Political News

పోతిన‌కు సెగ‌.. ఫోన్లు స్విచ్ఛాఫ్.. !

విజ‌య‌వాడ‌కు చెందిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ జ‌న‌సేన నేత‌.. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న పోతిన వెంక‌ట మ‌హేష్‌కు తొలి అడుగులోనే సెగ పుట్టింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క వ‌ర్గం నుంచి జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున పోటీ చేయాల‌ని భావించిన పోతిన‌కు .. పార్టీ అధిష్టానం శ్రీముఖం చూపించింది. దీంతో నాలుగు మాట‌లు అనేసి.. ఆ వెంట‌నే వైసీపీలోకి జంప్ అయ్యారు. అప్ప‌టి ఉంచి ఖాళీగా …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. కొన్ని ప్ర‌శ్న‌లు.. !

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. వ‌చ్చే ఏడాది నుంచో ఆపై ఏడాది నుంచో పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్న‌ట్టుగా సంకేతాలు పంపుతున్నారు. ఈవిష‌యంపై అనుకూల మీడియా జోరుగా క‌థ‌నాలు రాస్తోంది. అయితే..ఈ పాద‌యాత్ర‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. అస‌లు పాద‌యాత్ర ప్రారంభిస్తే.. జ‌గ‌న్ కు కొన్నిప్ర‌శ్న‌లు ఎదురు కాక‌త‌ప్ప‌దు. పాద‌యాత్ర అనేది నాయ‌కులు చేయ‌డం త‌ప్పుకాదు. ఆమాట‌కు వ‌స్తే.. న‌ర్మ‌దా బ‌చావో ఆందోళ‌న్ స‌మ‌యంలో అనేక మంది …

Read More »

పాక్ వ‌క్ర‌బుద్ధి: `ఒప్పందానికి` తూట్లు.. మ‌ళ్లీ కాల్పులు

పాకిస్థాన్ త‌న వ‌క్ర‌బుద్దిని మ‌రోసారి బ‌య‌ట పెట్టుకుంది. భార‌త్ దాడుల‌కు భీతిల్లిన దాయాది దేశం.. అమెరికాతో మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయించుకుని.. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి ముందుకు వ‌చ్చింది. దీంతో భార‌త్ కూడా.. స‌రేన‌ని ఒప్పుకుంది. ఈ ఒప్పందం ప్ర‌కారం.. శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి ఇరు దేశాలు కూడా.. కాల్పులకు పాల్ప‌డ‌కూడ‌ద‌ని.. పాల్ప‌డ‌వ‌ని కూడా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని, భార‌త్‌, పాకిస్థాన్‌లు కూడా ధ్రువీక‌రించారు. …

Read More »

వైరల్ వీడియో.. పోలీసులతో రజినీ బాహాబాహీ

ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం జరిగిన ఓ వివాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఈ వీడియోలో వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీ.. పోలీసు అధికారులను నెట్టివేస్తున్న దృశ్యాలతో పాటుగా రజినీని చాకచక్యంగా తప్పించి ఆమె కారులోని శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులను అడ్డగించే క్రమంలో రజినీ సాగిన తీరుతో పాటు.. …

Read More »

సీజ్ ఫైర్ పై భారత్, పాక్ రియాక్షన్

భారత్, పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా భారత విదేశాంగ శాఖ కూడా ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్, పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని భారత విదేశాంగ శాఖ …

Read More »

భారత్, పాక్ యుద్ధానికి చెక్ పెట్టిన ట్రంప్

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అనధికారికంగా యుద్ధం జరుగుతున్న క్రమంలో రేపో,మాపో అధికారికంగా కూడా మిలిటరీ చర్యలకు ఇరుదేశాలు దిగబోతున్నాయని ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, ఒక రాత్రంతా సుదీర్ఘ …

Read More »

నా సిందూరాన్ని దేశ రక్షణకు పంపిస్తున్నా: నవవధువు

మహారాష్ట్ర జల్గావ్ జిల్లా పచోరా తాలూకా పుంగావ్ గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాహం మే 5న కలాంసర గ్రామానికి చెందిన యామినితో ఘనంగా జరిగింది. సాధారణంగా పెళ్లి అనంతరం ఒక కొత్త జంట కలిసిన ప్రతి క్షణం ఆనందాన్ని పంచుకుంటూ గడపాలి. కానీ ఈ జంటకు అది సాధ్యం కాలేదు. పెళ్లైన మూడో రోజే పాటిల్‌కు ఆర్మీ నుంచి అత్యవసర పిలుపు రావడంతో, తక్షణం విధుల …

Read More »

మోడీని చంపేస్తామ‌న్న ఉగ్ర‌వాది హ‌తం..

