Political News

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు ‘సర్’ వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 2026 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ అమలు కానుంది. ఇప్పటికే రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు సన్నాహక పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు దశాబ్దాల తర్వాత …

Read More »

ఇక బాలయ్యకు అద్దె ఇళ్లు అవసరం లేదు

నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గమైన హిందూపురంలో సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఆయన తన సతీమణి వసుంధర దేవితో కలిసి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. గత 12 ఏళ్లుగా హిందూపురానికి వచ్చిన ప్రతిసారీ అద్దె ఇంట్లోనే ఉంటూ వచ్చిన బాలకృష్ణ, నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకుంటానన్న హామీని ఈ శంకుస్థాపనతో నెరవేర్చుతున్నారు. హిందూపురం సమీపంలోని వనం కాలనీలో సర్వే నెంబర్ 445లో సుమారు 81 సెంట్ల …

Read More »

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది. ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజనీర్లతో సహా మొత్తం ఎనిమిది మంది అధికారులను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పనుల కోసం ఈ అధికారులు అక్రమంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ​ఈ కేసులో అత్యంత …

Read More »

హ‌రీష్‌రావు కంచుకోట‌ను క‌విత బ‌ద్ద‌లు కొట్ట‌గ‌లదా?

బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి.. అంత‌కుమించి మాట‌ల మాంత్రీకుడు.. త‌న్నీరు హ‌రీష్ రావు గురించి చెప్ప‌డానికి ఇవి చాలు. అంతేకాదు.. సిద్దిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌రకు ఆయ‌న పోటీ చేసిన ప్ర‌తి సారీ విజయమే అందుకున్నారు.. త‌ప్ప‌.. ప‌రాజ‌యం అన్న‌మాటే లేదు. అలాంటి నాయ‌కుడి ఇలాకాలో పోటీ చేసేందుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమె ప్ర‌క‌టించారు. పైకి ఆమె బోధ‌న్‌, సిద్దిపేట …

Read More »

చూసిందే న‌మ్మండి: భువ‌నేశ్వ‌రి వీడియో ఎందుకంటే!

“చూసిందే న‌మ్మండి”- అంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి గ‌త రాత్రి సోష‌ల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియోను పోస్టు చేశారు. దీనిలో ఆమె.. తాను.. వైస్ చైర్స‌న్‌, ఎండీగా ఉన్న ‘హెరిటేజ్‌’ సంస్థ‌కు సంబంధించిన అంశాల‌ను ప్ర‌స్తావించారు. “చూసిందే నమ్మండి. గ‌త 33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 …

Read More »

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ ప్రస్తుతం అనర్హత వేటు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యారు? కేసీఆర్‌ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కడియం శ్రీహరిని బీఆర్ఎస్ నేతలు ఏకిపారేస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం రంగులు మార్చే కడియం వంటి నేతలకు …

Read More »

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఏదో ఒక రాష్ట్రం గురించి కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వనరులను ఉచిత పథకాల రూపంలో పంపిణీ చేయడం కంటే, ప్రజల జీవితాలను మెరుగుపరిచే పక్కా ప్రణాళికలతో ముందుకు రావాలని స్పష్టం చేసింది. నిరుద్యోగ నిర్మూలన వంటి దీర్ఘకాలిక …

Read More »

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో కేటాయింపులు సరిగా లేవని విమర్శించారు. అంతేకాదు, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు లోకేష్ కొలంబోకు వెళ్లాలా? ఇంట్లో టీవీలో చూస్తే సరిపోదా అంటూ జగన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దేశంలో బాధ్యతాయుతమైన …

Read More »

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీడీపీలో చేరి ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ…ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కొనసాగుతున్నారు. అయితే, రఘురామపై సాక్షి మీడియా కథనాలు రాస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే సాక్షి మీడియా గ్రూపుపై చట్టపరమైన చర్యలకు …

Read More »

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా వీక్షించేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. చిన్న‌నాటి నుంచే విద్యార్థుల్లో రాజ‌కీయ అంశాల‌పై అవగాహ‌న క‌లిగేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, ఎమ్మెల్యేలు, మంత్రుల‌లో ఒత్తిడి తగ్గించేందుకు ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు క్రీడ‌ల పోటీలు కూడా నిర్వ‌హించ‌నున్నారు. తాజాగా.. చేనేత‌ల‌కు అండ‌గా ఉండేలా.. అసెంబ్లీలో చేనేత వస్త్ర ప్రదర్శనను …

Read More »

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో అభ్యర్థులలో హర్షం వ్యక్తం అవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించారు. అతి తక్కువ సమయంలోనే కోర్టు కేసులను అధిగమించి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. గత డీఎస్సీ ఒక రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత ఏటా డీఎస్సీ వేస్తామని …

Read More »

ర్యాలీ పేరుతో అంబటి హడావిడి

రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజమండ్రి నుంచి ఆయన వాహనం కదిలిన వెంటనే మిగతా వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. మూడుకంటే ఎక్కువ వాహనాలు ఉండకూడదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకు దిగిన జక్కంపూడి రాజా సహా వైఎస్ఆర్సిపి నేతలు పోలీసుల తీరును ప్రశ్నించారు. …

Read More »