలో జ‌రిగిన చ‌ర్చ‌.. ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యాత‌గా ఉన్న కృష్ణంరాజు చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌లు ఉద్య‌మిస్తున్నారు. ఈ వేడి త‌గ్గ‌క‌పోగా.. మ‌రింత పెరుగుతోంది. తాజాగా ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణరాజు సీరియ‌స్ అయ్యారు. “ఆ వ్యాఖ్య‌లు చేసిన వాళ్లు కూడా ఒక త‌ల్లికి పుట్టిన వాళ్లే క‌దా!” అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న డిప్యూటీ స్పీకర్ …

Read More »

సాక్షి ఎఫెక్ట్‌: టీవీల‌ను శుద్ధి చేసుకుంటున్నారు!

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత మీడియా చానెల్ సాక్షిలో అమ‌రావ‌తి రాజ‌ధానిపై ఓ రాజ‌కీయ వ్యాఖ్యాత‌, జ‌ర్న‌లిస్టు.. చేసిన అత్యంత జుగుప్సాక‌ర వ్యాఖ్య‌లు.. ప్ర‌జ‌ల్లో ఎంత తీవ్రమైన ఆవేద‌న క‌లిగిస్తోందో.. వారి గుండెలు ఎలా రగిలిపోతున్నాయో.. చెప్పేందుకు.. తాజాగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అమ‌రావ‌తిలో ఉన్న‌వారంతా.. ‘ఆ త‌ర‌హా’ మ‌హిళ‌లేన‌ని స‌ద‌రు వ్యాఖ్యాత కామెంట్లు చేయ‌డం.. దానిని పూర్తిగా ఖండించ‌కుండా.. యాంక‌ర్ వ్య‌వ‌హ‌రించ‌డంపై ప్ర‌జ‌లు నిప్పులు …

Read More »

బిగ్ బ్రేకింగ్: సాక్షి యాంకర్ కొమ్మినేని అరెస్టు!

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, సాక్షి మీడియాలో ఇన్‌పుట్ ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్న యాంక‌ర్‌.. కొమ్మినేని శ్రీనివాస‌రావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసానికి సోమ‌వారం ఉద‌యం వెళ్లిన పోలీసులు.. ఆయ‌న‌ను అరెస్టు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే ప్ర‌త్యేక వాహ‌నంలో ఆయ‌న‌ను విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. అయితే..అరెస్టు సంద‌ర్భంగా కొమ్మినేనికి.. ఏపీ పోలీసుల‌కు వాగ్వాదం జ‌రిగింది. త‌న‌ను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల‌ని.. ఏపీ పోలీసుల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. అయితే.. అదంతా …

Read More »

అమ‌రావ‌తి నిర్మాణమూ బాబుకు సంక‌ట‌మే.. ఏంటి క‌ష్టాలు…!

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాన్ని భుజాల‌కెత్తుకున్న చంద్ర‌బాబు దీనిని 2027 నాటికి పూర్తి చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన భ‌వ‌నాల‌ను.. ముఖ్య నిర్మాణాల‌ను పూర్తి చేసి.. 2029 ఎన్నిక‌ల్లో అమ‌రావ‌తిని ప్ర‌ధాన అజెండా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌ధానంగా న‌వ న‌గ‌రాల‌ను పూర్తిచేయాల‌ని అహోరాత్రులు శ్ర‌మిస్తున్నారు. ఈ విష‌యాన్ని ఇటు పార్టీలోను.. అటు ప్ర‌భుత్వంలోనూ చంద్ర‌బాబు చ‌ర్చిస్తూనే ఉన్నారు. త‌న ప్ర‌ణాళిక‌ల‌ను వారికి వివ‌రిస్తున్నారు. అయితే.. వీటిని పార్టీలో నాయ‌కులు …

Read More »

అంతా అయ్యాక…వైసీపీలో సస్పెన్షన్ల జాతర!

అదేదో సామెత చెప్పినట్టు… దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయట. అంతా అయిపోయింది. వైసీపీ చేతిలోని చాలా స్థానిక సంస్థలు కూటమి పార్టీల పరం అయిపోయాయి. ఇదంతా జరిగి నెలలు గడుస్తోంది. జనం కూడా ఈ విషయాలను మరిచిపోయారు. మరి ఈ విషయాలను జనానికి మళ్లీ గుర్తు చేయాలనుకున్నారో, ఏమో తెలియదు గానీ… ఆయా స్థానిక సంస్థల్లో తమకు జెల్ల కొట్టిన నేతలపై వైసీపీ తాజాగా సస్పెన్షన్ వేటు …

Read More »

ప్రభాకర్ రావు నోరిప్పితే బీఆర్ఎస్ కు బ్యాండ్ బాజానే!