నాలుగేళ్ల కింద‌ట మోడీని చంపేస్తామ‌ని.. ఆయ‌న త‌ల తెచ్చిన వారికి బ‌హుమానం ఇస్తామ‌ని ల‌ష్క‌రే తాయిబా ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన ముద‌స్స‌ర్ ప్ర‌క‌ట‌న గుర్తుందా? అప్ప‌ట్లో తీవ్ర క‌ల‌కలం రేపిన ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌.. జ‌మ్ము క‌శ్మీర్‌పై కేంద్రం సంపూర్ణంగా దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు, స‌హా.. జ‌మ్ము క‌శ్మీర్‌లోని ల‌ద్ధాక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అప్ప‌ట్లో అలా మోడీని …

Read More »

జీ7 ప్రకటన పాక్ ను ఏకాకిని చేసినట్టే!

పహల్ గాం ఉగ్రదాడిని ప్రోత్సహించి భారత్ తో సున్నం పెట్టుకున్న దాయాదీ దేశం పాకిస్తాన్ కు ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆదుకుంటుందనుకున్న అగ్ర రాజ్యం అమెరికా తాను ఆ పని చేయలేనని బహిరంగంగానే ప్రకటన చేసింది. ఇక దన్నుగా నిలుస్తుందనుకున్న చైనా సైతం ఆదిలోనే పాక్ కు చేయిచ్చేసింది. తాజాగా జీ7 దేశాల కూటమి పాక్ ను ప్రపంచంలోనే ఓ తోడు లభించని ఏకాకిని చేసింది. పహల్ …

Read More »

ఈ టైం లో పాక్ కి అప్పు ఇచ్చిన IMF

ఎంతమంది నేతలు మారినా పాకిస్తాన్‌లో ఆర్థిక కష్టాలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. దేశం ఎదుగుదలపై దృష్టి పెట్టడం కంటే రోజూ భారత్‌పై ఆరోపణలు చేయడం, కాశ్మీర్ కోసం గొడవపడడం పాక్ ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యం. ఈ పరిస్థితిపై పాకిస్తాన్ ప్రజలే ఉమ్మేసే పరిస్థితి ఏర్పడింది. “ముందు మనం తినడానికి సరిపడే ఎదుగుదల గురించి ఆలోచించండి?” అని డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులోనూ IMF ఇచ్చిన …

Read More »

సైనికులకు అండగా జనసేనాని

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా… సంచలనంగానే నిలుస్తోంది. తాజాగా పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న వేళ భారత సైన్యంలో పనిచేస్తున్న ఏపీ సైనికులకు బాసటగా నిలిచే దిశగా పవన్ శుక్రవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే సైనికులు, వారి కుటుంబాలకు స్థిరాస్తి పన్ను నుంచి పూర్తిగా మినహాయింపును ఇస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. కేవలం నిర్ణయాన్ని …

Read More »

వేతనంతోనూ సేవ.. పవన్ కే సాధ్యం

అదేంటో గానీ…జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమమూ ప్రత్యేకంగానే నిలుస్తోంది. ఏదో సినిమా స్టార్లకు రాజకీయాలు ఫ్యాషన్ గా మారాయిలే… పవన్ కూడా ఆ దిశగానే రాజకీయాల్లోకి వచ్చారులే అంటూ పలువురు ఇదివరకు వ్యాఖ్యలు చేసినా… ఇప్పుడు పవన్ చేస్తున్న సేవను చూసి మాత్రం నివ్వెరపోతున్నారు. గతంలో ఏ ఒక్కరికీ తట్టని రీతిలో సరికొత్త రీతిలో సేవను చేస్తూ సాగుతున్న పవన్… శుక్రవారం …

Read More »