వైసీపీ నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి బెయిల్ లభించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే… పలు షరతులు విధించింది. అంతేకాదు.. కేవలం 5 రోజులు మాత్రమే బెయిల్‌పై బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం గమనార్హం. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న లిక్కర్ కుంభకోణంలో నిధులను దారి మళ్లించడంతోపాటు… కొత్త పాలసీ ప్రకారం.. ఎవరు ఎంత …
Read More »చిన్న మార్పులతో పెద్దనేతగా నారా లోకేష్!
నారా లోకేష్. ఇప్పుడు దేశ వ్యాప్త రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న పేరు. వాస్తవానికి ఆయన మంత్రి. గతంలో ‘యువగళం’ పాదయాత్ర ద్వారా సుదీర్ఘ దూరం ప్రయాణించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయినప్పటికీ, ఇప్పుడు మరో కోణంలో నారా లోకేష్ పేరు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఇక, ఆయన వ్యవహార శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో చంద్రబాబు తర్వాత స్థానాన్ని …
Read More »సక్సెస్ మంత్రం: విలేజ్ పాలిటిక్స్‌పై జనసేన వ్యూహం
ఏపీలోని గ్రామీణ స్థాయిలో రాజకీయాలు పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామస్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా జనసేన పార్టీ ‘విలేజ్ పాలిటిక్స్’ పై దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తున్న నేపథ్యంలో తమ పార్టీని పుంజుకునేలా చేయాలనేది జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహం గా ఉందని నాయకులు చెబుతున్నారు. పంచాయతీరాజ్ …
Read More »ముహూర్తం పెట్టేశారు.. జగన్ తేల్చేశారు!
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 18 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సుమారు వారం రోజులపాటు జరుగుతాయని అధికార పార్టీ వర్గాల్లో అంచనా ఉంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఈ దఫా అసెంబ్లీ సమావేశాలకు చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఏడాదిన్నర కాలంలో చేపట్టిన సంక్షేమ …
Read More »పొలిటికల్ చిత్రం: జనసేనకు అధికార ప్రతినిధులు కావలెను..!
రాజకీయాల్లో ఏ పార్టీకైనా.. నలుగురుకావాలి. నాయకుల తరఫునే కాకుండా.. పార్టీ తరఫున కూడా స్పందిం చేందుకు అధికార ప్రతినిధులు అన్ని పార్టీలకూ చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో ఏపీలోని కీలక పార్టీలు పెద్దగా స్పందించడం లేదని అంటున్నారు. ముఖ్యంగా మూడు పార్టీలకు అధికార ప్రతినిధులు లేకుండాపోయారు. వీటిలో రెండు కూటమిలోనే ఉండగా.. మరొకటి కాంగ్రెస్ పార్టీ. ఈ మూడు పార్టీల్లోనూ అధికార ప్రతినిధుల కొరత వెంటాడుతోంది. ఎవరూ కూడా …
Read More »భారత్ దమ్మేంటో ట్రంప్ కు తెలిసొచ్చింది!
అమెరికా అంటేనే ప్రపంచ దేశాలన్నీపెద్దన్నగా, అగ్ర దేశంగా పరిగణిస్తూ గౌరవిస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా ఆ దేశానికి అధ్యక్షులుగా వ్యవహరించిన వారంతా ఆ గౌరవాన్ని కాపాడుకున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన తొలి టెర్మ్ లో సవ్యంగానే నడుచుకున్నారు. అయితే ఎందుకనో గానీ రెండో సారి అధ్యక్ష పీఠం అందగానే ఆయనలోని వింతలు, వికారాలు అన్నీ బయటకు వచ్చాయి. విదేశాలన్నింటినీ పూచిక పుల్లల్లా తీసివేసిన ట్రంప్… అందులో …
Read More »రాజకీయ గురువులు.. ఇప్పుడెంతమంది ..!
