Political News

పవన్ తల్లికి అనారోగ్యం.. నిజమెంత?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురయ్యారని, ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ కేబినెట్ భేటీ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారని సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా ఛానెళ్లలో కూడా ప్రచారం జరిగింది. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజనా దేవిని చూసేందుకు పవన్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారని ప్రచారం జరిగింది. ఇక, తన తల్లి అనారోగ్యం గురించి తెలుసుకున్న మెగా స్టార్ …

Read More »

జ‌గ‌న్ ట్రాప్‌లో చంద్ర‌బాబు? బిహైండ్ ఆఫ్‌ది డిబేట్

జగన్ ట్రాప్ లో చంద్ర‌బాబు పడుతున్నారా? జ‌గ‌న్ విమ‌ర్శ‌ల‌కు.. బాబు జంకుతున్నారా?.. చిత్రంగా ఉన్నా రాజకీయ వర్గాల్లో.. అలాగే మీడియా వర్గాల్లో కూడా ఈ ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే సహజంగా చంద్రబాబు రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. అభివృద్ధికి ఆయన ప్రాధాన్యం ఇస్తారు. ఇది ఎవరు కాదనలేని వాస్త‌వం. అభివృద్ధిని చూపించి అయినా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటారు. అది కూడా అందరికీ తెలిసిందే. అయితే వీటన్నిటికీ భిన్నంగా గత ఎన్నికల్లో సూపర్ …

Read More »

నా భార్య ఫోన్ నూ ట్యాప్ చేశారు: ఈటల

తెలంగాణలో పెను కలకలమే రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ సీనియర్ నేత, మాల్కాజిగిరీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఫోన్ తో పాటు తన సతీమణి జమున ఫోన్ కూడా బీఆర్ఎస్ సర్కారు ట్యాపింగ్ చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తన భార్య ఫోన్ నే కాకుండా… తన భార్య నడుపుతున్న జమున హ్యాచరీస్ ఫోన్లన్నీ కూడా …

Read More »

బానకచర్లపై రేవంత్ నయా వ్యూహం!

ఏపీ ప్రతిపాదిస్తున్న పోలవరం-బానకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తన వ్యూహాన్ని ఓ మోస్తరుగా మార్చుకున్నారని చెప్పాలి. మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేబినెట్ భేటీ తర్వాత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడతామని, అవసరమైతే ఈ చర్చల ప్రక్రియకు తామే ఓ అడుగు ముందుకు వేస్తామని కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్నట్లుగానే సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో రేవంత్ మాట మార్చేశారు. ముందుగా …

Read More »

యువ‌త లేని పోరు.. వైసీపీకి భారీ షాక్ ..!

ఇప్పటికిప్పుడు వైసీపీలో మార్పులు తప్ప‌వా..? అంటే తప్పవనే చెబుతున్నారు పరిశీలకులు. దీనికి కారణం తాజాగా వైసీపీ అధినేత ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రంలో నిర్వహించిన యువత పోరు భారీగా విఫలం అవ్వటమే. దీనిపై వైసీపీ చాలానే ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తామని అది కూడా ఇవ్వడం లేదు. …

Read More »

వైసీపీలో డెత్ బెల్స్ మోగించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

తాజాగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా కీలకమైన సందేశాన్ని ఇచ్చారని చెప్పాలి. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కూటమి ఐక్యత పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తర్వాత కూడా కూటమి బలంగా ఉందని చంద్రబాబు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు, అంతేకాదు ఎక్కడ ఒడిదుడుకులు లేవని ఏడాది కాలంలో ఎలాంటి ఇబ్బంది రాలేదని కూడా చంద్రబాబు చెప్పారు, భవిష్యత్తులోనూ …

Read More »

పవన్ సై అంటే డీఎంకేకు దబిడిదిబిడే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసలే మొండి ఘటం. ఓ మాట అనుకున్నారంటే… దాని కోసం ఎంత దాకా అయినా ఆయన వెళతారు. అలాంటి పవన్ గురించి ఈ తమిళనాడు మంత్రికి పూర్తిగా తెలిసినట్లు లేదు. తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎమ్మెల్యేగా ఎన్నికై… సీఎం ఎంకే స్టాలిన్ కేబినెట్ లో దేవదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న శేఖర్ బాబు సోమవారం పవన్ కల్యాణ్ ఆదివారం …

Read More »

జ‌గ‌న్‌కు మ‌ళ్లీ మోత‌.. ఆగని ష‌ర్మిల వాయింపు!

జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా ఎంత మంది ప్ర‌త్య‌ర్థులు ఉన్నా.. ఇబ్బంది లేదు. వారిపై ఎదురు దాడి చేయొచ్చు. … లేదా రాజ‌కీయంగా దూకుడుగా వ్యాఖ్యానించ‌వ‌చ్చు. కానీ, ఎటొచ్చీ.. ఆయ‌న ఎదిరించ‌లేని.. దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేని ఏకైక నాయ‌కురాలు ష‌ర్మిల‌. ఏమ‌న్నా.. ఇర‌కాట‌మే. ఏం మాట్లాడినా త‌ల‌నొప్పే.. ఇదీ ఇప్పుడు జ‌గ‌న్ ప‌రిస్థితి. రాజ‌కీయంగా విమ‌ర్శించినా.. ష‌ర్మిల సెంటిమెంటు అస్త్రం తీసేస్తున్నారు. అలాగ‌ని మౌనంగా ఉంటే.. ఇదిగో ఇలా.. వ‌ర‌స పెట్టి వాయించేస్తున్నారు. ప్ర‌స్తుతం …

Read More »

బాబు గారూ!… ఇదేం స్టామినా సారూ!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వయస్తు ప్రస్తుతం అక్షరాలా 76 ఏళ్లు. ఇన్నేళ్ల వయసులో ఇతరులైతే ఏ వీల్ చైర్ కో, లేదంటే ఒకింత నడుస్తున్నా… పట్టుమని పది నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నారు. అయితే చంద్రబాబు ఏకంగా గంటా 45 నిమిషాల పాటు ప్రసంగించి… అది కూడా నిలబడి మరీ ప్రసంగించి… అందరినీ ఆశ్యర్యానికి గురి చేశారు. 1.45 గంటల సేపు ఆయన వేదిక మీద …

Read More »

ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు బాబు గుడ్ న్యూస్‌!

ఏపీలో ఆగ‌స్టు 15వ తేదీ నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు. గ‌త ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ‘సూప‌ర్ 6’ హామీల్లో ఇది కీల‌కం. అయితే.. ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో దీనిపై అనేక అధ్య‌య‌నాలు కూడా పూర్త‌య్యాయి. దీనికి దాదాపు ఒక ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకున్నారు. జిల్లాలు, మండ‌లాల వారీగా మ‌హిళ‌ల‌కు పాసులు ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది. దీని ప్ర‌కారం.. బ‌స్సుల్లో వారు ఉచితంగా ప్ర‌యాణం …

Read More »

జగన్ పై హోమ్ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత నిప్పులు చెరిగారు. `జ‌గ‌న్ రాజ‌కీయాల‌కు ప‌నికి రాని పువ్వు` అని ఆమె పేర్కొన్నారు. “అస‌లు రాజ‌కీయాలంటే.. ఏంటో కూడా తెలియ‌ని జ‌గ‌న్‌.. రాజ‌కీయాల గురించి మాట్లాడుతున్నారు“ అని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రెంట‌పాళ్ల గ్రామంలో జ‌గ‌న్ ఈ నెల 18న నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర సంద‌ర్బంగా సింగ‌య్య అనే వైసీపీ …

Read More »

జ‌గ‌న్ కు ఆ అనుమతులు ఇవ్వొద్దు: ష‌ర్మిల డిమాండ్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌ద్ద‌ని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల డిమాండ్ చేశారు. అంతేకాదు.. అస‌లు ప్ర‌జ‌ల స‌మీక‌ర‌ణ‌ల‌కు జ‌గ‌న్‌కు అనుమ‌తి ఇస్తే.. తామే కోర్టుకు వెళ్తామ‌ని హెచ్చ‌రించారు. గుంటూరు జిల్లా రెంట‌పాళ్ల గ్రామంలో జ‌రిగిన దారుణంపై జ‌గ‌న్‌లో ఎలాంటి ప‌శ్చాత్తాపం క‌నిపించ‌డం లేద‌న్నారు. ఇలాంటి వారు ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగేందుకు అనుమ‌తి ఇస్తే.. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు భ‌ద్ర‌త లేకుండా …

Read More »