తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ విషయంపైనా దృష్టి పెట్టారు. త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. క్రమంలో ఆయన తెలంగాణకు అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించారు. గతంలో పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్.. తర్వాత.. ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్‌లోకి వెళ్లిపోయారు. దీంతో పార్టీకి అధ్యక్షుడు లేని పరిస్థితి …
Read More »బాబుకు ఆమె బొకే ఇవ్వబోతే..
శ్రీ లక్ష్మి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వివాదాస్పదంగా మారిన ఐఏఎస్ అధికారిణి. వైఎస్ హయాంలో ఆమె అడ్డగోలుగా వ్యవహరించి ముఖ్యమంత్రి తనయుడైన జగన్‌కు మేళ్లు చేసిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న తెలిసిందే. అవినీతి కేసుల్లో చిక్కుకుని జైలు జీవితం కూడా అనుభవించారామె. ఐతే అంత జరిగాక కూడా శ్రీలక్ష్మిలో ఏ మార్పూ రాలేదనే చర్చ జరిగింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆమెకు ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చారు. గత ఐదేళ్లలో …
Read More »జగన్‌ను ఇంతమాట అనేశావేంటి బుచ్చయ్యా!
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ సీనియర్ నాయకుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మనసులో ఉన్న కసినంతా ఆయన బయట పెట్టేసుకున్నారు. ప్రస్తుతం ఓటమి భారంలో ఉన్న జగన్.. నాయకులను ఊరడిస్తున్నారు. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నాయకులతో ఇంటరాక్ట్ అవుతూ.. వారిలో ధైర్యం నూరిపోస్తున్నారు. మనకు 40 శాతం ఓటు బ్యాంకు ఉందని అది ఎటూ పోలేదని కూడా …
Read More »లోకేష్, భరత్.. యువ మంత్రులకు పెద్ద శాఖలు!
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్‌కు మరిన్ని బాధ్యతలు పెంచారు సీఎం చంద్ర బాబు. రాష్ట్ర విద్యాశాఖ మొత్తాన్నీ ఆయన చేతిలోనే ఉంచారు. అదేవిధంగా కీలకమైన ఐటీ శాఖను కూడా నారా లోకేష్‌కు అప్పగించారు. గతంలోనూ నారా లోకేష్ మంత్రిగా పనిచేశారు. కానీ, అప్పట్లో ఐటీ శాఖను మాత్రమే ఆయనకు బాబు పరిమితం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం నారా లోకేష్‌కు బాధ్యతలు పెంచా రు. ప్రస్తుతం …
Read More »రద్దన్నదే ముద్దయింది కదా జగన్!
జగన్.. అంటే ఏంటి? అని ఇటీవల జాతీయ రాజకీయ నాయకుడిని ప్రశ్నిస్తే.. ‘అర్ధంకాని పేజీ’ అని బదులిచ్చారు. నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే.. తాను తీసుకున్న నిర్ణయాలను ఆయన ఒక్కసారి అద్దం ముందు నిలబడి ‘ఇవి సరైనవేనా?’ అని ఆలోచించుకుంటే.. ఆయనకే తత్వం బోధపడుతుంది. ఒక్కసారి ఇచ్చిన ఛాన్స్‌ను ఒబ్బిడిగా వినియోగించుకుని ..ప్రజల మన్ననలు పొందాల్సిన ముఖ్యమంత్రి .. ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్‌తోనే పరిమితం కానున్నారనే కామెంట్లు మొదలయ్యారు. ఇక్కడ …
Read More »అబ్బాయ్ కేంద్ర మంత్రి .. బాబాయ్ రాష్ట్ర మంత్రి
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బండ్లు ఓడలు .. ఓడలు బండ్లు అవుతాయి. అయిదేళ్ల క్రితం 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయింది. గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితం అయిన టీడీపీ ఈ ఎన్నికల్లో సొంతంగా 135, భాగస్వామ్య పక్షాలతో కలిపి ఏకంగా 164 స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా కూటమి 21 లోక్ సభ స్థానాలు గెలుచుకోగా, …
Read More »జగన్.. ‘ప్రజాయాత్ర’ ఎప్పటి నుంచంటే!
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. త్వరలోనే మళ్లీ ప్రజాబాట పట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ నెల 4న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీచిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. నిజానికి ఇది 2019 ఎన్నికల ఫలితంతో పోల్చుకుం టే ఘోర పరాభవం. అప్పట్లో 151 సీట్లు రాగా.. ఇప్పుడు 11కు పరిమితం అయిపోయింది. దీంతో పార్టీని గాడిలో …
Read More »చంద్రబాబు దగ్గరే ఈ శాఖలు.. మంచి నిర్ణయం!
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గ బృందానికి శాఖలు అప్పగించారు. వీటిలో కీలకమైన శాఖలను కొన్నింటిని మాత్రం తనవద్దే పెట్టుకున్నారు. వీటిలో సాధారణ పరిపాలన శాఖ అత్యంత కీలకం. గతంలో దీనిని ఆయన వద్దే పెట్టుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా ముఖ్యమంత్రులు దీనిని వేరే వారికి ఇస్తుంటారు. కానీ.. సాధారణ పరిపాలనను కట్టడి చేసేందుకు.. మంత్రులు, నేతలు, అదికారుల దూకుడును నియంత్రించేందుకు ఈ శాఖను ముఖ్యమంత్రి వద్దే …
Read More »పయ్యావులకు పెద్ద పీట.. ఆనంకు ఊహించని గౌరవం!
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రివర్గ బృందంలోని వారికి శాఖలను కేటాయించారు. అయితే.. అందరూ ఊహించినట్టుగానే అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక శాఖను అప్పగించారు. ఇది ఆయనకు సముచిత గౌరవమే కాదు.. ఒకరకంగా చెప్పాలంటే పెద్దపీట వేశారనే అనాలి. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలతో కూడిన హోం శాఖ తర్వాత.. ఆర్థిక శాఖ అత్యంత కీలకం. గతంలో యనమల రామకృష్ణుడు ఈ …
Read More »బిగ్ బ్రేకింగ్ : ఏపీలో ఎవరికి ఏ శాఖ ?
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, నారా లోకేష్ కు ఐటీ, అచ్చెన్నాయుడుకు ఐటీ శాఖ కేటాయించారు. చంద్రబాబు నాయుడు : ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ : డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు నారా లోకేష్ : మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ …
Read More »జగన్ వైఫల్యం గుర్తుకు రావట్లేదా?
నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయంతో అధికారంలోకి రావడం ఆలస్యం.. ప్రతిపక్ష పాత్రలోకి మారిన వైసీపీ టార్గెట్ ఏంటో స్పష్టం చేసేసింది. చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా చూడాలని.. కాని పక్షంలో దాని మీదే రాజకీయం చేయాలని వైసీపీ మద్దతుదారులు ఫిక్సయిపోయారు. నిజానికి దానికి మించిన రాజకీయ ఎజెండా కూడా ఆ పార్టీకి ఏమీ లేదు. టీడీపీ వాళ్లు …
Read More »ఈ టీడీపీ సీనియర్లలో ఒకరికి గవర్నర్ పోస్టు!
టీడీపీకి అంతా హ్యాపీనే! జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. బీజేపీకి టీడీపీతో అవసరముంది. అందుకే టీడీపీ ఆనందాన్ని మరింత పెంచుతూ ఆ పార్టీ నాయకుల్లో ఒకరిని గవర్నర్‌గా చేసే అవకాశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. టీడీపీ సూచించిన నాయకుడికి గవర్నర్ పోస్టు …
Read More »