జాతిపిత, స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మాగాంధీపై 1982లో సినిమా తీసే వరకు ఆయనెవరో ప్రపంచానికి తెలియదని, కాంగ్రెస్ నేతృత్వంలోని గత కేంద్ర ప్రభుత్వాలు గాంధీ గురించి తగిన విధంగా ప్రచారం చేయలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 75 ఏండ్ల కాలంలో గాంధీకి అత్యున్నత ప్రపంచ ఖ్యాతిని తీసుకురావడం మన బాధ్యత కాదా? అని ఆయన ప్రశ్నించారు. ‘గాంధీజీ చాలా గొప్ప వ్యక్తి. కానీ ఆయన గురించి ఎవరికీ …
Read More »సైలెంట్ గా దించేశారు
తెలంగాణలో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో జగన్మోహన్ రెడ్డి తరహాలో కొత్త మద్యం బ్రాండ్లను రంగంలోకి దించుతుందని, దీనికి గాను రూ.5 వేల కోట్లు చేతులు మారాయని వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఏపీలో మద్యం బ్రాండ్ల గురించి తెలిసిన తెలంగాణ మద్యం ప్రియులు తెలంగాణలో ఉన్న బ్రాండ్లను తీసుకొస్తారేమో అన్న అందోళన నెలకొన్నది. అయితే తెలంగాణ ఎక్సయిజ్ మంత్రి జూపల్లి క్రిష్ణారావు కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదని, …
Read More »నన్ను చంపేస్తామన్న వాళ్లకి సీఎం రేవంత్ నెంబర్ ఇచ్చా
తెలంగాణలోని ఘోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో వివాదం సృష్టించారు. తాజాగా ఆయన.. తనకు బెదిరింపు కాల్స్ వచ్చా యని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన కేంద్ర హోం శాఖకు, పర్సనల్‌గా అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేశారు. ఇక, తెలంగాణ డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తామంటూ.. బెదిరిస్తున్నారని.. ఆ కాల్స్ కూడా.. పాకిస్థాన్ నుంచి వస్తున్నాయని ఆయన ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్టు …
Read More »అది కాంగ్రెస్ నిర్ణయమా? రేవంత్ నిర్ణయమా?
తెలంగాణలో కొత్తగా రాష్ట్రప్రభుత్వ చిహ్నం, రాష్ట్ర ప్రభుత్వ గీతం నిర్ణయాలు ప్రకంపనలు రేపుతున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలను తయారు చేయించారు. అందులో చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికపు చిహ్నాలు అంటూ వాటిని తొలగిస్తామని ప్రకటించారు. తాజాగా వాటిని రాష్ట్ర చిహ్నం నుండి తొలగించి కొత్తవి విడుదల చేసే ప్రయత్నాలు …
Read More »ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బ్రేక్?!
ఏపీలో ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కేంద్రంగా ఇప్పటికే రాజకీయ దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి సృష్టించిన విధ్వంసం.. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సృష్టించిన అరాచకం.. చంద్రగిరిలో టీడీపీ నాయకుడు.. పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం వంటివి ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా నెలకొంది. ఒకరకంగా చెప్పాలంటే.. ఆయా నియోజకవర్గాలు …
Read More »పాకిస్థాన్ నుంచి రాజాసింగ్ కు బెదిరింపులు
భాగ్యనగరం హైదరాబాద్‌లో తీవ్ర గడబిడ చోటు చేసుకుంది. ఇక్కడి ఘోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు రాజాసింగ్‌కు బెదిరింపు ఫోన్లువచ్చాయి అవి కూడా.. లోకల్ నుంచి కాకుండా.. పాకిస్థాన్ ఫోన్ నెంబర్ల నుంచి ఆయనను లేపేస్తా మంటూ .. ఫోన్లు రావడంతో ఒక్కసారిగా ఆయన హడలి పోయారు. అయితే.. తొలుత ఈ విషయాన్ని పోలీసులు లైట్ తీసుకున్నారు. ఎందుకంటే గతంలోనూ రాజా సింగ్‌కు అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. …
Read More »ప్రజెంట్ ఐఏఎస్ వర్సెస్ రిటైర్డ్ ఐఏఎస్!
ఏపీలో భూముల రాజకీయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు ముందు.. రాజకీయ నేతలు చేసిన ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ చట్టం ద్వారా.. వైసీపీ అధినేత, సీఎం జగన్ మరోసారి అధికారంలోకి వస్తే.. భూములు దోచేస్తారని.. పేదలకు నిలువనీడ కూడా ఉండబోదని.. ప్రతిపక్ష కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇదే సయమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.. పీవీ రమష్ కూడా.. దీనికి …
Read More »బెయిల్ ఎఫెక్ట్.. టంగ్ మార్చేసిన ఢిల్లీ సీఎం!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి జైల్లో రెండు మాసాలకు పైగా గడిపిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ ప్రచారం కోసం.. సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. దీంతో గత వారం నుంచి కూడా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఆరో దశ ఎన్నికల పోలింగ్‌లో ఢిల్లీలోని 7 పార్లమెంటు స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే.. బెయిల్ …
Read More »31న చంద్రబాబు-పవన్ భేటీ.. కీలక చర్చ!
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు.. ఈ నెల 31న భేటీ కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరగనున్న ఈ బేటీలో కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉందని ఇరు పార్టీల ముఖ్య నాయకులు తెలిపారు. ఎన్నికల పోలింగ్ అనంతరం ఈ నెల 13 తర్వాత.. ఇరువురు నాయకులు కూడా విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. చంద్రబాబు అమెరికాకు వెళ్లినట్టు అధికారిక ప్రకటన జారీ చేయగా, పవన్ …
Read More »‘కవిత మామూలు మహిళ కాదు.. సో పవర్ ఫుల్’
ఢిల్లీ మద్యం కేసులో నిందితురాలిగా ప్రస్తుతం జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయటం.. తనకు సాధారణ మహిళలకు ఉండే హక్కుల్ని కల్పించాలని కోరుతూ తన తరఫు లాయర్ చేత వాదనలు వినిపించటం తెలిసిందే. ఈ వాదనకు కౌంటర్ గా సీబీఐ.. ఈడీల తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సాధారణ మహిళ కాదని.. ఆమె చాలా శక్తివంతురాలన్న విషయాన్ని ఈడీ.. …
Read More »వైసీపీకి ఈక్వేషన్ల బెంగ.. ఆ నాలుగూ
ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రస్తుత ఎన్నికల్లో ఈక్వేషన్ల మంత్రం పఠించింది. స్థానికంగా ఉన్న వారిని.. సిట్టింగులను కూడా ఎన్నికల సమయంలో మార్పు చేసింది. నియోజకవర్గంతో సంబంధం లేని వారిని కూడా.. ఇక్కడ నియమిస్తూ.. తాము ప్రయోగాలు చేస్తున్నట్టు చెప్పుకొంది. అయితే.. అన్ని వేళలా ఈ ప్రయోగాలు ఫలిస్తాయని చెప్పలేని పరిస్థితి. ఇదే.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నాలుగు కీలక నియోజకవర్గాలను పార్టీ వదులుకునే పరిస్థితి వచ్చిందని …
Read More »అధికారులు వెళ్లిపోతామంటున్నారు.. ఏంటి కథ!
వారంతా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారులు. నిన్న మొన్నటి వరకు కూడా వారంతా సీఎం జగన్‌కు అత్యంత వీర విధేయులు. ఆర్థిక, ఎక్సైజ్, గనుల శాఖల అధిపతులుగా చక్రం తిప్పారు. వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు కూడా మేలు చేశారనే విమర్శలు బలంగా ఎదుర్కొన్నారు. నిత్యం ప్రతిపక్షాల నుంచి అనేక ఈసడింపులు ఎదురైనా.. నాలుగేళ్లపాటు వాటిని ఎదుర్కొన్నారు. సీఎం జగన్ ఏం చెబితే అది చేశారు. ఆయన కనుసన్నల్లోనే మెలిగారు. అనేక …
Read More »