400 స్థానాలలో గెలుపు లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల్లో తలపడ్డ బీజేపీ పార్టీ 240 స్థానాలకు పరిమితం అయింది. ఈ నేపథ్యంలో మూడోసారి నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని బీజేపీ స్పష్టం చేసిన వేళ ఆర్ఎస్ఎస్ కేంద్రమైన నాగ్‌పూర్‌లో బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మద్దతుగా హోర్డింగులు వెలిశాయి. నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆయన మద్దతుదారులు ఇవి ఏర్పాటు చేశారు. మోదీ సారథ్యంలో బీజేపీ ఈ ఎన్నికల్లో …
Read More »బోరుమంటున్న బెట్టింగ్ బంగార్రాజులు !
ఏపీలో టైట్ ఫైట్ ఉంటుంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని నమ్మిన బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు ఫలితాలు చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి బోరుమంటున్నారు. అప్పులు తెచ్చి, ఆస్తులు తాకట్టుపెట్టి మరీ ఎన్నికల ఫలితాలపై పందాలు కాశారు. ఈ సారి ఎన్నికల మీద వందల కోట్ల బెట్టింగులు జరిగాయని చెబుతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం ప్రకాశ్‌నగర్‌కు చెందిన బిక్కిన సురేశ్ (30) అనే వ్యక్తి వైసీపీ …
Read More »వయనాడ్ కు వణక్కం !
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ లోక్ సభ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వయనాడ్‌లో మరోసారి విజయం సాధించిన రాహుల్ ఈసారి కొత్తగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి కూడా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఏ స్థానానికి ఎంపీగా కొనసాగుతారు, ఏ స్థానాన్ని వదులుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వయనాడ్‌ను వదులుకొని రాయ్‌బరేలీలోనే ఆయన కొనసాగే …
Read More »ముగ్గురు నాయకుల స్ఫూర్తి గీతం
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. కానీ ప్రజల మనసులను ఎప్పటికప్పుడు గెలుచుకున్న నాయకులకు బంగారు భవిష్యత్తు స్వాగతం చెబుతూనే ఉంటుంది. ఎంత కిందపడినా సరే లేచే అవకాశాన్ని బంగారు పళ్లెంలో ఇస్తుంది. దానికి మూడు అత్యుత్తమ ఉదాహరణలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవమున్న చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో కేవలం పాతిక లోపే సీట్లకు పరిమితం కావాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అధికారం ఉందన్న గర్వంతో పాలక …
Read More »థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్పీకి బొకే !
వైసీపీ పాలనలో తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్పీ స్థాయి అధికారికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి కలిసేందుకు ప్రయత్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘నన్ను అక్రమంగా నిర్బంధించి రాచమర్యాదలు చేసిన అప్పటి కృష్ణ జిల్లా ఎస్పీ జాషువా గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లాను. 2023 ఫిబ్రవరి 20 వ తేదీన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీస్ …
Read More »మినిస్టర్ నారా లోకేష్… శాఖపైనే చర్చ!
టీడీపీ యువ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పార్టీని విజయ తీరాల వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. యువగళం పాదయాత్ర ద్వారా.. పార్టీని బలోపేతం చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా ముందుకు సాగారు. అన్నింటికన్నా ముఖ్యంగా 2019లో ఓడిపోయిన మంగళగిరిలోనే పట్టుబట్టి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. భారీ మెజారిటీ కూడా సాధించారు. ఇక, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారనడంలో సందేహం …
Read More »అంతా ధనుంజయరెడ్డే.. సీఎం తర్వాత సీఎంగా వ్యవహరించాడు
ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. అనూహ్యమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం విలువ లేకుండాపోయిందని.. సర్వం.. ధనుంజయరెడ్డే అన్నట్టుగా ఓ కీలక ఐఏఎస్ వ్యవహరించారని.. తెలుస్తోంది. ఆయన కారణంగానే ఎమ్మెల్యేలకు.. జగన్ దగ్గర కనీసం గోడు వెళ్లబోసుకునే అవకాశం కూడా చిక్కలేదని.. ఫలితంగా తమ తమ నియోజకవర్గాల్లో పనులు నిలిచిపోయి.. ప్రజల ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుందని.. రాజానగరం మాజీ …
Read More »ఆ పీఠం అశ్వనీదత్ కే !
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిన్న రాజీనామా చేశాడు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, తిరుపతిలో సొంత కుమారుడు పరాజయం నేపథ్యంలో ఆయన తన రాజీనామా లేఖను టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి పంపించాడు. అయితే ఇప్పుడు టీటీడీ తర్వాత చైర్మన్ ఎవరన్న చర్చ మొదలయింది. ఈ పదవిని ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ను వరిస్తుందని అంటున్నారు. …
Read More »రిజల్ట్స్ వచ్చాయి.. ఆ వీడియోలు వైరల్
అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి కనీ వినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. వైసీపీ ఓటమి గురించి ముందే సంకేతాలు వచ్చాయి కానీ.. మరీ ఈ స్థాయిలో చిత్తవుతుందని, కేవలం 11 సీట్లకు పరిమితం అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్య నేతలు ఎన్నికల ముంగిట మాట్లాడిన కొన్ని మాటలు, చేసిన సవాళ్ల …
Read More »జనం వచ్చారు.. ఓట్లే రాలేదు: వైసీపీ అంతర్మథనం!
ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఊహించని విధంగా హైఓల్టేజ్ షాక్ తగిలింది. తాజా ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా.. భారీ మార్పులు అయితే.. ఉండబోవని ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకున్నారు. గెలిస్తే.. 100-120 సీట్లు , ఓడితే… 55-70 మధ్య సీట్లు ఖాయమని చాలా మంది లెక్కలు రెడీ చేసుకున్నారు. కానీ, ప్రజలు ఇలా తీర్పు చెప్పలేదు. ఓడించారు. అది కూడా అలా ఇలా కాదు.. ఏకంగా.. 11 సీట్లతోనే …
Read More »పిన్నెల్లి అరెస్టు… ఏ క్షణమైనా!
వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం రెడీ అయింది. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు బుధవారంతో తీరిపోతుంది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు పిన్నెల్లికి సంబంధించిన కేసులను గురువారం హైకోర్టు మరోసారి విచారించనుంది. ఈ నేపథ్యంలో కఠిన చర్యలు, ఆదేశాలు కూడా ఉంటాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఏం జరిగింది? గత నెల 13న జరిగిన సార్వత్రిక …
Read More »తప్పు చేసిన వారిని వదలేది లేదు: నారా లోకేష్
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ తాజా ఎన్నికల్లో ఘోర పరాభవంతో ఓడిపోయింది. ఇక, కూటమిలోనూ ప్రతిపార్టీ ఘనంగానే సీట్లు ఓట్లు రాబట్టుకుంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీలు చాలా హ్యాపీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ హయాంలో తప్పుచేసిన వారిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. అయితే.. ఇది కక్ష సాధింపు …
Read More »