తెలంగాణలో పెను చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా భావిస్తున్న మాజీ పోలీసు అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 15 నెలల తర్వాత అమెరికా నుంచి ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ కేసు వెలుగు చూసిన వెంటనే ముందు జాగ్రత్త చర్యగా అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావు… ఈ కేసు …

Read More »

మూతి బిగింపులు-అల‌క‌లు: టీ-కాంగ్రెస్‌లో బుజ్జ‌గింపుల ప‌ర్వం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయ‌కులు అల‌క‌బూనారు. తాజాగా మంత్రి వ‌ర్గ కూర్పు పూర్త‌యిన విష‌యం తెలిసిందే. ఎంతో మంది ఆశ‌లు పెట్టుకున్నా.. చివ‌ర‌కు ప‌ద‌వులువారిని వ‌రించ‌లేదు. ఢిల్లీ టు ఢిల్లీ అన్న‌ట్టుగా నాయ‌కులు ప్ర‌ద‌క్షిణ‌లు చేసినా వారిని అదృష్టం వ‌రించ‌లేదు. దీంతో నాయ‌కులు మూతి బిగించారు. మ‌రికొంద‌రు అల‌క‌పాన్పులెక్కారు. దీంతో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మానికి చాలా వ‌ర‌కు త‌క్కువ మందే హాజ‌ర‌య్యారు. ఆహ్వానాలు ఇచ్చినా.. రాని వారు కూడా …

Read More »

కృష్ణంరాజు వ్యాఖ్య‌ల‌ వెనుక కుట్ర‌: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని దేవ‌త‌ల రాజ‌ధానిగా పేర్కొన్న చ‌రిత్రను విస్మ‌రించి.. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్యాఖ్యానించిన జ‌ర్న‌లిస్టు, వ్యాఖ్యాత కృష్ణంరాజుపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌ధాని మ‌హిళ‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశార‌ని.. ఇలాంటివారిని ఉపేక్షించేది లేద‌న్నారు. క‌ఠినంగా శిక్షించి తీరుతామ‌ని చెప్పారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్య‌ల‌ను ముక్తకంఠంతో ఖండిస్తున్న‌ట్టు తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల ద్వారా మ‌హిళ‌ల‌ను అవ‌మానించ‌డం దారుణ‌మ‌ని అన్నారు. “ఇది …

Read More »

నా స్కూల్ బీజేపీ.. కాలేజీ టీడీపీ: రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “నా స్కూల్ బీజేపీ. కాలేజీ టీడీపీ.. ఉద్యోగం కాంగ్రెస్‌లో” అంటూ.. వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్‌లోని శిల్ప క‌ళా వేదిక‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మం లో ఆయ‌న పాల్గొన్నారు. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. ప్ర‌స్తుతం హ‌రియాణ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న బండారు ద‌త్తాత్రేయ ర‌చించిన‌.. “ప్ర‌జ‌ల క‌థే.. నా ఆత్మ‌క‌థ‌” పుస్త‌క ఆవిష్క‌రణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. దీనిలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆస‌క్తికర వ్యాఖ్య‌లు …

Read More »

అవును.. వైసీపీ ‘పేరు’పోతోంది ..!

వైసీపీ పేరు పోతోంది! ఈ మాట ఆ పార్టీ అధినేత జ‌గ‌నే చెప్పారు. తాజాగా పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న చెప్పిన మాట ఇదే!!. అయితే.. దీనిని వ్య‌తిరేకిస్తూ.. మ‌రోసారి ప్ర‌జ‌ల్లోకి రావాల‌న్న‌ది జ‌గ‌న్ ఉద్దేశం. కానీ, అలా వ‌చ్చేందుకు ఛాన్స్ క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. వైసీపీ హ‌యాంలోనే.. ‘పేరు’ రాజ‌కీయాలు జ‌రిగాయి. అప్ప‌ట్లో అన్న క్యాంటీన్ల‌ను తొల‌గించారు. వీటిని నిర్వీర్యం చేయ‌డం ద్వారా చంద్ర‌బాబుకు పేరు రాకుండా చేయాల‌న్న దురుద్దేశం …

Read More »

రేర్ వీడియో!.. కేసీఆర్ పక్కన లోకేశ్!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆదివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఏపీలో అధికార కూటమి రథసారథి టీడీపీ అంటే నిత్యం ఎగిరెగిరిపడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్.. ఇద్దరూ పక్కపక్కనే కలిసి కూర్చుని కనిపించారు. అంతేకాదండోయ్… కేసీఆర్, లోకేశ్ లు కలిసి కూర్చోగా, కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి వెనకాలే నిలబడి కనిపించారు. ఈ …

Read More »

సొంత పార్టీ… అయితే ఏంటి.. ఈ నేత‌ల‌కు చెక్ పెట్టాలా ..!

కూట‌మి ప్ర‌భుత్వంలో పార్టీల నాయ‌కుల తీరు .. “అయితే ఏంటి?” అన్న‌ట్టుగానే ఉంది. టీడీపీలోనే కాదు.. జ‌న‌సేన‌, బీజేపీల్లో కూడా.. నాయ‌కుల వ్య‌వ‌హార శైలి.. ఆయా పార్టీల అధినేత‌ల‌కు, అదిష్టానానికి కూడా త‌ల‌నొప్పిగానే మారింది. అంద‌రూ అని కాదు కానీ… కొంద‌రు మాత్రం త‌మ తీరును మార్చుకోలేక పోతున్నార‌న్న చ‌ర్చ పార్టీల‌లో విస్తృతంగా సాగుతోంది. “సొంత పార్టీ.. అయితే ఏంటి?” అనే త‌ర‌హాలో నాయ‌కులు రాజ‌కీయాలు చేస్తున్నారు. తాజాగా అనంత‌పురం …

Read More »