హిందూపురంలో వ‌సుంధ‌ర దూకుడు.. బాల‌య్య‌కు డ‌బుల్ ప్ల‌స్‌.. !

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని హిందూపురంపై నందమూరి బాలకృష్ణ ముద్ర బలంగా ఉన్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో పాటు ఎలాంటి రాజకీయ వాతావరణాన్ని అయినా తట్టుకుని నందమూరి బాలకృష్ణ విజయం సాధిస్తున్నారు. 2014లో తొలిసారి అరంగేట్రం చేసిన బాలకృష్ణ వరుసగా హిందూపురంపై తన సత్తా చాటుతున్నారు. వాస్తవానికి సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ నియోజకవర్గంలో పెద్దగా ఉండడం లేదన్నది వాస్తవం. ఇది 2014 నుంచి ఉన్న ఇబ్బంది. ఈ నేపథ్యంలోనే పీఏలను నియమించి ఇక్కడ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

అయితే కొందరు పిఏలు వివాదాస్పదంగా వ్యవహరించడంతో గతంలో దుమారం జరిగింది. ఇటీవల కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. హిందూపురంలో సమస్యలు చెప్పుకునేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమాలు ముందుకు సాగకపోగా ఎమ్మెల్యే పి ఏ గా ఉన్న వ్యక్తి ప్రజల పట్ల దూకుడుగా వ్యవహరించడం, సమస్యలు చెప్పిన వినిపించ కోకపోవడం వంటివి తీవ్ర వివాదానికి దారి తీశాయి. దీనికి తోడు హిందూపురంలో వైసిపి నాయకులు ఒకంత బలంగా ఉన్నారు. నవీన్ సహా క్షేత్రస్థాయిలో నాయకత్వం ఒక ఎంత బలంగానే ఉందని చెప్పాలి.

దీంతో ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. దీనిని నిశితంగా గమనించిన బాలకృష్ణ నేరుగా తన సతీమణి వసుంధ రా దేవి ని రంగంలో కి దించారు. గత ఎన్నికల సమయంలో తొలిసారి వసుంధర దేవి నియోజకవర్గంలో పర్యటించడం ప్రచారం చేయడం తెలిసిందే. ఆ తర్వాత వైసిపి హయాంలోనే ఉచిత సంచార వైద్యశాలతో పాటు ఐదు రూపాయలకే భోజనం అందించే క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించేందుకు సంచార వైద్యశాలలు, సంచార పశు వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారు.

స్థానికంగా ఉన్న పేదల కుటుంబాల్లోని పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ లో జాయిన్ చేసి వారికి చదువును అందిస్తున్నారు. ఇట్లా వసుంధర దేవి ప్రజలకు చేరువయ్యారు. ప్రస్తుతం హిందూపురంలో మారుతున్న రాజకీయ పరిణామాలు అదేవిధంగా ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదు అని రాసి ఫ్లెక్సీలు ప్రదర్శించడంతో ఇటీవల వివాదంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని రంగంలోకి దిగిన వ‌సుంధ‌రాదేవి నియోజకవర్గంలోనే వరుసగా నాలుగు రోజులు పాటు పర్యటించారు. నియోజకవర్గం సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

అదేవిధంగా మహిళలకు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పసుపు కుంకుమ కింద కానుకలు సారే అందజేశారు. ముఖ్యంగా హిందూపురం కేంద్రంగా సత్య సాయి జిల్లాను ఏర్పాటు చేయడం లేదా హిందూపురం పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్న నేపద్యంలో ఆ విషయాన్ని కూడా వసుంధర దేవి హైలెట్ చేస్తూ నాయకులతో మాట్లాడటం వారితో చర్చించడం చేశారు. మొత్తంగా చూస్తే హిందూపురం లో బాలకృష్ణ లేని లోటును వసంధ‌రాదేవి కొంతమేరకు భర్తీ చేస్తున్నారని చెప్పాలి.