విద్యార్థులకే కాదు.. రాజకీయాల్లోకి వచ్చిన వారికి.. ఉన్నవారికి కూడా గురువులు ఉంటారనే విషయం తెలిసిందే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా.. రాజకీయ గురువులు కూడా మారిపోతున్నారు. ఒకప్పుడు.. జాతీయ నాయకుడిగా ఉన్న జయప్రకాష్ నారాయణ్ కు దేశవ్యాప్తంగా రాజకీయ శిష్యులు ఉండేవారు. ఇప్పటికీ .. చాలా మంది తమ గురువు జయ ప్రకాష్ నారాయణ్ అనే చెప్పుకొంటారు. రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. తాము ఎలా ఉన్న ప్రజల మేలు …
Read More »తాడిపత్రి ‘ఒప్పందం’.. పాలిటిక్స్ ఛేంజ్ ..!
ఔను! మీరు చదివింది నిజమే. నిన్న మొన్నటి వరకు రాజకీయ కాకతో రగిలిపోయిన ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలక నియోజకవర్గం తాడిపత్రిలో రాజకీయాలు దాదాపు సర్దుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య నెలకొన్న ఘర్షణలతో దాదాపు ఐదేళ్లకుగానే.. కాక రేపుతున్న ఈ నియోజకవర్గంలో ఒప్పందం కుదిరినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనికి ప్రాతిపదిక.. అమరావతేనని అంటున్నారు. కీలక నేతల మధ్య ఇక నుంచి ఇబ్బందులు రాకుండా ‘ఒప్పందం’ …
Read More »పనిమంతుడు: పొగడ్తలకు పడిపోని పెమ్మసాని…!
రాజకీయాల్లో ఉన్న వారికి పని ఎలా ఉన్నా.. పొగడ్తలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నువ్వంతంటే.. నువ్వింత .. అని అనేవారిని అక్కున చేర్చుకుని మచ్చిక చేసుకునేందుకు నాయకులు ఫస్ట్ ప్రియార్టీఇస్తున్నారు. రాజకీయాలు ఒకప్పుడు ఎలా ఉన్నా.. ఇప్పుడు నేతలను పొగడకపోతే.. పనులు జరిగే పరిస్థితి లేకుండా పోయింది. అయితే.. అందరూ అలానే ఉంటారా? అంటే.. ఒకరిద్దరు పొగడ్తలకు దూరంగా కూడా ఉంటా రు. ఇలాంటి వారిలో గుంటూరు ఎంపీ పేరు మార్మోగుతోంది. …
Read More »జగన్ ముందు గండం!… దొడ్డి దారీ సిద్ధం!
అదేంటో గానీ అధికారంలో ఉన్నన్నాళ్లు కడుపులో చల్ల కదలకుండా సాగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అధికారం దూరం కాగానే… గండాల మీద గండాలు ముంచుకొస్తున్నాయి. ఆ గండాలను ఎలాగోలా తప్పించుకుని ఆయన ముందుకు సాగుతున్నారు. తాజాగా జగన్ ముందు మరో గండం పొంచి ఉంది. అయితే ఆ గండం నుంచి తప్పించుకునేందుకు గతంలో ఆయన అనుసరించిన దొడ్డిదారి మార్గాన్నే ఈ దఫా కూడా అనుసరిస్తారని చెప్పక …
Read More »చెల్లి నుంచి ‘జాగృతి’నీ లాగేస్తున్న కేటీఆర్
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తన తోడబుట్టిన చెల్లి పట్ల మరింతగా కఠినంగా వ్యవహరిస్తున్న వైనం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేటీఆర్… తాజాగా ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను కూడా ఆమె నుంచి లాగేసుకునే యత్నాలకు పదును పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే తొలి అడుగు కూడా పడిందని చెప్పాలి. జాగృతి ఏర్పాటు సందర్భంగా …
Read More »వెరీ స్పెషల్!…మోదీతో లోకేశ్ భేటీ!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో లోకేశ్ భేటీ అయ్యారు. నాలుగు నెలల క్రితం తన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి మోదీని లోకేశ్ కలిసిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలు తిరక్కుండానే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates