పార్టీలు బలంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో నాయకుల బలం కూడా ముఖ్యం. గత ఎన్నికల్లో విజయం దక్కించుకుని ఎమ్మెల్యేలు అయిన వారిలో కొందరు దూకుడుగా ఉంటే.. మరికొందరు మౌనంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి తీరు ఎలా ఉందనేది పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. కీలకమైన పోలవరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో చిర్రి బాలరాజు విజయం దక్కించుకున్నారు. జనసేన తరఫున తొలిసారి ఇక్కడ విజయం సాధించారు.
అయితే.. రాష్ట్రంలో ఎస్టీ నియోజకవర్గాలు ఎన్నో ఉన్నా.. పోలవరం నియోజకవర్గం వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. 2014-19 మధ్య టీడీపీ తరఫున గెలిచిన శ్రీనివాసరావు పై వసూళ్ల ఆరోపణలు వచ్చాయి. తర్వాత.. 2019-24 మధ్య కూడా ఈ ఆరోపణలు వచ్చినా.. ఇంత భారీ రేంజ్‌లో అయితే రాలేదు. ఇక, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తికర విషయం. జనసేన తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్న చిర్రి బాలరాజు.. 2019 ఎన్నికల్లోనూ పోటీ చేశారు. పార్టీ పట్ల అంకిత భావంతో ఉంటున్నారు.
ఈ క్రమంలో ఆయన పార్టీ సిద్ధాంతాల మేరకు పనిచేస్తు్నారన్న టాక్ తెచ్చుకున్నారు. అవినీతి, అక్రమా లకు దూరంగా ఉంటున్నారన్న పేరు వచ్చింది. ముఖ్యంగా ఇతర విషయాల్లో ఆయన జోక్యం లేకుండా ఉండడంకలిసి వస్తోంది. అయితే..సహజంగానే పోలవరం నిర్వాసితుల సమస్యలు మాత్రం ఎవరు ఉన్నా.. సెగ పెడుతున్నాయి. గతంలో తీసుకున్న బూములకు సంబంధించి ఇంకా పరిహారం ఇవ్వకపోవడంతో ఇక్కడి వారు ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచుతున్నారు.
ఇక, ఇతర విషయాలు కామన్‌గానేఉన్నాయి. అయితే.. ఆరోపణలు లేకపోవడం.. గ్రూపు రాజకీయాలు లేక పోవడం చిర్రికి కలిసి వస్తున్న అంశాలు. అంతేకాదు.. పార్టీ చెప్పినట్టు చేస్తున్నారన్న పేరు కూడా ఉంది. పోలవరంలో ఒకప్పుడు రోడ్లకు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. దీనిపై ఎమ్మెల్యేగా చిర్రి ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి ఇప్పుడు చాలా వరకు రోడ్లు నిర్మించారు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు ప్రయ త్నం చేస్తున్నారు. ఇదేసమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ రక్షణ చర్యలు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటున్నారు. దీంతో ఆయనకు మంచి గ్రాఫే పెరుగుతోందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates