Political News

ప‌తాక స్థాయికి ‘కూట‌మి’

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి.. ఈ నెల 10వ తేదీ(బుధ‌వారం)నాటికి 15 నెల‌లు నిండుతున్నాయి. ఈ క్ర‌మంలో కూట‌మి బ‌లాన్ని మ‌రింత పెంచుకునేందుకు, ప్ర‌స్తుతం ఉన్న బ‌లాన్ని ప్ర‌జ‌ల ముందు చాటేందుకు మూడు పార్టీలు స‌ర్వ‌స‌న్న‌ద్ధ‌మవు తున్నాయి. గ‌త 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌లు ఉమ్మ‌డిగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాయి. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి అధికారంలోకి వ‌చ్చాయి. ఉమ్మ‌డిగానే సీట్లు పంచుకున్నాయి. అధికారంలోకి వ‌చ్చాక ఉమ్మ‌డిగానే ప‌దవులు కూడా …

Read More »

జైల్లో క్ల‌ర్కుగా.. మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డు!

దేశ మాజీ ప్ర‌ధాన మంత్రి దేవెగౌడ మ‌న‌వ‌డు, మాజీ ఎంపీ ప్ర‌జ్వ‌ల్‌కు ‘సెక్స్ కుంభ‌కోణం’ కేసులో జీవిత ఖైదు ప‌డిన విష‌యం తెలిసిందే. క‌ర్ణాట‌క‌లోని హాస‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న దేవెగౌడ పెద్ద కుమారుడి కొడుకు ప్ర‌జ్వ‌ల్‌.. ఇంట్లో ప‌నిమ‌నిషిని బెదిరించి సెక్స్ చేశార‌ని, ప‌లుమార్లు ఆమెతో ఉన్నార‌ని, ఆయా దృశ్యాలు వీడియోలు తీసి.. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశార‌న్న‌ది కేసు. గ‌త‌ ఏడాది …

Read More »

బాబు ప్లేస్‌లో లోకేష్: కీలక బాధ్యతలు!

సీఎం చంద్రబాబు ప్లేస్‌లో మంత్రి నారా లోకేష్ కేంద్రంలో కీలక చక్రం తిప్పనున్నారు. మంగళవారం జరగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ఓటు వేయేలా ఆయనే పర్యవేక్షణ చేయనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. దీంతో సోమవారం మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఏపీకి చెందిన టీడీపీ, జనసేన ఎంపీలతో భేటీ అవుతారు. …

Read More »

మఠంలో నారా లోకేష్ పర్యటన.. మోడీ సలహా మేరకేనా?

ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా కర్ణాటకలో పర్యటించారు. అక్కడి సుప్రసిద్ధ ఆదిచుంచనగరి మహాసంస్థాన మఠాన్ని ఆయన సందర్శించారు. మఠం 72వ పీఠాధిపతి జగద్గురు నిర్మలానందనాథ మహాస్వామీజీని కలుసుకుని సుమారు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం అక్కడి కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మఠం నిర్వహణలో ఉన్న పలు స్కూళ్లు, మెడికల్ కాలేజీలను కూడా నారా లోకేష్ సందర్శించారు. వాటి వివరాలు తెలుసుకున్నారు. …

Read More »

జిల్లాకో చరిత్ర: టీడీపీలో రెండు పవర్ సెంటర్లు..!

జిల్లాకో విధంగా పవర్ సెంటర్లు ఏర్పడ్డాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నామినేటెడ్ పదవులు తర్వాత జిల్లాల్లో ఎమ్మెల్యేలకు, నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారికి మధ్య గ్యాప్ పెరుగుతోంది. తాము చెప్పిన వారికి పనులు చేయాలని నామినేటెడ్ పదవులు తీసుకున్నవారు కోరుతుండగా, తమ నియోజకవర్గంలో తమ మాటను కాదని పనులు చేయడానికి వీలులేదని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఎక్కువగా ఇది టిడిపిలోనే కనిపిస్తుండటం, పవర్ …

Read More »

పులివెందుల‌పై మ‌రో స్ట్రాట‌జీ.. జ‌గ‌న్ అలెర్ట్ అవుతారా..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌పై మ‌రో వ్యూహంతో ముందుకు సాగాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున క‌స‌రత్తు కూడా ముమ్మ‌రం చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన పులివెందుల‌, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. వైసీపీ త‌ర‌ఫున ఈ రెండు చోట్ల పోటీ చేసిన వారికి కనీసం డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. ఈ పెను దెబ్బ నుంచి వైసీపీ …

Read More »

ముందు మీరు.. త‌ర్వాతే.. నేను: జ‌గ‌న్ తీరుపై వైసీపీ విస్మ‌యం

‘జ‌గ‌న్ అంటే జ‌నం-జ‌నం అంటే జ‌గ‌న్‌’ ఒక‌ప్పుడు వైసీపీలో వినిపించిన నినాదం ఇది. అయితే.. రాను రాను ఈ నినాదం రూటు మారుతోంది. జ‌నం కోసం వైసీపీ చేస్తున్న కార్య‌క్ర‌మాలే త‌గ్గిపోగా.. ఇప్పుడు అర‌కొర‌గా నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు కూడా జ‌గ‌న్ లేకుండా పోతున్నారు. ఆయ‌న తాపీగా తాడేప‌ల్లిలోని ఆఫీసులో కూర్చొని కునుకు తీస్తుండ‌గా.. ఇత‌ర నాయ‌కులు, కార్యకర్త‌లు రోడ్డెక్కాల‌ని కోరుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయా కార్య‌క్ర‌మాలు మొక్కుబ‌డి ఫొటో సెష‌న్లుగా …

Read More »

మ‌ద్యం స్కామ్‌లో సంచ‌ల‌నం.. ‘వారంద‌రికీ’ బెయిల్‌!

ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ట్టుగా ప్ర‌భుత్వం చెబుతున్న లిక్క‌ర్ కుంభ‌కోణంలో తాజాగా సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో మొత్తం 3500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు చేతులు మారాయ‌ని, దారి మ‌ళ్లాయ‌ని, విదేశాల‌కు సైతం పంపించార‌ని ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు చెబుతున్నారు.ఈ క్ర‌మంలోనే 14 మందిని అరెస్టు చేశారు. వీరంతా హైప్రొఫైల్ ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, తాజా ప‌రిణామాల‌తో ఈ కేసు …

Read More »

బాబు ఎఫెక్ట్‌: జ‌గ‌న్‌కు మ‌రింత డ్యామేజీ.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్ అనుస‌రిస్తున్న మొండి వైఖ‌రిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ‌మవుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ కు ఇంటా బ‌య‌ట కూడా సెగ త‌గులుతోంది. స‌భ‌కు వెళ్లాల్సిందేన‌ని.. సీమ‌కు చెందిన నాయ‌కులు కోరుతున్నారు. ఇప్ప‌టికే భారీ డ్యామేజీ జ‌రిగింద‌ని.. దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు స‌భ‌ను వినియోగించుకుందామ‌ని.. చెబుతున్నారు. కానీ.. జ‌గ‌న్ మాత్రం, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ఇస్తే త‌ప్ప‌! …

Read More »

నేత‌ల కుంప‌టి: దేన్నీ వ‌ద‌ల‌ట్లేదు

టిడిపి అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పి ఎదురవుతోంది. క్షేత్రస్థాయిలో నాయకులను ఆయన ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా.. పరిస్థితిలో మార్పు అయితే కనిపించడం లేదు. ఏడాదిన్న‌ర కాలంగా అనే విషయాలలో క్షేత్రస్థాయి నాయకులు చేస్తున్న తప్పుల కారణంగా ప్రభుత్వం నిందలు పడాల్సిన‌ పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లోనూ చులకన భావం కనిపిస్తోంది. చంద్రబాబు హెచ్చరికలు ఏమాత్రం పనిచేయడం లేదన్నది సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాట. గతంలో ఇసుక, లిక్కర్ విషయంలో …

Read More »

లైట్ తీసుకున్న హ‌రీష్ రావు: క‌విత‌కు డ్యామేజీయేగా!

బీఆర్ఎస్ కీల‌క‌నాయ‌కుడు, ఎమ్మెల్యే హ‌రీష్ రావుపై ఆపార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురై.. చివ‌ర‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ క‌విత తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి చేశార‌ని.. దోచుకున్నార‌ని.. కానీ, త‌న తండ్రి కేసీఆర్‌ను మాత్ర‌మే ప్రొజెక్టు చేస్తున్నార‌ని ఆమె మీడియ ముందు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల దుమారం నేప‌థ్యంలోనే పార్టీ అధిష్ఠానం క‌విత‌పై చ‌ర్య‌లు తీసుకుని స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఇది జ‌రిగిన త‌ర్వాత‌.. …

Read More »

ఏపీ స‌ర్కారుకు.. ‘తుర‌క‌పాలెం’ మ‌ర‌క‌!

ఏపీ ప్ర‌భుత్వానికి.. గుంటూరు జిల్లా తుర‌క‌పాలెంలో జ‌రుగుతున్న భారీ మ‌ర‌ణాలు మ‌ర‌క‌లుగా మారుతు న్నాయి. గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో 80 మందికి పైగా ఇక్క‌డి ప్ర‌జ‌లు మృతి చెందారు. అంతు చిక్క‌ని జ్వ‌రాల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. ఈ జ్వ‌రాల బారిన ప‌డిన‌వారు.. అతిత‌క్కువ కాలంలోనే మృతి చెందుతున్నారు. దీనిపై ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వ‌స్తున్నా.. పెద్ద‌గా ప్ర‌భుత్వం స్పందించ‌డం లేద‌న్న విమ‌ర్శ లు వ‌స్తున్నాయి. గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రబలిన …

Read More »